• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ శిశువు యొక్క దంతాల ప్రక్రియను సులభతరం చేసేందుకు చిట్కాలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 26, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

అయితే ,ఇంటికి తిరిగి వచ్చాను ఎన్నో లెక్కలేని నిద్ర లేని రాత్రులు గడిపాను. గమ్యం తెలియకుండా ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగాను .ఆమెను నా చేతుల్లోనే ఉంచుకున్నాను .పిచ్చిగా పరిష్కారాల కోసం ఎదురు చూడసాగాను .అదే సమయంలో నా ఇతర స్నేహితుల అదే వయసున్న పిల్లలు తెల్లని ముత్యాల లాంటి పళ్ళతో ఎటువంటి గడబిడ లేకుండా హలో చెప్పారు.

 

పంటి ప్రక్రియను ఎదుర్కునేందుకు చిట్కాలు, సహజ నివారణలు :

 

'దీనినే సహజంగానే ఉంచండి 'అని మా శిశువైద్యుడు చెప్పిన విధంగానే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను . కానీ మా పాప నొప్పిని తగ్గించడానికి మరియు చక్కగా నిద్రపోయేందుకు సహాయపడటానికి నేను ప్రయత్నించిన సహజ నివారణల జాబితాను ఇక్కడ ఉంచాను.

 

చిగుళ్ల మసాజ్ :

 

చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి కావలసిందల్లా చల్లనినీటితో ముంచిన గాజు గుడ్డ లేదా శుభ్రమైన తడి వేలు . వృత్తాకార కదలికలతో మసాజ్ చేయండి .2 నిమిషాలు పాటు కొంచెం నొక్కుతూ మసాజ్ చేయండి . ఇది చిగుళ్ల కణజాలం పై ఒత్తిడి తీసుకువచ్చి బిడ్డకు ఒక రకమైన ఓదార్పు ను ఇస్తుంది .మొదటి రోజు నుండి ప్రారంభించినట్లు అయితే అది ఖచ్చితంగా వారి పళ్ళ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పంటి మొదలు వచ్చే సందర్భం కోసం సిద్ధంగా ఉండండి. జాగ్రత్త వహించవలసిన విషయం -మార్కెట్లో దొరికే చిగుళ్ల జల్  లాంటివి ,దంత సురక్షితం అని రాసి ఉన్నప్పటికీ ,వాటిని వాడకపోవడం మంచిది. వాటిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మరిచిపోకండి.

 

* చిరాకు పడే సమయంలో విధంగా వ్యవహరించండి :

 

అది నొప్పినుండి కలిగే అసౌకర్యం అని గుర్తించి ఓదార్చడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ బిడ్డను గమనిస్తూ ఉండండి .ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి .లేదా తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదివి వినిపించడం ద్వారా బిడ్డ దృష్టిని మరల్చండి.

 

* ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేయండి :

 

మామూలుగా ప్రతి రోజూ నిద్రపోయే సమయంలోనే బిడ్డను నిద్ర పెట్టండి .శిశువు చాలా అసహనం గా ఉన్నప్పుడు నిద్ర అన్నది చాలా ముఖ్యం . ఇది పిల్లలకు అవసరమైన విశ్రాంతి మరియు సౌకర్యాన్ని ఇచ్చి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

 

* మెత్తని ఆహారాన్ని ఇవ్వండి :

 

మెత్తని గుజ్జులాంటి ఆహారాన్ని ఇవ్వండి. ముఖ్యంగా రాత్రి సమయంలో మెత్తని గుజ్జు లాంటి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా చిగుళ్ళ నొప్పి మరియు  పుండ్లు పడడం లాంటివి తగ్గించవచ్చు.  మెత్తగా గుజ్జులాగా చేసిన కాయగూరలు , పండ్లు మరియు పాలు వంటి ఆహారాలను రాత్రిపూట ఇవ్వడం మంచిది.

 

సేంద్రియ టీథర్స్ :

 

ఇవి మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ,ఫ్యాన్సీ ఆకారాలలో ఉన్న వాటి జోలికి మాత్రం వెళ్ళకండి .మనం చూస్తున్న బి పి ఏ ,సిలికాన్ ,పి వి పి, తాలెట్స్ మరియు నైట్రో సమైన్  లేని వాటి కోసం చూడండి. రసాయనాలు ,రంగులు ,సింథటిక్ లేదా సిలికాన్ లేని నూరుశాతం సహజమైన సేంద్రీయ టీథర్స్ ను ఎంచుకోండి. సేంద్రీయ పత్తి లేదా చక్క స్పూన్ లు లేదా టీథర్స వంటి వాటిని ఎంపిక చేసుకోండి.

 

తల్లి పాలు ఇవ్వడం :

 

తల్లిపాలలో సహజమైన నొప్పి నివారిణి గుణం కలిగి ఉంటాయి .కాబట్టి బిడ్డ పంటి నొప్పి నుండి నివారణ కలిగించేందుకు తల్లిపాలను మించినది మరేదీ ఉండదు .పంటి నొప్పి కారణంగా బిడ్డ ఆహారాన్ని తీసుకోలేకపోతున్నట్లయితే తల్లిపాలు ఆకలి తీర్చడం తోపాటు ,నొప్పిని కూడా తగ్గిస్తాయి .బయట పాలను యిస్తూ ఉన్నట్లయితే బిడ్డకు పీల్చడం కష్టంగా ఉంటుంది .అందుకే  స్పూన్ లేదా ఓపెన్ కప్పు తో తాగించండి.

 

అంబర్ దంతాల నెక్లెసులు :

 

నా స్నేహితులు కొందరు వీటిని చాలా ఎక్కువగా వాడుతారు . నెక్లెస్ యొక్క అంబర్ పూసలు సుక్సినిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవి సహజంగా నొప్పిని ,మంటను తగ్గించడంతో పాటు నాడీ వ్యవస్థను కూడా శాంత పరుస్తాయి. ఇక్కడ ఒక గమనించవలసిన విషయం :శిశువు సులువుగా పట్టుకుని లాగడానికి వీలుగా కొంచెం సేపు మాత్రమే వేయాలి .మరియు రాత్రి పూట దీనిని ధరించకూడదు.ఈ పూసలు వైద్య లక్షణాలను కలిగి ఉన్నందున వీటిని బిడ్డ యొక్క చీలమండ చుట్టూ కట్టి, వెచ్చదనం కోసం చీలమండను సాక్స్ తో కప్పండి.

 

కొరికేందుకు వీలైన బొమ్మలు :

 

మంచి నాణ్యమైన చెక్క బొమ్మలు ఇవ్వండి. ఇవి సురక్షితమైనవి .వాటిని కొరకడం వలన బిడ్డలకు ఉపశమనం కలుగుతుంది .అయితే జాగ్రత్త కోసం చిన్న చిన్న భాగాలున్న బొమ్మలను ఇవ్వకండి .ఆ చిన్న చిన్న మొక్కలు లోపలికి వెళ్ళి పోయే అవకాశం ఉంటుంది.

 

చల్లని పదార్థాలు :

 

మీ చిన్నారి  మండే చిగుళ్లకు చల్లని పదార్థాలను ఇచ్చినట్లయితే కొంచెం మొద్దుబారినట్లు గా అయి చిరాకు మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అద్భుతంగా పనిచేసే మరికొన్ని అంశాలు.

 

ఒక చల్లని శుభ్రమైన బట్టను లేదా మస్లిన్ క్లాత్ ను తీసుకొని ముడులు వేసి ఇచ్చినట్లయితే కోరడానికి బాగుంటుంది .బిడ్డ కొంచెం పెద్దది అయితే మంచి ఉతికిన గుడ్డను చమోమిలే టీ లో నానబెట్టి ఇవ్వవచ్చు.

 

మీ చిన్నారి కొరికేందుకు అనుకూలంగా ఉండే సైజులో చల్లని చెక్క స్పూన్ గాని లేదా వెండి స్పూను కానీ ఇవ్వండి.

 

తల్లి పాలతో గాని లేదా ఫార్ముల పాలతో గాని పాప్సికల్ తయారు చేసి ఇవ్వండి.

 

చల్లని ఆహారం : చల్లని అరటిపండు ,యాపిల్, పీచ్ మరియు నారింజ మొక్కలను ఇవ్వండి.

 

* కూరగాయలు :

 

శుభ్రంగా కడిగిన తాజాగా కూరగాయలు లేదా ఫ్రిజ్లో పెట్టిన కూరగాయలు కూడా టీథర్స్ లాగా వాడేందుకు మంచి ఎంపికలు .బయట షాపుల్లో  కొన్న వాటికి ఇవి మంచి ప్రత్యామ్నాయాలు . ఉపయోగించేందుకు ఉత్తమమైన కూరగాయలు  : ఫ్రిజ్లో పెట్టిన దోసకాయ ,పైనాపిల్ . పైనాపిల్ గొప్ప ఇన్ఫ్లమేటరీ ఎంజైమును కలిగి ఉంటుంది . ఇది వాపులను తగ్గిస్తుంది .పిల్లలకు ఫ్రిజ్లో ఉంచిన కూరగాయలు మరియు పండ్లు ఇస్తూ ఉన్నప్పుడు  వాటిని మస్లిన్ క్లాత్ తో కట్టి ఇవ్వండి .లేదంటే పెద్ద ముక్కలు కొరికి ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉంటుంది.

 

* తాజా ఆహారాన్ని మెత్తగా ఇవ్వండి :

 

ముఖ్యంగా మీ పిల్లలకు మొదటి నాలుగు పళ్ళు వచ్చిన తర్వాత ,పెద్ద ముక్కలను కొరికి ఉక్కిరిబిక్కిరి అవుతారు . మెత్తగా చేసి పెట్టడం దీనికి ఒక మంచి పరిష్కారం .లేదంటే పండ్లను లేదా కాయగూరల ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గుడ్డలో కట్టి ఇచ్చినట్లయితే మింగుతారేమో అని భయం లేకుండా వాటిలోని జ్యూస్ ను అలా పీల్చుకుంటూ ఉంటారు.

 

వంటగది లో దొరికే అద్భుతమైన పరిష్కారాలు :

 

అల్లంను పలుచని ముక్కలుగా చేసి చిగుళ్లపై రుద్ది న్నట్లయితే చిగుర్లకు ఉపశమనం లభిస్తుంది .మీరు కొన్ని లవంగాలను తీసుకొని పేస్టులాగా చేసి దానిని చిగుళ్లపై రాయవచ్చు. మీకు ఇంకా సులభంగా కావాలంటే చిగుళ్లపై లవంగ నూనె లేదా బాదం నూనెను రాయండి.

 

సిప్పీ కప్స్ :

 

మీ పిల్లలకు ఆరు నెలలు అంతకంటే ఎక్కువ వయసు వచ్చాక సిప్పీ కప్పులు మంచి సహచరులు .వీటిని చల్లని నీటితో నింపి ఇవ్వండి.

 

దంతాలు వచ్చే సమయం అన్నది పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఇద్దరికీ కూడా పెద్ద విషయమే ! ప్రశాంతంగా ఉండండి .మీకు అందుబాటులో ఉన్న అన్నింటిని ప్రయత్నించండి.  మరియు రకరకాలుగా ప్రయత్నించి ఏది బాగా పని చేస్తుందో ,ఏ దశలో ఏది ఉపయోగకరంగా ఉంటుందో దానిని ఉపయోగించండి .పళ్ళు రావడం అన్నది ఎప్పటికీ ముగిసిపోదు . మీ అందరూ కూడా త్వరలో ఆ ముత్యాల్లాంటి తెల్లని పళ్ళను చూస్తారని ఆశిస్తున్నాము.

 

గమనించవలసిన సాధారణ లక్షణాలు : ఇవి పళ్ళు రావడాన్ని సూచిస్తాయి:

 

* బుగ్గలు ఎర్రబారడం

 

* కొరకటం

 

* చిగుళ్ల వాపు మరియు గొంతు నొప్పి

 

* ఆకలి లేకపోవడం

 

* నమలడం

 

* చెవి లాగడం

 

* సొంగలు కార్చడం

 

* అసౌకర్యమైన నిద్ర

 

పిల్లల దంతాల విషయంలో నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు..

 

* పళ్ళు వచ్చే ప్రక్రియ లో పిల్లలకు ,పిల్లలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. అది ఎప్పుడు మొదలవుతుందో, మరి ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ అంచనా వేయజాలరు.

 

* మొట్టమొదటిగా వచ్చే పళ్ళు ఒక చేదు అనుభవంతో కూడిన అసౌకర్యం గాను మరియు నొప్పిగాను ఉంటాయి.

 

* నొప్పి తగ్గుతుంది, కానీ దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. చాలా సందర్భాలలో పిల్లల మొదటి పుట్టినరోజు తర్వాత దవడలు కనిపించడం ప్రారంభమవుతాయి.

 

* కొన్నిసార్లు,నిజానికి కొన్ని నెలల ముందే దంతాల ప్రక్రియ నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో ఈ నొప్పి కేవలం మూడు నుండి నాలుగు రోజుల ముందు నుండి మాత్రమే ఉంటుంది.

 

* ఈ దంతాల ప్రక్రియ వలన కలిగే నొప్పికి పిల్లలు ఎలా స్పందిస్తారు అనేది ,వారి చిగుళ్ల సైజును బట్టి, వారు నొప్పిని భరించే శక్తిని బట్టి మరియు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 

* మీ పాత అనుభవాలను ,లేదా ఇతరుల అభిప్రాయాలను మీరు నమ్ముతున్న ప్పటికీ,దంతాల ప్రక్రియ అన్నది మీ బిడ్డను అనారోగ్యానికి గురి చేయదు .మరియు ఇది మందులు అవసరమయ్యే అనారోగ్యం కాదు.


 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}