• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
అభిరుచులు

ఈ వేసవి లో మీ పిల్లలతో కలిసి చేయగల 12 ముఖ్యమైన సరదా కార్యకలాపాలు- 2 వ భాగం.

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 02, 2020

 12 2
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

నేను ముందు బ్లాగ్ లో నేను 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వేసవి సెలవుల్లో చేయవలసిన మొదటి ఆరు పనులను మీకు తెలియజేశాను . ఈ బ్లాగులో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చేయగలిగే మరో ఆరు కార్యకలాపాల జాబితాను నేను మీతో పంచుకుంటున్నాను.

 

ఇక్కడ చూడండి...

 

7. ట్రెజర్ హంట్ :

 

ఎక్కడ : సొసైటీలో లేదా మీ ఇంటి పరిసర ప్రాంతాలలో లేదా ఇంట్లో అయినా సరే. కానీ ఎక్కువ స్థలం కావాల్సిన అవసరం ఉంటుంది.

 

వయస్సు: 5 నుండి 10 సంవత్సరాలు.

 

దీనిని నేను చాలా కాలం నుండి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు .ఈ వేసవిలో దీన్ని చేయాలని నిశ్చయించుకున్నాను . ఎలా వస్తుందో చూడాలి..

 

సూచనలు: పిల్లలకు ముందుగానే సూచనలు ఇవ్వండి. అది వస్తువులను మీరు ఏ ఏ ప్రదేశాలలో దాచుతున్నారు అని. కారులో, వంట గదిలో ,బొమ్మలు రాక్ లో, పార్క్ లో ,మీ పక్కింట్లో మరియు దగ్గరలోని కాయగూరలు అమ్మే వారి దగ్గర...

 

పిల్లలకు మీరు దాచిన నిధి ని ఊహించడం, మరియు దానిని పొందడం లాంటివి పిల్లలకు ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది.

 

8. ప్రత్యక్ష ప్రదర్శన కు వెళ్ళండి :

 

ఎక్కడ : ఏపీ సెంటర్ మరియు ఢిల్లీ హాట్

 

వయసు : 6 నుండి 10సంవత్సరాలు

 

కొద్ది రోజుల క్రితం ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతూ ఢిల్లీ హాట్ దగ్గర కామీకాన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పారు. అయితే నాకు సమయం లేని కారణంగా మేము పాప ను  తీసుకొని వెళ్ళలేకపోయాము. తర్వాత నేను కొంతమంది స్నేహితులను కలిశాను. వారు వారి 10 సంవత్సరాల కుమారుని అక్కడికి తీసుకుని వెళ్ళ గలిగారు. వారు చెప్పిన మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి . దాని నుండి వాళ్ళ కొడుకు ఎంత ప్రేరణ పొందగలిగాడో ! ఇప్పుడు అతను వేసవి సెలవులలో ఆర్ట్స్ మరియు డ్రామా క్లాసులో చేరాలని కోరుకుంటున్నాడు . వాటికంటే మంచివి మరి ఏమైనా ఉంటాయా ? నేనైతే అలా అనుకోను.

 

10.మీ అనుబంధ కుటుంబాలకు అయస్కాంతాలు తయారు చేయండి :

 

ఎక్కడ : ఇంట్లో

 

వయస్సు : 4 నుండి 8 సంవత్సరాలు

 

ఇది చాలా సరదాగా ఉంటుంది .నేను మా పాప కలిసి దీనిని రెండు సార్లు చేశాము. ఇరువైపులా తాతయ్యలు , నానమ్మ , అమ్మమ్మ లకు చేసి ఇచ్చాము . అవి చూసి వాళ్లు ఎంతగానో పొంగిపోయారు .రెండు సంవత్సరాల తర్వాత కూడా ఫ్రిడ్జ్ మీద ఆ మ్యాగ్నెట్ లు అలాగే ఉన్నాయి.

 

10. కలిసి అల్పాహారం చేయండి :

 

ఎక్కడ : ఇంట్లో

 

మేము ముగ్గురం కలిసి వంట గదిలో ఉండటం నాకు చాలా సరదాగా ఉంటుంది. ఏ టిఫిన్ కావాలా అన్నది ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా  ఉంటుంది .ఫ్రూట్ చాట్ మా పాప స్కూల్లో నేర్చుకున్నట్లు గా చేస్తుంది., రకరకాల ఆకారాలలో గుడ్లు, టోస్ట్ లు, 

సాసేస్ లు,... ఇది అందరూ కలిసి సులువుగా చేసుకోవచ్చు . మైక్రోవేవ్ లో కానీ లేదా పెనం మీద సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి యమ్మి గా ఉంటాయి. తర్వాత ది తాజా జ్యూస్.. మా పాపకు ఇష్టమైనది పుచ్చకాయ జ్యూస్ వంటగది ఒక యుద్ధక్షేత్రం లా తయారవుతుంది .వాటి మధ్యలో మా  అమ్మాయి చేసే ఒక్కొక్క చిలిపి పనులు ఎంతో నవ్వుని కలిగిస్తాయి . టోస్ట్ యొక్క రుచి కొత్త గా మారిపోతుంది. చివరికి అది ఎంతో విలువైన సమయం గా మిగిలిపోతుంది.

 

11. కారుని శుభ్రపరచడం :

 

చాలా మందికి వారి యొక్క కారు ,వారి చిన్న ఇల్లు లాగా భావిస్తారు అని నేను గమనించాను. మీకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్లయితే, ఆ కారుని శుభ్రంగా ఉంచుకోవడం నిజంగానే కఠినమైనపని. పిల్లలతో కలిసి కారును శుభ్రపరచడం చాలా సరదాగా ఉంటుంది . మరియు ప్రతి పిల్లవాడు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను మరియు ఏ భాగాలను ఏవిధంగా శుభ్రపరుస్తున్నది, దాని వెనుక ఉన్న కష్టాన్ని కూడా తెలుసుకుంటారు .మీ పిల్లలు కారు దిగే సమయంలో వెనుక సీట్ లో పడేసిన చిన్న చిన్న చిప్స్ లాంటి వాటిని ఆ తర్వాత శుభ్రపరచడం ఎంత కష్టమో కూడా తెలుసుకుంటారు.

 

12 . రాత్రిపూట కచేరి నిర్వహించండి :

 

ఎక్కడ : ఇంట్లో, డాబా మీద లేదా తోటలో.

 

మీ పిల్లవాని తోనే పార్టీ నిర్వహించేలా చేయండి. ఆహ్వానాలు ,ఆహారం ,వినోదం అన్ని తనే చూసుకునేలా చేయండి. ఆహారం: శాండ్విచ్, పుదీనా చట్నీ, నింబు పాని మరియు చాట్ లాంటివి కావచ్చు.ఎక్కువమంది వచ్చినప్పుడు పనులను ఎలా నిర్వహించాలో వారికి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఇష్టమైన సంగీతాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైకులు లేకపోయినా సరదాగా తింటూ పెద్దగా పాటలు పాడుకోవడం వంటివి చేయవచ్చు.

 

నేను మీకు మీ పిల్లలతో చేయగలిగిన 10 విషయాలతో నా జాబితాను పరిమితం చేయాలని అనుకున్నాను. (10 అనేది ఒక రౌండ్ నెంబర్ కదా!) కానీ నేను నా ఉత్సాహం లో దాని పరిమితిని 12కి పొడిగించాను.

 

ఇప్పుడు నేను వేసవి సెలవుల గురించి నిజంగానే సంతోషిస్తున్నాను .మీకు ,మీ పిల్లలకు కూడా ఇది మంచి ఉపయోగకరమైన,  సంతోషకరమైన సమయం కావాలని కోరుకుంటున్నాను

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన అభిరుచులు బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}