• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ఉద్యోగం చేసే తల్లులకు ఆరోగ్యకరమైన భారతీయ గర్భదారణ స్నాక్స్

Aparna Reddy
గర్భధారణ

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jan 12, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

గర్భం సమయంలో పెరుగుతున్న పిండానికి మీ శరీరం తగినంత పోషణను ఇవ్వగలిగే సమయం. మీ శరీరానికి నిరంతరం శక్తి అవసరం. అందుకోసం మీరు భోజనాన్ని 3 సార్లు ఎక్కువ పరిమాణంలో తీసుకోకుండా 5 నుండి 6 సార్లు కొంచెం కొంచెంగా విభజించి తీసుకోవడం మంచిది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం ఎంతో ముఖ్యమైనవి . అయితే ఈ కీలకమైన 9 నెలలు మధ్యలో స్నాక్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

 

గర్భధారణ సమయంలో సాధారణంగా గుండెల్లో మంట మరియు వికారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించినట్లయితే వాస్తవానికి ఈ లక్షణాలను తగ్గించగలదు మరియు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన స్నాక్స్ ప్రయత్నించండి మరియు గర్భధారణ సమయంలో ఆకలి బాధలను అరికట్టడానికి వాటిని ఉపయోగించండి. మా న్యూట్రిషనిస్ట్ హుడా షేక్ గర్భధారణ సమయంలో తీసుకోవలసిన కొన్ని ఇండియన్ స్నాక్స్ గురించి మనతో పంచుకుంటున్నారు. ఇవి ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి కూడా.

 

గర్భిణీ స్త్రీలకు ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన ఆరోగ్యకరమైన స్నాక్స్

రెసిపీలు :

 

గర్భిణిగా మీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు, అంతుచిక్కని భావాలతో పాటు, గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్లు మరియు అనేక రకమైన ఇతర పనుల కారణంగా భోజనం విషయంలో శ్రద్ధ వహించలేక పోవచ్చు. గర్భధారణ సమయంలో కొన్ని రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్ జాబితా ఇక్కడ ఉంది. వీటిని సులువుగా తయారు చేసుకుని మీతో పాటుగా తీసుకెళ్లవచ్చు.

  •  మొక్కజొన్న మరియు బఠానీలతో భేల్ : మొక్కజొన్నలో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మరియు బఠానీలలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.

1. కొంచెం మొక్క జొన్నలు మరియు బఠాణీలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

 

2. ఒక బాణలిలో కొంచెం నూనె వేసి  వేడెక్కాక కొంచెం జీలకర్ర వేయండి.

 

3. అందులో  ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్నలు, బఠాణీలు, పసుపు , కారం , కల్లుప్పు కలపండి.

 

4. 2 నిమిషాల పాటు ఉడికించి మీ స్నాక్ బాక్స్ సిద్ధం చేసుకోండి.

 

  •  చిలగడ దుంపల చాట్ : చిలగడ దుంపలలో ఫైబర్ మరియు ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

 

  1. చిలగడ దుంపలు ఉడికించి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి.

 

  1. ఆ తర్వాత ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, నిమ్మరసం, తురిమిన అల్లం, తరిగిన కొత్తిమీర మరియు  కల్లుప్పు వేసి కలపండి.

 

  1. ఇప్పుడు ఉడికించి తరిగి ఉంచుకున్న చిలగడ దుంపల ముక్కలలో పైన కలుపుకున్న మిశ్రమాన్ని జోడించి బాగా కలపండి.

 

  • కుకుంబర్ , క్యారెట్ మరియు గడ్డ పెరుగుతో సలాడ్ : వీటి కలయికతో మీకు అవసరమైన ఫైబర్ మరియు ప్రోటీన్ లను పొందండి.

 

1.  సింపుల్ గా కాయగూరలను కట్ చేసి గడ్డపెరుగులో ముంచడం

 

2. గడ్డపెరుగు లో మెంతి ఆకులు, సన్నగా తరిగిన వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి మరియు ఒరిగానో కలపండి. మీ సలాడ్ రెడీ అయింది. దీనిని తయారు చేయడం చాలా సులభం మరియు తీసుకెళ్లడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది.

 

  •  పీనట్ బటర్తో ఆపిల్ లేదా పియర్ : ఇది ఫైబర్ మరియు ప్రోటీన్ల తో నిండిన మరొక స్నాక్.

 

1. కేవలం ఆపిల్ లేదా పియర్ కట్ చేసి దానిపై కొంత పీనట్ బట్టర్ వేయండి.

 

2. మీరు దాని పైన కొంచెం బాదం పప్పును పొడిచేసి కూడా చల్లుకోవచ్చు.

 

గర్భం అంటే పెరుగుతున్న పిండానికి మీ శరీరం తగినంత పోషణను ఇవ్వగలిగే సమయం. మీ శరీరానికి నిరంతరం శక్తి అవసరం. అందుకోసం మీరు భోజనాన్ని 3 సార్లు ఎక్కువ పరిమాణంలో తీసుకోకుండా 5 నుండి 6 సార్లు కొంచెం కొంచెంగా విభజించి తీసుకోవడం మంచిది. మీరు ఉద్యోగం చేస్తున్న గర్భిణీ అయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం అవసరం.

 

మీ పని ఒత్తిడి మీరు తీసుకునే పోషకాహారానికి ఆటంకం లేకుండా చూసుకోండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారుచేయడం మీరు అనుకున్నదాని కంటే సులభం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.  మీ గర్భధారణ సమయాన్ని ఆనందించండి.

 

గర్భధారణ సమయంలో మీరు ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎలా ఎంచుకున్నారు ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ చిట్కాలను మాతో పంచుకోండి. మీ నుండి తెలుసుకోవడం మాకెంతో సంతోషం !

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}