• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్ గర్భం

తెలంగాణ వరదలు: ఒకవారంలో ప్రసవానికి సిద్ధం కావాలంటే ప్రిపరేషన్ టిప్స్

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 16, 2022

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ ముందస్తు జాగ్రత్తగా వినూత్న నిర్ణయం తీసుకుంది. నిండు గర్భిణులు వానల, వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ప్రసవానికి ఇంకా వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలిస్తోంది.

అంతేకాకుండా వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపుగా 10వేల మంది గర్భిణులను తరలించి ముందస్తు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు  ప్రకటించారు. ప్రత్యేక వాహనం తో పాటు అన్నీ సిద్ధం చేసినట్టు వారు వివరాలు వెల్లడించారు. ఈ నేపధ్యంలో

ఒకవారంలో ప్రసవానికి సిద్ధం కావాలంటే ఎం చేయాలో చూద్దాం: 

1. మీ రాబోయే బంగారుకొండకి అవసరమయ్యే వస్తువులను సిద్ధం చేయండి

చిన్నారి మీ ఇంటికి రాకముందే మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, అసెంబుల్ చేసి, అవి పని చేస్తున్నాయా వాటిని ఎలా ఉపయోగించాలో పరీక్షించాలి. సరిగ్గా అమర్చబడిన కారు సీటు, వంటి శిశువు నిద్రించడానికి ఉయ్యాల, క్రిబ్ వంటివి. 

చాలా మందికి నర్సరీని అలంకరించడం, అందంగా  మరియు అమర్చడం అంటే ఇష్టం. కొంతమంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడువారిలో పాజిటివ్ శక్తిని నింపడానికి ఇది సరైన ప్రదేశం. చక్కటి లాన్ లేదా తోట కలిగి ఉండటం, కాలానుగుణంగా తగిన బట్టలు, డైపర్లు మరియు వైప్స్ పుష్కలంగా ఉండటం వలన మీకు మనశ్శాంతి లభిస్తుంది.

2. మీల్స్ చేయండి మరియు ఫ్రీజ్ చేయండి

నవజాత శిశువు పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం, కానీ తల్లిదండ్రులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం ఇంకా ముఖ్యం. వారు  సమతుల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. మీ డెలివరీ గడువు తేదీ వారం ఉందనగా, ముందే తయారుచేసుకోగల, నిలవ ఉండే ఆహార పదార్ధాలను తయారుగా ఉంచుకోండి.  తద్వారా మీరు అంట ఆరోగ్యకర౦ కాని బయటి ఆహారంపై ఆధారపడనవసరం ఉండదు. మీ  చిన్నారిని చూడటానికి వచ్చే స్నేహితులు, బంధువులు కొన్నిసార్లు భోజనం తీసుకురావచ్చు. కానీ మీరు ఎల్లప్పుడూ దానిపై ఆధారపడలేరు. 

3. అవసరమైన వస్తువులను స్టాక్ పెట్టుకోండి

మీ కొత్త బిడ్డను చూసుకునేటప్పుడు మీకు కావలసిన అర్జెంట్ విషయం టాయిలెట్ పేపర్ అయిపోవడం.బిడ్డ పుట్టకముందే మీరు రెగ్యులర్ గా ఉపయోగించే టాయిలెట్ పేపర్, పేపర్ టవల్స్, సేఫ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ మరియు షాంపూ మరియు సబ్బు వంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ నిల్వ చేసుకోండి. ఇందుకు అమెజాన్ వంటి సర్వీస్‌లను ఉపయోగించుకోండి. వీలైనన్ని ఎక్కువ పనులను ఆటోమేట్ చేయండి. నెలవారీ సరుకులు వంటివాటి కోసం  క్రమం తప్పకుండా డెలివరీలను షెడ్యూల్ చేయడం ద్వారా మీరు ఆదా చేయవచ్చు కూడా. ఇక మీరు ఎప్పుడైనా మీ డెలివరీ షెడ్యూల్‌ను సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

4. మీ ఫర్రి ఫ్రెండ్స్ సంరక్షణ కోసం ఏర్పాటు చేయండి

ప్రతి ఒక్కరికీ కాకపోయినా, చాలా మందికి ఖచ్చితంగా అవసరం అయిన మరొక విషయం ఏమిటంటే, బిడ్డ పుట్టిన తర్వాత మీ పెంపుడు జంతువును సరిగ్గా చూసుకునేలా ఏర్పాటు చేయడం.

మీ పెంపుడు జంతువు ఆహారం, ట్రీట్‌లు, బొమ్మలు మరియు నెలవారీ చెకప్, మందులను ముందుగానే ఏర్పాటుచేయడం  ద్వారా మీ పెంపుడు జంతువును చూసుకోవచ్చు. అలాగే, అవసరమైతే మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎవరైనా వాటితో ఉండడానికి ఏర్పాటు చేయండి.స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను మీరు అడగవచ్చు.

5. ప్రిస్క్రిప్షన్లనుఅప్డేట్ చేయండి

మీరు లేదా కుటుంబంలో ఎవరైనా క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఉంటే, లేదా భవిష్యత్తులో మీకు అవి అవసరమని తెలిస్తే, బిడ్డ రాకముందే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌లను అప్డేట్ ఆయేలా చూసుకోండి. తద్వారా మీకు, మీ కుటుంబానికి అవసరమైన మందులు, ప్రథమ చికిత్సకు అవసరమైన వస్తువులను నిల్వ చేయండి.

6. ప్రివెంటివ్ కేర్ గురించి నిర్ధారించుకోండి

మీ బిడ్డ పుట్టే వరకు, మీ ఆరోగ్య సంరక్షణ అంతా గర్భధారణకు సంబంధించినదే  అనిపించవచ్చు. అయితే, బిడ్డ పుట్టకముందే, మీరు ఇతర సాధారణ ఆరోగ్య సంరక్షణను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నివారణ, సంరక్షణ కోసం దంతవైద్యుడు మరియు ఆప్టోమెట్రిస్ట్ వద్దకు వెళ్లండి. మీకు డెంటల్ వర్క్ లేదా కొత్త గ్లాసెస్ లేదా కాంటాక్ట్‌లు అవసరమైతే, మీ బిడ్డ భూమిపైకి రాక ముందే  ఈ పనులను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించండి.

7. బేబీ ప్రూఫింగ్‌పై జంప్ స్టార్ట్ పొందండి

నిజానికి మీ బిడ్డ పెరిగి నడవగలిగినంత పెద్దగా అయ్యే వరకు బేబీ ప్రూఫింగ్‌ అవసరం లేదు.  కానీ మీ ఇంటిని మీ యువరాజు లేదా యువరాణికి పూర్తీ సురక్షితం ఎలా చేయాలి అనే ఆలోచన చేయడం, ఇంకా మీరు చేయవలసిన పనుల జాబితాలను తయారు చేయడం తప్పు కాదుగా. అలాగే, చాలా మంది తల్లిదండ్రులు బేబీ ప్రూఫింగ్‌ ను వీలయితే ముందుగానే ప్రారంభించడం మంచిదని చెప్పారు. మీ బిడ్డ చురుకుగా  ఉండవచ్చు.. ఇంకా  రెప్పపాటులో ప్రతిదానిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంటిని బేబీఫ్రూఫింగ్ చేయడానికి అవసరమైన దేనినీ మరచిపోకండి.

8. మీ కోసం కొంత సమయం తీసుకోండి

మీరు మీ బిడ్డను కనే ముందు చేయవలసిన పనుల  జాబితాలో  అన్నిటికంటే  ముఖ్యమైనది... మీ కోసం సమయాన్ని వెచ్చించడం. ఒంటరిగా ఇంకా  మీ భాగస్వామితో గడపటం చాలా అవసరం. మీరు మీ రాబోయే బిడ్డను ఎలాగూ  పూర్తిగా ఇష్టపడతారు, కానీ మీరు ఇప్పటికీ మీ భాగస్వామితో ఒంటరిగా గడపడం లేదా నిశ్శబ్దంగా గడపదానికి అవకాశం అంట త్వరగా రాకపోవచ్చు. మీ బిడ్డ ఒడిలోకి రాకముందే, మీరు ఇష్టపడే వాటిని ఆస్వాదించడానికి సమయం తీసుకోండి.

ఇందుకుగాను కొంతమంది తమ పిల్లలు పుట్టకముందే హాలిడే లేదా "బేబీమూన్లకు" వెళతారు. మీకు అవకాశం , సమయం మరియు శక్తి ఉంటే, తప్పక వెళ్ళండి! పిల్లలు లేకుండా  విహారయాత్రను వెళ్ళగలిగే చివరిసారి ఇదే కావచ్చు. 

9. హాస్పిటల్ లేదా బర్తింగ్ సెంటర్ కోసం సిద్ధంగా ఉండండి

గడువు తేదీ సమీపిస్తున్న కొద్దీ, మీరు ఆసుపత్రిలో ఉండటానికి సిద్ధం కావాలి. ఆసుపత్రికి వెళ్లడానికి ఉత్తమమైన మార్గాలను తెలుసుకోవడం మరియు మీరు హడావుడిగా డేలివరీకి వెళ్లల్సిన సందర్భంలో సూట్‌కేస్‌లను ప్యాకింగ్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. హాస్పిటల్ బ్యాగ్‌లో ఏమి ప్యాక్ చేయాలనే సూచనల జాబితా ఉంది. ఐతే మీకు అత్యవసరమైన వస్తువులు ఆసుపత్రిలో అందించబడతాయని గుర్తుంచుకోండి..

10. బర్త్ డే  అనౌన్స్ మెంట్ ను ప్లాన్ చేయండి

న్యూబోర్న్ ఫోటోగ్రాఫర్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. మీ చిన్నారి బర్త్   అనౌన్స్ మెంట్ మెయిల్‌లో పంపబోతున్నట్లయితే, ముందుగానే డిజైన్‌ను ఎంచుకోండి. మిగిలిన వివరాలను పుట్టిన తర్వాత ఖరారు చేయవచ్చు. మీరు డిజిటల్ బర్త్   అనౌన్స్ మెంట్ ను కూడా ఎంచుకోవచ్చు. అది ఎలా ఉండాలనే ఎంపిక మీ ఇష్టం, అయితే ముందుగా నిర్ణయించుకోవాలని మా సూచన.

 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}