• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ బిడ్డ సంరక్షణ చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ నుంచి భలే గిఫ్ట్ కొట్టేసిన బుజ్జి బాబు

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 27, 2022

కోనసీమలో మారుమూల పల్లెలో ఉండే నక్క విజయ లక్ష్మి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతో౦ది. గొప్ప గొప్ప వాళ్ళే పొందలేని బహుమతిని తన ఎనిమిది నెలల కొడుకు విజయ చైతన్య స్వంతం చేసుకున్నాడు.. అందుకే ఆ సంతోషం.  ఆ వివరం ఏంటో చూద్దాం రండి మరి!

ఇటీవల కురిసిన వర్షాల వల్ల  కోనసీమ లోని పెదపూడిని వరద ముంచెత్తింది. వరద బాధితుల స్థితిగతులు చూడటానికి ఆంద్ర ముఖ్యమంత్రి YS జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్‌, ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఎవరో వద్దు వద్దని వారిస్తున్నా ఆ గడుసుపిండం ముఖ్యమంత్రి జేబులోని పెన్నును అందుకున్నాడు. ఈ క్రమంలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్‌..  ఆ ఖరీదైన పెన్ను ఆ బుడ్డోడికే  గిఫ్ట్‌గా ఇచ్చారు.

సిఎం ఆదరణకు ఆ  బాబు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. లోకం తెలియని పసివాడి ముచ్చట తీర్చి తను ప్రజల మనిషి అని ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారు.  నేటి బాలలే రేపటి పౌరులు అని తెలియచేసే ఆ సందేశాత్మక వీడియోను మీరూ చూడండి. 

ఈ బ్లాగ్ నచ్చిందా.. ఎందుకాలస్యం.. మీ తోటి పేరెంట్స్ కోసం షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి!

https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-gifted-expensive-pen-8-months-baby-boy-konaseema-visit-1473728

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}