• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

APలోని ఈ జిల్లాలో అత్యధిక కోవిడ్ పాజిటివిటీ రేటు: ఎందుకో తెలుసుకోండి!

Ch Swarnalatha
1 నుంచి 3 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 08, 2022

AP

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా కోవిడ్ -19 పాజిటివిటీ రేటుపై వీక్లీ రిపోర్ట్ ను ఇటీవల సమర్పించింది. ఈ నివేదికలో, విశాఖపట్నం జిల్లాలో 5-10 శాతం మధ్య కరోనావైరస్ పాజిటివిటీ రేటు నమోదవుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువగా ఉన్న  కరోనా పాజిటివ్‌ రేటు, అవిభక్త  విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 7.94 శాతంగా నమోదైంది. 

ఇది ఇక్కడ  ప్రజలలో  కరోనా వైరస్ వ్యాప్తి చురుగ్గా ఉన్నట్టు,  కొనసాగుతోందని సూచిస్తుంది. ఇతర జిల్లాలైన కృష్ణా, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల్లో వరుసగా 4.94, 4.79 మరియు 3.70 శాతం కోవిడ్ రేటు ఉండగా, మిగిలిన జిల్లాల్లో మూడు శాతం కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు పొరుగునే ఉన్నప్పటికీ,  విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 0.41 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదు అయింది.

ఈ జిల్లాలోనే ఎందుకు?

విశాఖపట్నం జిల్లాలో సాపేక్షంగా అధిక కరోనావైరస్ రేటు ఉండటానికి పట్టణ జనాభా యొక్క అధిక రిస్క్ కలిగించే  ప్రవర్తన, జనాభా వలసలు, చుట్టుపక్కల ఉన్న  జిల్లాల నుండి కోవిడ్ కేసులు రిఫరల్ కు రావడం. ఇంకా ఈ రేవు పట్టణం  జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో  కనెక్టివిటీ కలిగి ఉండడం కారణమని రాష్ట్ర ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.

నగరంలో పలు కేంద్ర సంస్థలు ఉండడంతో నిత్యం పనుల నిమిత్తం పలువురు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి  విశాఖపట్నం తరలివస్తు ఉంటారు. అంతేకాకుండా  నగరంలో ఉన్న విమానాశ్రయం నుండి అంతర్జాతీయ మరియు దేశీయ విమానాలు ల్యాండింగ్ మరియు టేకాఫ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, విశాఖపట్నంలో అనేక రిఫరల్ ఆసుపత్రులు ఉన్నాయి, వీటిలో APలోని పొరుగు జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి రోగులు వస్తుంటారు.

తక్షణ కర్తవ్య౦ ఏమిటి?

నగరంలోని ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. మాస్క్‌లు ధరించడం ద్వారా, ముఖ్యంగా గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు లేదా ఇతర  ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రక్షణ పొందుతారని వివరించారు.  ఒకవేళ అలాంటి వారికి లేదా ఇతరులకు కరోనా వైరస్ సోకితే భయపడాల్సిన అవసరం లేదు. 

కరోనా సోకినట్టు పరీక్షలో తెలిస్తే, వైద్యులు సూచించిన మోతాదులో మందులు తీసుకోవాలి. తమద్వారా ఇతరులకు కోవిడ్ సోకకుండా ఇంట్లోనే ఉండాలి. రోగులు సాధారణంగా రెండు, మూడు రోజుల తర్వాత మామూలు స్థితికి చేరుకుంటారు.

ఇదిలా ఉండగా, పులి మీద పుట్రలా ఆంధ్రాకు పొరుగున ఉన్న తెలంగాణాతో సహా, దేశంలోని దాదాపు పది రాష్ట్రాలు Omicron BA.2.75 అనే కొత్త సబ్-వేరియంట్‌ను గుర్తించినట్టు ఇజ్రాయెలీ నిపుణుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపధ్యంలో విశాఖపట్టణం మాత్రమే కకుడా అన్ని జిల్లాల ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}