శిశువుల తలను గుండ్రంగా చేయడం ఎలా మరియు చదునుగా ఉండే తలను సరిచేయడానికి చిట్కాలు.

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Nov 06, 2020

శిశువులు మృదువైన మరియు తేలికైన పొర కలిగిన పుర్రెతో జన్మిస్తారు. శిశువు అదే స్థితిలో ఉన్న తలతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు అయితే శిశువు తల చదునుగా ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. దీనిని పొజిషనల్ఫ్లాజీవోసిఫలి లేదా సాదరణ భాషలో ఫ్లాట్ హెడ్ అని పిలుస్తారు.
మరోవైపు శిశువు తన కడుపు వైపు మళ్లీ నిద్రించడం వలన సీడ్స్ (ఆకస్మిక శిశుమరణ సిండ్రోమ్ ) ప్రమాదం పెరుగుతుంది. అయితే ఆ విధంగా కొద్దిసేపు పడుకున్నట్లు అయితే జీర్ణక్రియకు మరియు శిశువు యొక్క పరిపూర్ణమైన అభివృద్ధికి ఆరోగ్యకరమైనది.
చదునుగా ఉండే తలను నివారించడానికి మార్గాలు :
మొదటి రోజు నుండి బిడ్డ నిద్రలోకి జారుకున్న వెంటనే వారు నిద్రించే విధానానికి ప్రత్యామ్న్యాయం చూడండి. ప్రారంభ రోజులలో శిశువు పుర్రె చాలా మృదువుగా ఉంటుంది . మరియు కొత్తగా జన్మించిన వారిని ఒకే స్థానంలో పదే పదే ఉంచినట్లయితే చదునుగా అవుతుంది.
కొంత సమయం లేదా కొన్ని వారాల తరువాత, ప్రతి రాత్రి నిద్రించే సమయంలో తొట్టి యొక్క అటు చివర అతని తలను ఉంచండి. తల గుండ్రంగా ఉంచడానికి తగినన్ని బ్రమణాలు ఉన్నాయని నిర్ధారించడానికి ఇది జరుగుతుంది. పిల్లలను ఆకర్షించడానికి మీరు పిల్లలు చూడాలనుకుంటున్న వైపు ఆకర్షణీయమైన మెరిసే బొమ్మలను ఉంచవచ్చు.
శిశు తలను కదలకుండా ఒకే వైపు ఉంచడానికి వస్త్రాన్ని చుట్టడం లేదా తువాళ్ళు లేదా పోసిషనర్లను ఉపయోగించవద్దు. ఇది వాస్తవానికి సీడ్స్ మరియు ఊపిరిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
శిశువు నిదురించేందుకు వెనుకకు తిరిగి పడుకోవడం ఉత్తమమైన స్థానం. శిశువు పైన లేదా సమీపంలో దిండ్లు, దుప్పట్లు, బొమ్మలు లేదా వదులుగా ఉండే వస్త్రాలు లేకుండా చూసుకోవాలి. మీ శిశువును తన తొట్టిలో కొంచెం గట్టిగా సౌకర్యవంతమైన పరుపు మీద పడుకో పెట్టండి. శిశువు మూలలకు వెళ్లడం లేదా అతని బొడ్డు వైపు తిరిగి పడుకోవడం లేదని నిర్ధారించుకోండి. ఇది సిడ్స్ అవకాశాలను పెంచుతుంది.
తొట్టిలో దిండ్లు, కుషన్లు, గుడ్డు మొక్కలు ఉండకుండా చూసుకోండి. శిశువులు తమ పరిసరాలలో తమ చేతులు మరియు కాళ్ళను హాయిగా కడిలించాలని కోరుకుంటారు. అందువలన శిశువు దగ్గర లేదా చుట్టుపక్కల ఎలాంటి దుస్తులు లేదా పరుపులను ఉంచకుండా చూసుకోండి.
మీరు మీ బిడ్డకు పాలు పట్టే ప్రతిసారి రెండువైపులా ఇవ్వండి. బిడ్డ తల్లి పాలు తాగుతున్నట్టు అయితే ఇది సహజమైన ప్రక్రియ. కానీ మీరు బాటిల్ ఉపయోగిస్తున్నప్పటికీ మీ చేతులతో ఆ విధంగా ప్రయత్నించండి . ఇది శిశువు యొక్క తలను గుండ్రంగా ఉండడానికి సహాయపడుతుంది.
బిడ్డ ఆహారం తీసుకునే సమయంలో పొట్ట వైపు తిరిగి పడుకోవడం కూడా తల చదునుగా ఉండడం నుండి నివారించడానికి సహాయపడుతుంది. శిశువు మెలకువగా ఉన్నప్పుడు ముందుకు తిరిగి పడుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో శిశువు మెడ నిలుపుకునేందుకు బలాన్ని పొందుతారు. అలా చేస్తూ ఉన్నట్లయితే శిశువు పడుకున్నప్పుడు కూడా తలను తిప్పడానికి సౌకర్యంగా మారుతుంది. శిశువు వెనకవైపు తిరిగి పడుకున్నప్పటికి తలను కదిలించడానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతుంది.
శిశువును కారు సీటు, పిల్లల ఉయ్యాల మరియు ప్రామ్ వంటి వాటిలో ఎక్కువ సమయం ఒకే భంగిమలో ఉంచడం మానుకోండి. అలా చేసినట్లయితే పుర్ర మీద ఒత్తిడి పడకుండా తల భాగం గుండ్రంగా అవ్వడానికి సహాయపడుతుంది.
మీ బిడ్డ తలపై చదునుగా ఉండడం మీరు ఇంకా గమనించినట్లయితే దయచేసి మీ వైద్యనితో మాట్లాడండి. అలా చేసినట్లయితే ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించగలుగుతారు. మీ బిడ్డ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు దానిని సులభంగా పరిష్కరించుకోవచ్చు.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు