• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

శీతాకాలంలో పిల్లల మసాజ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పక తెలుసుకోదగిన వాస్తవాలు.

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 12, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీ బిడ్డకు నూనెతో మసాజ్ చేయడం వలన ఎముకలను బలోపేతం చేయడంలోనూ, రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు, జీర్ణ క్రియను మెరుగుపరచడం లోనూ మరియు వారి పెరుగుదల అంతటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ శిశువు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మన సాంప్రదాయ ఆయుర్వేదం శిశువులకు మసాజ్ చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సముచితమైన నూనెతో మృదువుగా మరియు సున్నితంగా క్రమబద్ధీకరణతో మసాజ్ చేసినట్లయితే మీ బిడ్డపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పసి పిల్లలకు శీతాకాలంలో మసాజ్ చేయడం గురించి తెలుసుకోవలసిన ఎన్నో విషయాలను మన సహా బ్లాగర్ అంబిలి ఎస్కార్ట మనతో పంచుకుంటున్నారు.

 

మసాజ్ కు ఉపయోగించే ఆయిల్  ఎంపిక అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది శిశువు యొక్క స్కిన్ టోన్ మరియు సాధారణ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శిశువుకు మసాజ్ చేయడానికి ఉపయోగించే నూనె రకాన్ని నిర్ణయించే మరొక ముఖ్యమైన అంశము సీజన్. వేసవి కాలంలో ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే నూనె అదే ఫలితాలను శీతాకాలంలో ఇవ్వకపోవచ్చు.

 

శీతాకాలం దగ్గర పడింది. శీతాకాలంలో పసిపిల్లలకు మసాజ్ చేయడం కొనసాగించాలా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అంతేకాక, శీతాకాలంలో ఆయిల్ మసాజ్ మరియు స్నానం కోసం మీ పిల్లలను సిద్ధపరచడం అంత సులభం కాదు. శీతాకాలంలో మీ పసిబిడ్డకు మసాజ్ చేయడం మరియు స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు గురించి తెలుసుకోవడానికి ఈ బ్లాగ్ మీకు సహాయపడుతుంది.

 

శీతాకాలంలో పసిపిల్లల మసాజ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలు. కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి.

 

శీతాకాలంలో శిశువుకు మసాజ్ చేయడం నేను ఆపాలా ?

 

వాతావరణం చాలా చల్లగా ఉంది. అందుకే చలికాలంలో ఆయిల్ మసాజ్ ఆపివేయాలని మరియు మీ పసిబిడ్డను ఆ తీవ్రమైన వాతావరణానికి బహిర్గతం చేయడం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని కొందరు తల్లులు చెప్పడం నేను విన్నాను. కానీ, అది సరైనది కాదు. వాస్తవానికి శీతకాలంలో పసిబిడ్డకు మసాజ్ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారి చర్మం పొడిబారి ఉంటుంది మరియు చల్లటి వాతావరణంతో పోరాడడానికి కొంత అదనపు జాగ్రత్త అవసరం. మసాజ్ చేయడం వలన పసిపిల్లల చర్మం పొడిబారడంనుండి మరియు పగలడం నుండి రక్షించడానికి సహాయపడుతుంది. వేసవిలో కాకుండా, శీతాకాలంలో మీరు కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.

 

శీతాకాలంలో నవజాత శిశువులకు మసాజ్ చేసేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

 

శీతాకాలంలో మీ పసిబిడ్డకు మసాజ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి..

 

మీరు బిడ్డకు మసాజ్ చేయడం ప్రారంభించే ముందు మీ అరచేతులను వేడిగా ఉంచుకోవడానికి మీ రెండు చేతులను కలిపి రుద్దండి. మీ స్పర్శ ద్వారా బిడ్డకు చలి రాకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది.

 

మీరు మసాజ్ కోసం ఉపయోగించే నూనెను కూడా కొంచెం వేడి చేయవచ్చు. నూనె ఎక్కువ వేడి కాకుండా సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి.

 

మసాజ్ కోసం మీ పసిబిడ్డ యొక్క బట్టలు విప్పే గదిలోకి చల్లటి గాలి ప్రవేశించకుండా చూసుకోవాలి.

 

ఐదు నుండి పదినిమిషాల వరకు మసాజ్ చేయడం కొనసాగించండి. మసాజ్ కోసం తేలికైన నూనెను వాడండి. శిశువు యొక్క చర్మాన్ని నూనె గ్రహించే వరకు పూర్తిగా మసాజ్ చేయండి.

ఆ వెంటనే బిడ్డకు స్నానం చేయించండి.

 

మీ పసిపిల్లల స్నానం సమయాన్ని తగ్గించండి. శీతాకాలంలో తేలికపాటి సబ్బుతో గోరువెచ్చని నీటితో త్వరగా స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ వేడి నీరు ఉపయోగించినట్లయితే వారి చర్మం యొక్క సహజ తేమను కోల్పోయే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ సేపు స్నానం చేయించడం వలన శీతాకాలంలో జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

స్నానం చేసే సమయంలో పసిబిడ్డని వెచ్చగా ఉంచండి...

 

శీతాకాలంలో స్నానం సమయంలో వెచ్చగా ఉంచడం ఎలా ?

 

మీ శిశువు స్నానం చేయడానికి తీసుకు వెళ్తున్నప్పుడు బాత్రూం వెచ్చగా ఉండాలి. కొన్ని నిమిషాల పాటు వేడి షవర్ ను తెరవడం ద్వారా బాత్రూంను వేడి ఎక్కించవచ్చు.

 

స్నానం చేయించిన వెంటనే బిడ్డను పొడి టవల్ తో చుట్టండి. వీలైతే వెచ్చగా ఉన్న టవల్ ను సిద్ధంగా ఉంచుకోండి.

 

స్నానం చేసిన తర్వాత వారు ధరించవలసిన బట్టలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. తద్వారా వారికి ఎక్కువ సమయం చలి తగలకుండా వెంటనే బట్టలు వేయవచ్చు.

 

బిడ్డకు స్నానం చేయించిన తర్వాత బట్టలు వెతకడం అన్నది తప్పు ఆలోచన. ఎందుకంటే వారు ఆ సమయంలో చలికి వణుకుతారు.

 

శీతాకాలంలో బిడ్డకు మసాజ్ చేయడానికి ఉత్తమమైన సమయం ఎప్పుడు ?

 

శీతాకాలంలో పసిబిడ్డకు మసాజ్ చేయడానికి మంచి సమయం సాయంత్రము  లేదా రాత్రి.  బాగా చలిగా ఉండే ఉదయంపూట కాకుండా మధ్యాహ్నం లేదా ప్రారంభ సాయంత్రంలోనూ లేదా రాత్రులలో అయితే వారు సుఖంగా ఉంటారు. రాత్రిపూట మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇది మీ పసిబిడ్డ రాత్రిపూట మంచిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా బిడ్డ ఆకలితో లేనప్పుడు లేదా పూర్తిగా కడుపు నిండి ఉన్నప్పుడు కాకుండా చూసుకోవాలి. పసి పిల్లలు నిద్ర పోతున్న సమయాన్ని ఎంచుకోవద్దు.

 

శీతాకాలంలో మా బిడ్డకు మసాజ్ ఆయిల్ ప్రయోజనకరంగా ఉంటుంది ?

 

ఆవనూనె : మీ పసిబిడ్డ యొక్క శరీరం వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ఇతర నూనెలతో పోలిస్తే ఆవ నూనె మసాజ్ కి ఉత్తమమైనది అని నమ్ముతారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో చాలా సాధారణమైన ఉబ్బసం(మీ పిల్లలకు ఉన్నట్లయితే), జలుబు మరియు దగ్గు వంటి లక్షణాల నుండి గణనీయమైన ఉపశమనం ఇవ్వడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవనూనె యొక్క యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చలికాలంలో చర్మ సంరక్షణకు మంచిగా పని చేస్తాయి. అయినప్పటికీ ఇది అతి సున్నితమైన చర్మం పై అలర్జీ ప్రతిచర్యను ప్రేరేపించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అవనూనెను  ఉపయోగిస్తున్నప్పుడు దద్దుర్లు, చర్మం పొడిబారడం లేదా పగుళ్ళు ఉన్నట్లు మీరు గమనించినట్లయితే దానిని ఉపయోగించడం నిలిపి మీ పిల్లల వైద్యుని సంప్రదించండి.

 

నెయ్యి : శీతాకాలంలో శిశువులకు మసాజ్ చేయడానికి స్వచ్ఛమైన నెయ్యి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇతర ప్రాంతాలలో ప్రాచుర్యం పొందలేకపోయినప్పటికీ , అధిక ఎత్తులో ఉన్నవారు యుగాలుగా నెయ్యిని మసాజ్ ఆయిల్ గా ఉపయోగిస్తున్నారు. చలికాలంలో శిశువుకు నెయ్యితో మసాజ్ చేయడం వలన శరీరానికి చలి మరియు తేమ తగలకుండా రక్షించుకోవచ్చు. ఇది శిశువు యొక్క చర్మాన్ని సున్నితంగా మరియు మృదువుగా ఉంచుతుంది.


ఆలివ్ ఆయిల్ : శీతాకాలంలో శిశువులకు మసాజ్ చేయడానికి ఆలివ్ ఆయిల్ మరొక మంచి ఎంపిక. దీని వెల కొంచెం అధికంగా ఉన్నప్పటికీ ,ఇది మీ పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ శిశువు యొక్క చర్మపు లోతు లోనికి చొచ్చుకుని పోయేటపుడు వేడిని పుట్టిస్తుంది. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మీ బిడ్డకు మంచి నిద్ర కూడా వస్తుంది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Dec 27, 2020

ఏ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మంచిది

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}