• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

పొగడ బడని కథానాయకులు : తండ్రులందరికీ ప్రత్యేక సుమధుర సన్మానం

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jul 23, 2022

 

ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మరో జన్మ లాంటిది .ఏది ఏమైనప్పటికీ, పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించే వ్యక్తి మాత్రం అమ్మ .పిల్లలు జీవితానికి మరో ముఖ్యమైన వ్యక్తి ఆయన తండ్రిని పక్కన పెడతారు . కానీ పిల్లల జీవితంలో తండ్రులు కూడా అదే స్థానాన్ని కలిగి ఉంటారు .తండ్రులు బిడ్డకు తమపాలు మాత్రమే ఇవ్వలేరు. కానీ తల్లితో సమానంగా తమ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటారు.

 

ఒక స్త్రీ బిడ్డను తన గర్భంలో తొమ్మిది నెలలు మోస్తే ,ఒక తండ్రి అదే బిడ్డలు జీవితాంతం మానసికంగా మోస్తారు.భార్య ప్రసవవేదన తో బాధపడుతున్నప్పుడు తండ్రికి శారీరకంగా బాధ లేనప్పటికీ ,మానసికంగా అదే బాధను అనుభవిస్తారు .తండ్రి కూడా తన బిడ్డను మొదటిసారిగా తడుముకుంటూ తన హృదయానికి హత్తుకున్నప్పుడు అదే ఆనందాన్ని అనుభవిస్తాడు.

 

కాని పితృత్వం గురించి ఎక్కువగా చర్చించ బడదు. ఒక తండ్రి ఎల్లప్పుడు కుటుంబాన్ని పోషించడం తో పాటు పిల్లల యొక్క అవసరాలను చూసుకుంటూ ఉంటారు .కానీ పితృత్వం అనేది వీటన్నిటిని మించినది .ఒక తండ్రి తన చిన్నారిని నిద్ర పుచ్చడానికి లాలి పాటలు కూడా పాడగలడు. ఒక తల్లి చేయగలిగిన ప్రతి పని తను చేయగలడు.

 

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మాత్రమే కాకుండా అతీతమైన తండ్రి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక తల్లి చేయగల అన్ని పనులు తండ్రి కూడా చేయగలరు .వాటితో పాటుగా మరికొన్ని అదనపు పనులు కూడా చేయగలరు.

 

తమ బిడ్డలకు సాంస్కృతిక విలువలను నేర్పడం :

 

తమ పిల్లలకు సాంస్కృతిక విలువలను నింపేది తండ్రి !! అతను పిల్లలకు మంచి చెడులను బోధిస్తారు. మరియు మంచి చెడులను ఆధారం చేసుకుని బిడ్డలు నిర్ణయం తీసుకునే లాగా బిడ్డలను సహాయం చేస్తారు.

 

తమ బిడ్డకు సామాజిక మర్యాదలను నేర్పుతారు :

 

బిడ్డ సామాజిక మర్యాద అన్నది తల్లిదండ్రులను అనుకరించడం ద్వారానే  నేర్చుకుంటాడు. టేబుల్ మీద ఎలా కూర్చోవాలి ,ఎలా తినాలి ,ఇతరులను ఎలా పలకరించాలి మరియు ఇతరులతో ఎలా కలవాలి అనేది తండ్రి నేర్పుతాడు.

 

తండ్రితో కలిసి చేసే బైక్ రైడ్ లు చాలా సరదాగా ఉంటాయి :

 

మొట్టమొదటిసారి బండి నడపడం, స్కేటింగ్ లేదా ఈత పాఠాలను తండ్రులు మంచిగా నేర్పించడానికి ప్రయత్నిస్తారు .తండ్రులు తమ బిజీ షెడ్యూల్లో కూడా పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తారు .పిల్లలు తండ్రి దగ్గర మాత్రమే బండి నడపడం నేర్చుకోవాలి అనుకుంటారు.

 

తండ్రి చేసే ఎన్నో  పనులకు నేను నా తండ్రికి నివాళులు అర్పించడం అన్నది చాలా సాధారణం మరియు మా తండ్రికి మరియు నా చిన్ని యువరాణి యొక్క తండ్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? దయచేసి దిగు వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి . మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}