• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లలలో దగ్గు మరియు జలుబు చికిత్సకు తేనెను ఎలా ఉపయోగించాలి.

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 28, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

తేనే- అద్భుతమైన పదార్థం!

వాతావరణంలోని మార్పులు కారణంగా పిల్లల్లో జలుబు మరియు దగ్గు శాశ్వతమైన సమస్యగా మారుతుంది. సిరప్ లు, యాంటీబయాటిక్స్, నెబులైజేషన్ మరియు టాబ్లెట్ లు రోజువారీ దినచర్యలో ఒక భాగం గా మారిపోయాయి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ పిల్లలు దాని నుండి విముక్తి పొందడం లేదు. మీరు తప్పని పరిస్థితుల్లో డాక్టర్లను కలుస్తున్నారు మరియు మెడిసిన్ కోర్సులు వాడుతున్నారు. కానీ ఉపయోగం ఉండటం లేదు. కొన్నిసార్లు ఇంటి నివారణలు పిల్లల ఆరోగ్యానికి మంచిగా దోహదం చేస్తాయి. ఇంటి నివారణతో జలుబుకి చికిత్స చేయడం అనే కుటుంబ సాంప్రదాయాలు మనకి ఉన్నప్పటికీ, తేనే అనేది సాధారణంగా ఉపయోగించే పదార్ధాలలో ఒకటి. మీ పిల్లల జలుబు మరియు దగ్గు కు చికిత్స చేయడానికి మీరు తేనెను ఎలా ఉపయోగించుకోవచ్చు తెలుసుకోవాలంటే దీనిని చదవండి.

మీ పిల్లలలో దగ్గు మరియు జలుబు చికిత్సకు ఉపయోగించే మార్గాలు :

మీకు గొంతు మంటగా అనిపించడం ప్రారంభించినప్పుడు మీ తల్లి వెంటనే మీకు అందించిన పసుపు, తేనె కలిపిన పాలగ్లాసు మీకు గుర్తుందా ? జలుబు మరియు దగ్గు నుండి మీ పిల్లలకు ఉపశమనం కలిగించడానికి తేనెను ఉపయోగించగల కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి..

అయితే, మీరు ఉపయోగించే తేనెను జాగ్రత్తగా ఎంచుకోండి. మీరు వెబ్ నుండి నేర్చుకో కలిగే అనేక చిట్కాలు ఉన్నాయి.

ఈ వ్యాసం సొంత అనుభవం మరియు మరికొందరి పరిశోధనల మీద ఆధారపడి ఉంటుంది. వ్యాఖ్యల విభాగంలో దీనపై మీ విలువైన అభిప్రాయాలను పంచుకోండి.

1. కల్తీ లేని ఒక టీ స్పూను తేనె :

ఏడాది పొడవునా ప్రతిరోజూ ఒక చెంచా తేనె తీసుకున్నట్లయితే అది ఎటువంటి హాని చేయదు. అదే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు సరఫరా చేస్తుంది. మరియు పిల్లలు దీనిని తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఇది చక్కెర కంటే తీయగా ఉంటుంది.

2. అల్లం తేనె రసం :

మీరు తేనెలో కొంచెం అల్లం రసం కలిపి మొత్తం ఒక టీస్పూన్ ఫుల్లుగా తయారు చేసి మీ పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది గొంతులో గరగరను మరియు దగ్గును నియంత్రిస్తుంది. కానీ, అల్లం రసం కారం గా ఉంటుంది కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు లేదా మూడు చుక్కల అల్లం రసం సరిపోతుంది. మీరు ఒక అంగుళం ముక్క అల్లం తీసుకుని రసం పిండి ఇవ్వచ్చు.

3. హెర్బల్ దగ్గు సిరప్ :

ఈ పదార్థాలతో మీరు ఒక దగ్గుమందును తయారు చేసుకోవచ్చు. 1 లవంగ మొగ్గ, 1 ఇలాచి, కొద్దిగా దంచిన అల్లము, చిన్న ముక్క దాల్చిన చెక్క మరియు ఐదు లేదా ఆరు తులసి ఆకులు.

* ఒక చిన్న గ్లాస్ నీటిని తీసుకొని పై పదార్థాలన్నింటిని పొడిగా చేసి సగం గ్లాస్ అయ్యేవరకు మరిగించండి.

* దీన్ని వడకట్టి బాగా చల్లార్చండి. దానిలో ఒక ఫుల్ స్పూన్ తేనే కలిపి రాత్రిపూట మీ చిన్నారికి ఇవ్వండి.

* దగ్గు తీవ్రంగా ఉంటే మీరు దీనిని మధ్యాహ్నం సమయంలో కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే సాధారణంగా నిద్రపోయేటప్పుడు దగ్గు ఎక్కువ అవుతుంది. ఆ ద్రవం బాగా చల్లబడ్డ తర్వాత మాత్రమే తేనెను కలపాలని గుర్తుంచుకోండి.

4.టీ లేదా నిమ్మరసంతో తేనె :

పెద్ద పిల్లలకు మీరు టీ (పాలు లేకుండా), లేదా వెచ్చని నిమ్మరసంతో కూడా తయారు చేసుకోవచ్చు మరియు దీనికి తేనె ను కలిపి ఇవ్వవచ్చు.

* ఇది గొంతు నొప్పిని తగ్గించి ఉపశమనం ఇస్తుంది. తేనె ఒక సహజ దగ్గు నివారిని గా పనిచేసి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.

* తేనే గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని విడుదల చేయడానికి ఎంతో సహాయపడుతుంది.

* ఇది పిల్లలు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మరియు ఇందులో పుష్కలంగా మల్టీ విటమిన్లు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.





 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}