• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె

తెలంగాణ వరదలు: ప్రవాహం నుంచి పసిబిడ్డను రక్షించిన "బాహుబలి"

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 14, 2022

తెలంగాణా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు నాటకీయ దృశ్యాలను గుర్తుచేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా, మంథని పట్టణంలో గురువారం ఒక పసిప్రాణాన్ని మెడలోతు నీటిలో ఒక రెస్క్యూ వర్కర్,  బాహుబలి చిత్రం లాగా తన తలపై ప్లాస్టిక్ టబ్‌ లో మోసుకెళ్లి మరీ  రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రంలోని ఒక సూపర్ హిట్ సీన్  గుర్తుకు తెచ్చే ఈ సన్నివేశం చోటుచేసుకుంది.  వెచ్చటి దుస్తులతో చుట్టబడి ఉన్న మూడు నెలల పసికందును మేడలోతుకు చేరిన వరద ప్రవాహంలో ఒక వ్యక్తి  తన తలపై ప్లాస్టిక్ టబ్‌ను మోస్తూ కనిపించాడు. శిశువుకు తల్లిగాభావిస్తున్న’ ఒక మహిళ కూడా మరొక వ్యక్తి సహాయంతో వరద నీటిలో భయం భయంగా వెంతనదవటం చూడవచ్చు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు, మంచిర్యాల జిల్లాలో హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ యొక్క నాటకీయ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వీడియోను మీరు కూడా ఇక్కడ చూసేయండి. 

ఉత్తర తెలంగాణాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం మారథాన్ సమీక్షా సమావేశం నిర్వహించి, వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులను కోరారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వరదల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}