• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

ఉద్యోగాలు చేసే తల్లులులకు -- సులువైన ఉదయపు దినచర్య కోసం 8 పరిష్కారాలు

Aparna Reddy
3 నుంచి 7 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 14, 2021

 8
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఒక ఉద్యోగం చేసే తల్లిగా, మీకు ఎక్కువ చేతులు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. ఉద్యోగానికి బయలుదేరే ముందు మీ ఉదయం పూర్తిగా అన్ని పనులు సమకూర్చడంతోనే నిండిపోతుంది. తల్లులుగా మనం చేతులతో చేసే పనుల కంటే కూడా మన మనసుల గడబిడగా ఉంటాయి. వాటి నుండి మనం ఎప్పుడైనా తప్పించుకోగలమా ?

 

ఒక ఉద్యోగం చేసే తల్లిగా, నేను గడపదాటి ఉద్యోగానికి వెళ్లేముందు ఎన్నో విషయాలు గుర్తుంచుకోవాలసి ఉంటుంది. అంతేకాదు,  దాని ఫలితం రోజంతా అది నా మనసులో మెదులుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు నేను నా పర్సు తీసుకోవడానికి ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితులు కూడా నేను గుర్తించాను. ఎందుకంటే ఉదయం నేను నా పర్సు ని బ్యాగ్ లో పెట్టుకోవడం మరిచిపోతాను. కాబట్టి మన ఉదయ కాలపు సమయాన్ని కొంచెం సులభతరం చేయడానికి మనం ఏం చేయగలం ? తెలుసుకోవడానికి దీన్ని చదవండి !

 

మీ ఉదయపు దినచర్య సులభంగా చేసుకోవడానికి చిట్కాలు :

ఉదయం పూట ఉండే పని ఒత్తిడి రోజంతా మిమ్మల్ని  భారంగా ఉంచుతుంది. ఇది  మీకు నిజంగా అనవసరమైన ఒత్తిడిని తీసుకొస్తుంది. కాబట్టి మీ ఉదయపు దినచర్యను సులువుగా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

 

1. అవసరమైన వస్తువులను వ్రాసి ఉంచుకోండి : ఉదయానికి అవసరమయ్యే వాటిని రాసుకోవడం ద్వారా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి బాగా గుర్తుంటాయి.

 

*  కుటుంబ సభ్యులందరితో మీ పనులను పంచుకోవడం ఎంతో ముఖ్యమైనది.

 

* పిల్లల నిత్యకృత్యాలను ఒక పేపర్పై రాసి బాత్రూమ్ తలుపుకి లేదా అద్దంపైన అతికించండి.

 

* పిల్లలు చిన్న వాళ్ళు అయితే, చిత్రాలను వాడండి ! వారు పూర్తి చేయాల్సిన ప్రతి పని గురించి మాట్లాడండి . తద్వారా వారు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు.

 

2. ఒక వారం మెనూ ముందుగానే నిర్ణయించండి : ప్రతిరోజు తయారు చేయవలసిన మెనూని వారాంతంలోనే నిర్ణయించుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు ఇష్టమైన వాటిని తయారు చేసుకోవచ్చు. మెనూ సిద్దపరచుకున్నట్లయితే మీకు అనవసరమైన టెన్షన్ ఉండదు. మీ పిల్లల స్కూల్ షెడ్యూల్ కూడా వారికి తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి వారు ప్రతి రోజు స్కూల్ కి అవసరమైనవాటిని సిద్ధ పరచుకుంటారు.

 

3. ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోండి :  దుస్తులను ఎంచుకోవడం నాకు ప్రతిరోజు ఒక సవాలుగానే ఉంటుంది. ఉదయం హడావిడిగా నాకు నచ్చిన దానిని ఎంచుకుంటాను. అది నాలో ఒత్తిడిని పెంచుతుంది అని నేను గ్రహించాను.

 

* మరుసటి రోజు వేసుకునేందుకు ముందు రోజు రాత్రి దుస్తులను ఎంచుకోండి.

 

* మీ పిల్లలకు కూడా ఆ విషయంలో సహాయం చేయండి. తద్వారా వారు ఉదయం పూట దుస్తులు ధరించడం చాలా సులభం అవుతుంది.

 

* మరుసటి రోజు చేయవలసిన వంటకాలు ఎక్కువగా ఉన్నట్లయితే ముందు రోజు రాత్రే కొంత ప్రిపరేషన్ చేసుకోండి. ఇది ఉదయం హడావిడి లేకుండా మీ విలువైన సమయం కలిసి వస్తుంది.

 

4. దేని స్థానంలో దానిని ఉంచండి : మీరు ఒక వస్తువును ఎక్కడ ఉంచారో కచ్చితంగా తెలుసుకున్నట్లయితే, అది ఉదయకాలపు హడావిడిలో మీకు సహాయపడుతుంది.

 

* కాబట్టి అవసరమైన వస్తువుల కోసం ఒక స్థలాన్ని నియమించండి. అందువలన మీకు అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం ఎప్పుడూ మర్చిపోరు - పర్స్, తాళంచెవి, పిల్లల డే కేర్ మరియు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, మందులు మొదలైనవి.

 

* తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని తిరిగి వాటి స్థానంలోనే ఉంచాలని నిర్ధారించుకోండి. కాబట్టి మీరు మరొకసారి వాటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

 

* ఇంకా కొంచెం శ్రద్ధ చూపగలిగితే, ప్రతి విషయాన్ని రాసి ఉంచండి. తద్వారా ఏ వస్తువు ఎక్కడుందో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు.

 

5. పిల్లలను స్వతంత్రంగా తయారు చేయండి : స్కూల్ కి వెళ్ళే పిల్లలు వారి పనులు వారు చేసుకునే విధంగా తయారు చేయండి. వారి స్కూల్ బ్యాగులను వారే సర్దుకోవడం, వారి షూస్ వారే బ్రష్ చేసుకోవడం, వారి సాక్స్లను వారే సిద్ధ పరుచుకోవడం లాంటివి. ఇది మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా , అది వారికి స్వయం సమృద్ధిని ఇస్తుంది.

 

6. త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవండి :

మీరు నిద్రపోయే సమయము మరియు మేల్కొనే సమయం క్రమబద్ధంగా జరిగినట్లయితే పనులన్నీ సరిగ్గా సమయానికి పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా గుర్తుంచుకోండి.

 

* ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్ర పోవడానికి అలవాటు చేసుకోండి. అలా చేసినట్లయితే నిద్ర విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

 

* ఉదయాన్నే అలారం బటన్ను ఆఫ్ చేసి  మరికొంతసేపు నిద్రపోయే అలవాటు మీకు ఉన్నట్లయితే, మీరు నిద్ర మేలుకొనే సమయం కంటే 15 నిమిషాలు ముందుగా అలారం సెట్ చేయండి. నన్ను నమ్మండి. ఇది చాలా విలువైనది !

 

7. మీ సహచరులను పెంచుకోండి : మీ తోటి వారు మద్దతు ఇవ్వకపోతే మీ ప్రణాళికలు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

 

* మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, మీతో పాటు నివసించే వేరెవరైనా మీ సహచరులు కావచ్చు. కాబట్టి మీరు అనుసరించాల్సిన దినచర్యను వారు బాగా అర్థం చేసుకోవాలి.

 

* మీ జీవిత భాగస్వామి మీ సహచరుడు కావచ్చు. ఉదయం పూట మీరు పనితో హడావిడి పడుతున్నప్పుడు, అందులో వారిని భాగస్వామిని చేయండి. ఉదాహరణకు మీరు లంచ్ బాక్సులు ప్యాక్ చేయడం లేదా అల్పాహారం సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నప్పుడు, పిల్లలను స్కూలుకు తయారు చేసేందుకు మీ భాగస్వామి సహాయం కోరండి.

 

* మీ సహచరులకు దినచర్యలో ప్రావీణ్యం ఉన్నట్లయితే, వారు అవసరమైన సహాయాన్ని ఇవ్వడానికి వెనుకాడరు.

 

8. ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉండండి : మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో కమ్యూనికేషన్ తప్పనిసరి.

 

* మీ దినచర్యలో ఏదైనా ప్రణాళిక లేని సంఘటనలు ఉన్నట్లయితే, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ విషయం గురించి తెలపడం మరచిపోకండి.

 

* మార్పులు అన్నవి అలవాటుపడిన మీ దినచర్యకు కష్టతరంగా ఉంటాయి. అందరితో వాటిని పంచుకోవడం వలన మీ బారం తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అన్ని ముందుగా చేసినట్లయితే అవసరమైనప్పుడు మీకు ఉపయోగపడతారు.

 

*రాత్రి మీరు అన్ని సిద్ధపరచుకున్నట్లయితే, ఉదయాన్నే లేచి హైరానా పడవలసిన అవసరం ఉండదు. మీరు ప్రశాంతంగా ఉండండి, పనులు నియంత్రణలో ఉంచగలిగినట్లయితే అన్నీ మీకు అనుగుణంగా జరుగుతాయి. ఉదయాన్నే హైరానా పడుతూ పని చేయడం వలన మీ రోజంతా పాడవుతుంది. అందుకే ప్రశాంతంగా,  సంతోషంగా , నవ్వుతూ ఉండండి.


ఉద్యోగం చేసే తల్లులు తమ ఉదయాన్ని ఎలా సులువుగా మలుచుకోగలరు అనే విషయంపై ఉన్న ఈ బ్లాగ్ మీకు నచ్చిందా ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి !

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}