• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
పేరెంటింగ్ బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్

టమోటో ఫ్లూ వ్యాప్తి - ఈ కొత్త ఇన్ఫెక్షన్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

Ch Swarnalatha
0 నుంచి 1 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 27, 2022

 • మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 100  మంది పిల్లలు టొమాటో ఫ్లూ బారిన పడ్డారు.

 • ఈ ఫ్లూ, దద్దుర్లు లేదా పొక్కులు, చర్మం సమస్య ఇంకా నిర్జలీకరణానికి కారణమవుతుంది.

టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?

టొమాటో ఆకారపు బొబ్బలు శరీరంపై ఏర్పడటం వల్ల దీనికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చింది. దీనివల్ల దద్దుర్లు లేదా పొక్కులు, చర్మంపై చికాకు మరియు నిర్జలీకరణానికి కారణమవుతుంది. అయినప్పటికీ, ఇప్పటివరకూ ఇది వచ్చేందుకు కారణం ఏమిటి,   ఇది చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ లేదా డెంగ్యూ జ్వరానికి సంబంధించినదా అన్నది  తెలియరాలేదు.  ఇది సోకిన పిల్లలలో లక్షణాలు గుర్తించబడ్డాయి. 

టొమాటో ఫ్లూ యొక్క లక్షణాలు -

 • చర్మం చికాకు
 • శరీరంపై దద్దుర్లు
 • చేతులు మరియు కాళ్ళపై ఎర్రటి మచ్చలు
 • శరీర నొప్పి
 • అలసట మరియు వికారం
 • కీళ్ల వాపు
 • చేతులు, మోకాలు మరియు పిరుదుల రంగు మారడం
 • డీహైడ్రేషన్

పిల్లలలో  ఈ లక్షణాలుకనిపిస్తే ఏమి చేయాలి?

మీ బిడ్డలో  పై లక్షణాలలో కొన్ని లేదా అన్నే కనిపిస్తే, మొదటగా చేయవలసిన పని- వెంటనే వైద్యుడిని సంప్రదించడం. టొమాటో ఫ్లూ సోకిన పిల్లవాడు దద్దుర్లు లేదా పొక్కులను గోకడాన్ని నివారించాలి. సరైన పరిశుభ్రత పాటించాలి మరియు పిల్లవాడు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.

టొమాటో ఫ్లూ బారిన పడకుండా ఎలా నిరోధించుకోవచ్చు?

పరిస్థితి ఆందోళనకరంగా లేనందున ఎవరూ భయపడనవసరం లేదు.. అయితే, మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి. వీలైనంత ఎక్కువ నీరు తీసుకుని హైడ్రేటెడ్ గా ఉండండి. ఇంకా, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.  టొమాటో ఫ్లూ సోకిన వ్యక్తి నుండి సరైన దూరం పాటించండి. 

వ్యాధి సంక్రమణను నివారించడానికి చక్కని పరిశుభ్రతను పాటించండి.

 • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}