• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ఎండ వేడిమి నుండి కలిగే అనారోగ్యం ,వేడి తాకిడి నుండి పిల్లలను కాపాడేందుకు చిట్కాలు

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 13, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

చేదైన శీతాకాలం తరువాత వచ్చే వేసవి కాలానికి స్వాగతం. శీతాకాలంలోని చలి మరియు వణుకుల నుండి బయటకు వచ్చి అద్భుతమైన వసంత కాలాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో సూర్యుడు కనికరం లేకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా వేసవిలో మనుషులను భయపెట్టేది భయంకరమైన వడగాలులు, దాని కారణంగా కలిగే అనారోగ్యాలు .వడగాలులు వీచే సమయంలో వడదెబ్బ యొక్క సంకేతాలను, మరియు లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం.

 

ఈ వేడి గాలుల కారణంగా సాధారణంగా కలిగే అసౌకర్యాన్నికలిగించే వాటిని నుండి, ప్రాణాంతకంగా పిలవబడే వడదెబ్బ వరకు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తాయి. వడగాలుల సంభవించినపుడు శరీరం తనంతట తానే చల్లబరచుకోలేనప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది  భయంకరమైన ఎండల కారణంగా వేడి , అలసట,దద్దుర్లు, తిమ్మిర్లు ,మైకము మరియు మరికొన్ని సందర్భాల్లో  మూర్ఛ,వడ దెబ్బ లాంటి అనారోగ్యాలు సంభవిస్తాయి.వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరైతే బయటకు వెళ్తారో  వాళ్లు ఈ వేడి సంబంధిత  అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.

 

వేడి సంబంధిత అనారోగ్యాలు ఏమిటి ?

 

వేడి సంబంధిత అనారోగ్యాలను యొక్క లక్షణాలను గుర్తించేందుకు ఈ క్రింది చెక్ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది.

 

1. వేడి పొక్కులు (దద్దుర్లు):

 

వేడి పొక్కులు అనేవి ఎండాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.ఇవి చెమట కారణంగా ఏర్పడి చర్మానికి ఎంతో చిరాకు పుట్టిస్తాయి .ఇవి ఏ వయస్సు వారికైనా వస్తాయి .కానీ చిన్న పిల్లల్లో ఇవి చాలా సాధారణం. ఈ చెమట పొక్కులు అనేవి ఎర్రటి మొటిమలలాగా లేదా చిన్న గుల్లలు లాగా వస్తాయి. (చిన్నపిల్లలలో ఈ వేడి పొక్కులు రావడానికి కారణం ఏమిటి ?)

 

2 వేడి తిమ్మిర్లు :

 

ఎవరైతే ఎండలో ఎక్కువగా వ్యాయామం చేస్తారో మరియు ఎక్కువ సమయం ఎండలో పనిచేస్తారో వారికి ,ఈ వేడి తిమ్మిర్ల ను సూచించే చేతులు ,కాళ్ళు ,కండరాల నొప్పులు మరియు విపరీతమైన పొత్తికడుపునొప్పి ఏర్పడుతుంది .శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండి చర్మం మాత్రం చెమటతో తడిసిపోతుంది.

 

3. వేడి వల్ల కలిగే మూర్ఛ :

 

ఇది శరీరంలోని నీరు ,లవణాలు కోల్పోవడం ద్వారా వచ్చే అనారోగ్యము. డాక్టర్లు దీనిని వేడి మూర్ఛ అంటారు. దీని మొదటి లక్షణం 104 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం వస్తుంది. మరియు మానసిక స్థిరత్వాన్ని కోల్పోవడం లేదా స్పృహ తప్పడం జరుగుతుంది.

 

4. వేడి అలసట :

 

వడదెబ్బకు దారితీసే పరిస్థితులలో ఇది ఒకటి .ఎక్కువ వేడి వాతావరణంలో బాగా చెమటలు పట్టడం వలన శరీరంలో రక్త పరిమాణం తగ్గిపోతుంది .దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటంటే ..ఎక్కువగా చెమటలు పట్టడం, గుండె అధికంగా కొట్టుకోవడం, తలనొప్పి, వికారం, వాంతులు మరియు కండరాలలో తిమ్మిరి గా ఉంటాయి.

 

5. వడదెబ్బ :

 

వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరమైనది మరియు ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది .శరీరం ఇప్పుడైతే ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తిని కోల్పోతుందో అప్పుడు దీనికి దారి తీస్తుంది .తీవ్రమైన వడదెబ్బ బాధితులు దాదాపుగా చనిపోతారు .కాబట్టి సమస్య మొదలైన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి .వీరికి ముందు అధిక జ్వరం వస్తుంది .అది నిమిషాలలోనే పెరిగి ,కొన్ని నిమిషాలలోనే ప్రమాదస్థాయికి చేరిపోతుంది .వడదెబ్బ తగిలిన వ్యక్తిి 104 డిగ్రీల (40c) కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటారు. అంత కంటే కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. వడదెబ్బ యొక్క ఇతర లక్షణాలు మరియు సంకేతాలు ఏమిటంటే వికారమైన ప్రవర్తన , మూర్ఛ ,పల్స్ రేట్ పడిపోవడం ,చర్మం పొడిబారిపోవడం , సృహ తప్పినట్లు గా అనిపించడం మరియు కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి.(తెలుసుకోండి.. పిల్లలను వడదెబ్బ నుండి కాపాడుకునేందుకు గృహ నివారణలు)

 

వేడి వలన కలిగే తిమ్మిర్లు ,అలసట, నొప్పులు అన్ని కూడా  తేలిక పాటి గా ఉండడం సాధారణం. కానీ వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం డాక్టరుని సంప్రదించండి లేదా అత్యవసర సహాయం తీసుకోండి.

 

లక్షణాలు కనిపించినట్లయితే పాటించవలసిన చిట్కాలు ఏమిటి ?

 

ఎవరైనా వడదెబ్బతో బాధపడుతున్నప్పుడు లేదా ఎవరిలోనైనా ఈ లక్షణాలు గమనించినప్పుడు వైద్య సహాయాన్ని కంటే ముందు , త్వరగా చేయవలసిన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అత్యవసర సహాయం కోసం వేచి ఉన్నప్పుడు బాధితుని బట్టలను తొలగించండి .అతన్ని చల్లగా ఉంచేందుకు నీటిని చిలకరిస్తూ ఉండండి.బాధితుని దగ్గర ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండండి . అతని చంకలు మరియు గజ్జల కింద ఐస్ ప్యాడ్స్  ఉంచండి .మీరు బయట ఉన్నట్లయితే బాధితుడిని చల్లని మరియు నీడ ప్రదేశానికి తీసుకు వెళ్ళండి .దగ్గరలో పూల్ లాంటివి ఉన్నట్లయితే అతనిని ఆ ప్రదేశానికి తీసుకు వెళ్ళండి .మీకు ధర్మామీటరు అందుబాటులో ఉన్నట్లయితే బాధితుని శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించండి. అతనికి చల్లదనాన్ని అందిస్తున్నట్లు అయితే అతని ఉష్ణోగ్రతలు 101 నుండి 102 వరకు చేరుకుంటుంది .చల్లని నీటిని మరియు స్పోర్ట్స్ డ్రింకులు బాధితునికి ఇవ్వండి . కెఫీన్ లేదా మరే ఇతర కెఫిన్ పానీయాలను ఇవ్వడం మంచిది కాదు .అతనికి వాంతులు అవుతున్నట్లు అయితే ఒక గిన్నెలో తడిగుడ్డ ఉంచి ప్రక్కన పెట్టండి .అతను అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్లు అయితే అతని హృదయ స్పందనను పరీక్షించండి. అతనికి శ్వాస అందనట్లయితే సి పి ఆర్ చేయండి.  అతని శరీరాన్ని ఎడమవైపునకు రోల్ చేయండి .అలా చేసినట్లయితే నోట్లో నుండి ద్రవాలు బయటికి రావడం మరియు వాంతులు ఆగిపోతాయి.

 

మరియు,వైద్య నిపుణులు వచ్చిన తర్వాత రోగిని నిపుణుల సంరక్షణలో ఉంచండి. (చదవండి : వడదెబ్బ లక్షణాలు నివారణ చర్యలు మరియు ఇంటి నివారణ చిట్కాలు)

 

వడదెబ్బను ఎలా నివారించవచ్చు ?

 

వడదెబ్బ నివారించేందుకు ఏ విధమైన దుస్తులను ,ఎలా ధరించాలో కొన్ని చిట్కాలు :

 

వాతావరణానికి అనుకూలంగా, పరిస్థితులను గమనిస్తూ మీ దుస్తులను ఎంపిక చేసుకోవడం మంచిది.మీరు బయట కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు వాతావరణానికి తగినట్లుగా దుస్తులు ధరించడం మంచిది .ఎండలో బయటకు వెళుతున్న ట్లయితే పొట్టి చేతుల చొక్కా లను ధరించకుండా ,ఫుల్ స్లీవ్స్ షర్ట్ లేదా జాకెట్లు ధరించడం మంచిది. పెద్ద అంచులు గల టోపీలు ధరించడం వల్ల పిల్లలకు మరియు పెద్దలకు కూడా ఎండ తగలకుండా చల్లగా ఉంటుంది .బయటకు వెళ్లే సమయంలో బాగా గాలి తగిలేలాంటి మెటీరియల్ తో లైట్ కలర్ డ్రెస్సులు వాడడం మంచిది.ఎస్ పి ఎఫ్ 15 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్ వాడాలి అని గుర్తుంచుకోండి .ఈ వేసవి సమయాలలో వ్యాయామం చేసేటప్పుడు పొరలు పొరలుగా ఉండే ఎక్కువ బట్టలను వేసుకోకండి . శరీరాన్ని బట్టతో కప్పి వేయడం వలన శరీరానికి ఊపిరి పీల్చుకోవడానికి మరియు చెమట పట్టడానికి కూడా అనువుగా ఉండదు. వ్యాయామాలకు అనుకూలంగా ఉండే పలుచని దుస్తులను ఎంపిక చేసుకోండి. వ్యాయామానికి వేసవిలో అనుకూలంగా ఉండే వర్కౌట్ గేర్ ను కొనుక్కోండి. అందులో ట్యాంక్ టాప్స్ ,షాట్స్ , స్పోర్ట్స్

బ్రాస్ ,లైట్ వర్కౌట్ బోటమ్స్, లేదా క్వార్టర్ లెంత్ ప్యాంట్లు ఉంటాయి. తెలివిగా వస్త్రాలను ధరించడం కూడా ఈ వేడిని బరించడానికి ఒక మార్గము. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు గురయ్యే లాంటి ఆఫీసులలో పనిచేస్తున్నట్లు అయితే ఆ హెచ్చుతగ్గుల వాతావరణానికి అనుకూలంగా ఉండే దుస్తులు ధరించడం మంచిది .సొంత వ్యాపారాలు చేసుకునేవారు అయితే పలచని  షర్ట్స్ లేదా జాకెట్లు మరియు మంచి టాప్స్ (మగవారికి అయితే హాఫ్ స్లీవ్స్ షర్ట్స్ )అనుకూలంగా ఉంటాయి.(పరిశీలించండి : పాఠశాలకు వెళ్లే పిల్లల్లో వడదెబ్బ లక్షణాలు ,కారణాలు మరియు నివారణ చిట్కాలు)నిద్రపోయే సమయాలలో మందమైన దుస్తులు వేసుకోకుండా చూసుకోవాలి .రాత్రి వేళల్లో కూడా శరీరం వేడికి గురయ్యే అవకాశం ఉంటుంది .ఈ వేసవికాలంలో  పలచని బెడ్ షీట్లు ,దిండు కవర్లు వాడటం మంచిది .ఇది మీ చర్మం మరియు శరీరానికి చల్లగా ఉండేందుకు ఉపయోగపడుతుంది .మీ పిల్లలకు మంచి వస్త్రధారణను ద్వారా వేడిని నివారించి సురక్షితంగా ఉంచగలరు. ఈ భయంకరమైన ఎండల నుండి మీ చిన్నారులను రక్షించుకునేందుకు మంచి టోపీలను ఎంపిక చేసుకోండి .పలచని, మృదువైన ,చల్లని నూలు వస్త్రాలను, మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శరీరం మరియు చర్మం చక్కగా ఉంటుంది .ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండలో మీ పిల్లలను బయటకు పంపకండి.

 

పైన ఇవ్వబడ్డ సమాచారం మీకు సహాయ కరం గా ఉంటుందని ఆశిస్తున్నాము.ఈ వేసవిలో సంభవించే అనారోగ్యాలకు ఎదుర్కునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ వేసవిని ఆహ్లాదకరంగా ఆస్వాదించ గలరని ఆశిస్తున్నాము.
 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}