• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ విద్య మరియు శిక్షణ

తెలంగాణ టెన్త్, ఇంటర్ రిజల్ట్స్: పరీక్షా ఫలితాలపై మీ పిల్లల ఆందోళనను ఇలా తగ్గించండి

Ch Swarnalatha
11 నుంచి 16 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 24, 2022

తెలంగాణ SSC లేదా టెన్త్ క్లాస్ ఇంకా ఇంటర్మీడియేట్ ఫలితాలు రేపు అంటే  జూన్ 25న వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు తమ SSC ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ - bse.telangana.gov.in లో,  ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోగలరు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/  లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను చూసుకోవచ్చు.

పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూడడం అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది.  ప్రత్యేకించి పిల్లలక తల్లిదండ్రులు లక్షాలను సెట్ చేసి, వారి అంచనాలకు సరిపోయే ఫలితాలను ఆశించినప్పుడు. పరీక్షా ఫలితాల విడుదలకు ముందు ఒత్తిడికి గురికావడం సహజమే కానీ అది మీ మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి తమ పిల్లలు ఈ ఆందోళనను మెరుగ్గా ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చో ఈ బ్లాగ్ లో చూద్దాం:

వాస్తవానికి దూరమైన అంచనాలు కలవరపెడతాయి

మీ పిల్లల  కోసం మీరు సెట్ చేసినటార్గెట్లను మరోసారి తనిఖీ చేయండి. విద్యార్థులందరూ టాపర్‌లు లేదా మొదటి ర్యాంకర్‌లు కాలేరు. ఎందుకంటే విద్య అనేది జీవితంలో ఒక అంశం మాత్రమే. 

ఫలితాలను అతిగా చర్చించడం మానుకోండి

నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తేనే తనను తల్లితండ్రులు  ప్రేమిస్తారని, విలువనిస్తారని  మీ బిడ్డ  భావించవచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను తేలికపరచడానికి  "నువ్వు నీ వంతు ప్రయత్నం చేశావని నేను నమ్ముతున్నాను. నేను ఎపుడూ నీ వెంటే ఉన్నాను" వంటి మాటలతో  ప్రూత్సహి౦చవచ్చు.

పనితీరు పోలిక కోసం సరైన కొలతలను ఉపయోగించండి

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేది వారి ఫలితాలను ఇతర విద్యార్థితో పోల్చడం. మీ పిల్లలు బాగా రాణిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అతని/ఆమె ప్రస్తుత పనితీరును గత పనితీరుతో పోల్చడం ఉత్తమ మార్గం.

బేషరతుగా మద్దతు ఇవ్వండి

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉండటం మరియు ఫలితాలను సరైన రీతిలో తీసుకోవడం చాలా ముఖ్యం.  స్కోర్ బాగున్నా లేదా చెడ్డదదైనా,  ఎలా మార్కులు వచ్చినా  అతను మీనుంచి దూరం కాడని మీ బిడ్డ అర్థం చేసుకోవాలి.  తద్వారా ఫలితాలు ఆశించినంతగా లేనపుడు  వారు  ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా, అనారోగ్యకరమైన ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఇది అవసరం.  ఇంకా భవిష్యత్తులో సహకారం కోసం లేదా పని చేయడానికి తలుపులు తెరిచి ఉంచేలా చేస్తుంది. మీ బిడ్డను మార్కులకు మించి చూడండి!

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}