• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ ఆరోగ్యం మరియు వెల్నెస్

10 సంవత్సరాల లోపు పిల్లలకు తెలంగాణ ప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలు

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 23, 2022

10

పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు  సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. అవసరమైతే తప్ప ఆరుబయటకు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని, అసలు పౌరులందరూ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని వాటిలో సూచించింది.

రాష్ట్రంలో 20 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో కోవిడ్ సంభావ్యత ఎక్కువగా ఉంది.  ప్రజలు పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు, ఇతర అవసరమైన కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఫేస్ మాస్క్‌లు కోవిడ్ -19కి వ్యతిరేకంగా రక్షణలో మొదటి వరుసలో నిలుస్తాయని అని ప్రభుత్వ సలహాదారు వివరించారు.

తెలంగాణ పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, తెలంగాణతో సహా భారతదేశం అంతటా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు స్వల్పంగా పెరిగాయని చెప్పారు. “కోవిడ్ కేసుల పెరుగుదల నుండి,  ఏ సంఘటనను అయినాఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రెండు డోస్‌లు టీకా తీసుకోవడం ద్వారా టీకాను సంపూర్ణం చేయడం చాలా ముఖ్యం. కోవిడ్‌కు వ్యతిరేకంగా ఫేస్ మాస్క్‌లు ధరించడం మరియు భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించడం కూడా అంతే ముఖ్యం, ”అని ఆయన అన్నారు.

అంతేకాకుండా ప్రజలను ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం ఉంచాలని ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. మరియు “పని ప్రదేశాలకు సబ్బు మరియు చేతి వాషింగ్ సౌకర్యం / శానిటైజర్ అందించాలి. ఉద్యోగుల మధ్య తగిన భౌతిక దూరం పాటించాలి.

ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. ఒకవేళ అది అనివార్యమైనట్లయితే, ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ వాష్/శానిటైజర్ వాడకం మొదలైన అన్ని కోవిడ్ తగిన ప్రవర్తనను వారు నిర్ధారించుకోవాలి.

sakshi.com

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}