"థాంక్యూ, మామా": అమ్మ ఫుడ్ ఇచ్చిన ప్రతిసారీ ఈ రెండేళ్ళ బుజ్జాయి ఎలాచెప్పాడో వైరల్ వీడియో చూడండి

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jul 01, 2022

రెండు సంవత్సరాల బుజ్జి బాబు గ్రే మీకర్ చందమామ లాగ అందమైనవాడు. ఇక అతని వీడియోలు అతను పెద్ద ఆహార ప్రియుడని, చక్కటి మర్యాద గలవాడని రుజువు చేస్తున్నాయి. పిల్లలకు చిన్నతనం నుండి నేర్పించవలసిన మానర్స్ గురించి తెలియచేస్తున్న అలాంటి ఒక వీడియో భలే వైరల్ అవుతోంది. మరి ఈ ఇంటర్నెట్ సంచలనంపై ఓ లుక్కేయండి!
పెంపుడు జంతువుల వీడియోల కంటే ఇంటర్నెట్ ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉంటే, అది బేబీ వీడియోలు మాత్రమే. ఇటీవల, వంటగదిలో ఓ బేబీ చెఫ్ స్వయంగా వంట చేస్తున్న వీడియోలు మిలియన్ల వ్యూస్ సంపాదించి వైరల్‌గా మారాయి. మరి ఇక, ఫుడ్ అంటే ఎంతో ఇష్టపడే మరొక పసిబిడ్డను చూడండి. గ్రే మీకర్, ఇంటర్నెట్ తాజా సంచలనంగా మారిన రెండేళ్ల చిన్నారి.
ఈ వైరల్ వీడియోను గ్రే తల్లి ద్వారా నిర్వహించబడుతున్న@greyandmama అనే Instagram హ్యాండిల్లోషేర్ చేయబడింది. "మై స్వీట్ లిటిల్ థాంక్స్ఫుల్ బాయ్" అని ఆమె సోషల్ మీడియాలో క్యాప్షన్‌లో రాసింది. ఈ పోస్టు బేసిగ్గా ఆమె తన చిన్నబాబుకి తినడానికి రకరకాల స్నాక్స్ అందజేస్తున్నప్పటి వీడియోల సంకలనం. దీనిలో ఆ బాబు తన ప్లేట్ ను ఉత్సాహంగా తన మమ్మీ నుండి తీసుకుంటాడు.. ప్రతిఒక్కాసారీ మానకుండా ఆమెకు కృతజ్ఞతలు చెపుతాడు. ఇలా అనేక డజన్ల సార్లు "ధన్యవాదాలు, మామా!" అనే డైలాగ్‌లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఈ క్యూట్ వీడియోలో చూడచ్చు. ఇది ఖచ్చితంగా మీ ముఖంలో చిరునవ్వు తెప్పించే తీరుతుంది. మరి మీరూ ఒకసారి చూసేయండి:

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}