• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

మీ పిల్లలు ఆరోగ్యంగా తినేందుకు చిట్కాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 17, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మొదటి సారిగా తల్లి అయిన మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా ? మరి పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలి ? పాలు , పండ్లు , అన్నం పసిపిల్లలకు విసుగును తెప్పిస్తున్నాయి . కాబట్టి తల్లులు ! వారి ఆహారాన్ని రుచిగా, ఆరోగ్యంగా చేసుకుందాం .. మీ చిన్నారి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి....

 

భోజనాన్ని సరదాగా మార్చండి :

 

వారు భోజనం చేసేటప్పుడు కొన్ని సరదా కార్యకలాపాలు చేయండి పండ్లను అందంగా గుండ్రంగా కట్ చేసి ఇవ్వండి .మరియు బ్రెడ్ పై సెల్ఫీ ఆకారంలో డ్రా చేయండి .పిల్లలు దీనిని తప్పక ఆనందిస్తారు.

 

మీ పిల్లలను కూడా పాల్గొననివ్వండి :

 

ఏదైనా ఆహారం లేదా స్నాక్స్ తయారు చేసే సమయంలో మీ పిల్లలను కూడా 

పాల్గొననివ్వండి . మెత్తగా గుజ్జు ని తయారు చేయడం లాంటి పనులలో పిల్లలు మీకు సహాయం చేయడానికి వారిని అనుమతించండి . ఈ విధంగా వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఆసక్తిని పెంచుకుంటారు.

 

మీ పిల్లలతో కలిసి షాపింగ్ చేయండి :

 

మీరు సరుకులు కొనేటప్పుడు మీ పిల్లలను కూడా మీతో తీసుకు వెళ్ళండి . ఈ విధంగా వారి అభిరుచిని మీరు తెలుసుకోవచ్చు.

 

మీరు వారికి ఒక మాదిరిగా ఉండండి :

 

సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల ఆహార పద్ధతులను అనుసరిస్తారు . కాబట్టి తల్లిదండ్రులు తమ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు మరియు తృణధాన్యాల వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేలాగా చూసుకోవాలి.

 

భోజనాన్ని వైవిధ్యంగా తయారుచేయండి :

 

తల్లులు ఆహారాన్ని రకరకాల కొత్త పద్ధతులలో ప్రయత్నించాలి . కూరగాయలు, గుడ్లు ,చికెన్ మరియు సోయా చాంప్స్ (మిల్ మేకర్ ) లాంటివి మామూలు అన్నంతో కలిపి తయారుచేసినందువల్ల అది ఆరోగ్యకరంగా తయారవుతుంది.

 

ఆహారంతో మ్యాజిక్ చేయండి :

 

ఆహారాన్ని ఎంచుకుని తినే పిల్లలకుఆహారం తినిపించడం ఎంతో కష్టతరమైన పని .వారు కూరగాయలను తినేందుకు ఎంత మాత్రము ఇష్టపడరు . కూరగాయలు సన్నగా తరిగి లేదా మెత్తగా చేసి రోటీ లేదా పరాటాలతో కలిపి వారికి మ్యాజిక్ భోజనాన్ని తయారు చేసి ఇవ్వండి.

 

మంచి అమ్మ గా ఉండండి :

 

బయటి ఆహారం అనారోగ్యానికి కారణం అవుతుంది అని తెలిసినప్పటికీ పిల్లలు దానిని తినేందుకు ఇష్టపడతారు . మీ పిల్లలు ఇష్టపడే ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి . తల్లులు నూనెలో వేపిన వాటిని ఇవ్వడానికి బదులుగా బేకింగ్ లేదా ఎయిర్ ఫ్రయేర్ ను  ఉపయోగించడం ద్వారా వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు.

 

రంగు రంగుల ఆహారం :

 

మీ పిల్లల భోజన పళ్ళాలను రంగురంగుల ఆహారపదార్థాలతో అమర్చండి .ఆకుపచ్చ దోసకాయ , పసుపు కోసం టమాటా లేదా స్ట్రాబెర్రీ , తెలుపు కోసం అన్నం లేదా పెరుగు, పసుపు కోసం కాయధాన్యాలు మరియు ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వాటిని వారి ఆహారంలో చేర్చండి.

 

ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచించండి :

 

మీ పిల్లలకు ఏమి ఇష్టమో వినండి . కానీ ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాటిని సూచించండి . పిల్లలు ఫ్రై చేసిన మరియు కొవ్వు పదార్థాలను ఇష్టపడవచ్చు . కానీ తల్లిదండ్రులు వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి . నూనెలో వేపిన బంగాళాదుంప చిప్స్ ఇవ్వడానికి బదులుగా తల్లులు ఉడికించిన బంగాళాదుంపలను ఇవ్వవచ్చు.

 

కుటుంబంతో కలిసి భోజనం :

 

రోజుకి ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కూర్చుని భోజనం చేయాలి . ఇలా పిల్లలు అందరితో కలిసి టేబుల్ మీద కూర్చుని అన్ని పోషకాలతో కలిగిన ఆహారాన్ని తినడం నేర్చుకుంటారు.


ఈ చిట్కాలు మీకు ఉపయోగపడ్డాయా ?దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ సొంత చిట్కాలను మాతో పంచుకోండి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}