• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

మీ చిన్నారులకు దూరంగా ఉంచవలసిన 10 వస్తువులు..

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 07, 2020

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఇంట్లో పసిబిడ్డలు ఉండడం సరదాగా ఉంటుంది. కానీ మీ బిడ్డ ఇల్లంతా చెల్లాచెదురుగా పడేసే బొమ్మలతో ఇల్లంతా గందరగోళంగా కూడా ఉంటుంది. మీ పిల్లలకు ఎన్నో రకాల బొమ్మలను కొనడానికి కూడా మీరు ఇష్టపడతారు. ఇంట్లో పడిఉండే ఇతర వస్తువులతో ఆడడానికి పిల్లలు ఇష్టపడతారని తర్వాత గ్రహిస్తారు. మీ పిల్లల కోసం మీరు ఎన్ని మంచి బొమ్మలు తీసుకు వచ్చినా వారు తరచుగా ప్లాస్టిక్ కవర్లు, రిమోట్ కంట్రోల్ , తాళంచెవి లాంటి వాటి కోసం వెతుక్కుంటారు. పసి పిల్లలు తమ చేతుల్లోకి వచ్చిన ప్రతిదాన్ని కోరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీ పసిబిడ్డ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన వస్తువుల గురించి తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

 

మీ పసిబిడ్డలనుండి మీరు తప్పక వీటిని దూరంగా ఉంచాలి..

 

మీ పిల్లల ఆరోగ్యానికి హానికరం, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయిన మీ పిల్లలు ఆడుకోవడానికి అనుమతించని వస్తువులు ఎన్నో ఉంటాయి. తల్లిదండ్రులు తమ పసిపిల్లల నుండి దూరంగా ఉంచవలసిన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది..

 

1. లోహపు తాళంచెవి :

తాళం చెవులు  మెరుస్తూ, శబ్దం చేస్తూ ఉండడం వలన పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయి. మరియు అవి పిల్లల చేతులకు ఎంతో కచ్చితంగా సరిపోతాయి.

అవి మురికి మరియు జిడ్డు అయిన ప్రదేశాలలో ఉంటాయి. వాటిని నోటిలో పెట్టుకుంటే మీ పిల్లలకు ముప్పుగా మారుతాయి. తాళంచెవులు పదునైన అంచులు కూడా కలిగి ఉంటాయి. ఇవి ఎన్నో విధాలుగా హానికరం. అందువల్ల మీరు వాటిని పిల్లలకు అందనంత దూరంలో ఉంచాలి.

 

2. రిమోట్ కంట్రోల్ :

రిమోట్ కంట్రోల్లోని చిన్నవి మరియు మృదువైనవి అయిన రంగు రంగుల బటన్లు మీ పిల్లలను ప్రతిసారి  ఆకర్షిస్తాయి. దురదృష్టవశాత్తు రిమోట్లు చాలా చిన్న భాగాలతో తయారుచేస్తారు. మరికొన్ని రిమోట్లలో ఇప్పటికీ కాయిన్ సైజ్ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి తీసుకుంటే పిల్లలకు ప్రాణాంతకం కావచ్చు.

 

3. పెంపుడు జంతువుల బొమ్మలు మరియు వస్తువులు :

 

మీకు ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే, ఆ పెంపుడు జంతువుల బొమ్మలు మరియు అవి తినే ఆహారపదార్థాల గిన్నెలు వాటి చుట్టూ ఉంటాయి. అది మీ పిల్లలకు హాని కలిగిస్తుంది. పెంపుడు జంతువుల బొమ్మలు మరియు వంట పాత్రలు చాలా బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. అవి పిల్లలకు చేరుతాయి. అందువల్ల మీరు దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్నారులను వాటి నుండి దూరంగా వుంచండి.

 

4. బేబీ లోషన్లు :

ఆకర్షణీయమైన ప్యాకింగ్లలో వచ్చే చిన్నపిల్లల లోషన్లు ఉండే ట్యూబులను పిల్లలు పిండడం లేదా గిరగిర తిప్పడం లాంటివి చేయడానికి ఇష్టపడతారు.

బేబీ లోషన్లు పూర్తిగా ప్రమాదకరం కానప్పటికీ, వాటితో ఆడుకోవడానికి పిల్లలను ప్రోత్సహించడం మంచి అలవాటు కాదు.

చిన్న పిల్లలకు వస్తువులను నోట్లో ఉంచుకునే అలవాటు ఉంటుంది. అందువలన లోషన్లను పీల్చుకోవడం మంచిది కాదు.

అందువలన, వాటిని మీ పిల్లలకు అందనంత దూరంలో ఉంచడం ఉత్తమం. మీరు ఉపయోగించిన వెంటనే బాటిళ్లను పిల్లలకు దూరంగా ఉంచండి.

 

5. విడిచిన బట్టలు :

ఇంట్లో కుప్పలుగా , మెత్తగా ఉన్న విడిచిన బట్టలు పిల్లలకు ఆట స్థలాన్ని  చేస్తాయి. బట్టలు మీ బిడ్డకు  ఏ రకంగా హాని కలిగిస్తాయి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు.

కానీ , మురికి బట్టలలో చెమట నుండి వెలువడే బ్యాక్టీరియా ఉంటుంది. అందువలన వాటిని నివారించాలి.

మీ చిన్నారి ఎదుగుతున్న దశలో ఉన్నందున మీరు విడిచిన బట్టలను వారికి దూరంగా ఉంచాలి . అది మీ పిల్లలు అలర్జీకి దారితీస్తుంది.

 

6. చిన్నవైన గుండ్రని వస్తువులు :

ఇంట్లో చిన్నపిల్లలు ఈజీగా పట్టుకోగలిగిన బటన్లు, కాయిన్స్, చెవి పోగులు, బోల్ట్లు మరియు ముడి కాయధాన్యాల వంటి చిన్న గుండ్రని వస్తువులను సులభంగా పిల్లలు అందిపుచ్చుకున్నారు. వాటిని నోటి లో పెట్టుకుంటారు.

కొన్నిసార్లు వీటిని నోటిలో పెట్టుకోవడం వలన ఊపిరి ఆడక పోవచ్చు, మరికొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

ఇటువంటి చిన్న వస్తువులను పిల్లలకు అందకుండా ఉండడానికి మరియు మీరు మీ ఇంటిని చక్కగా , పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్ధారించుకోండి.

అలాగే, మీరు పిల్లలకు బొమ్మలను ఖరీదు చేసేటప్పుడు చిన్న బొమ్మలను కొనకుండా చూసుకోండి.

 

7. పదునైన వస్తువులు :

హెయిర్ పిన్నులు, కత్తెర,టూత్ పిక్ లు, ఫోర్క్లు, రేసర్లు మరియు కొన్ని రకాల బొమ్మలు కూడా పదునైన అంచులు కలిగి ఉంటాయి. ఇవి మీ బిడ్డను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇవి ఎంతో చిన్నవి అయినప్పటికీ మీ పిల్లలకు ప్రమాదకరం.

 

8. వేడి వస్తువులు :

వేడి పానీయాలు, వంట నూనె, ఇనుము మొదలైనవి మనము గుర్తించకుండా పిల్లలకు అందుబాటులో ఉంచినట్లయితే అవి వారికి చాలా హానికరం. ఎటువంటి వేడి వస్తువులను పిల్లలకు దగ్గరగా వదిలేయకండి. వారు కాలిన గాయాలతో బాధపడవలసి వస్తుంది.

 

9. ఔషధాలు :

ప్రతి ఇంటిలోను ఒక భాగంగా మారిన ఔషధాలను పిల్లలకు దూరంగా ఉంచాలి. మీ పిల్లలు బాటిళ్లను పగలగొట్టవచ్చు లేదా ట్యూబ్లను  ఫీల్చవచ్చు. కొన్ని మందులను నోటిలో ఉంచుకోవచ్చు. ఇవి రియాక్షన్కు దారితీస్తాయి.

 

10. ఎలక్ట్రిక్ మరియు గాజు వస్తువులు :

 

ఓపెన్ ఎలక్ట్రిక్ సాకెట్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వీటి వలన షాక్  వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గ్లాస్స్ వస్తువులను కూడా మీ చిన్నారి పగలు కొట్టొచ్చు మరియు చిన్న గ్లాస్ ముక్కలు వారి శరీరంలోకి వెళ్లి రక్తస్రావాన్ని కలిగిస్తాయి . మరికొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు.

 

ఇది మీ పిల్లల నుండి దూరంగా ఉంచవలసిన వస్తువుల జాబితా. వీటిని మీ పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోండి. మీ పిల్లల భద్రతే మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి.


ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? ఈ జాబితాలో చేర్చడానికి మీ దగ్గర మరేదైనా సమాచారం ఉందా ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ చిట్కాలను మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}