మీ పిల్లలు దొంగిలించకుండా ఆపడానికి మార్గాలు..

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన Sep 24, 2020

పిల్లలు నిర్దోషులు మరియు ఎక్కువ సార్లు వారు ఏమి చేస్తున్నారో కూడా వారికి తెలియదు. తెలియకుండానే చేసేస్తారు. కొంతమంది పిల్లలు చాలా కొంటెగా ఉంటారు మరియు అందులో భాగంగా దొంగిలించే చెడు అలవాటును కూడా పెంచుకోవచ్చు. పిల్లలు దొంగిలించడానికి కొన్ని స్పష్టమైన కారణాలు కూడా ఉంటాయి. దొంగిలించే అలవాటు చెడు స్నేహితుల ప్రభావంతో అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక పిల్లవాడు తనకు నచ్చిన వస్తువుని చూచినప్పుడు దానిని కావాలి అని కోరుకుంటాడు. దొంగిలి స్తున్నాను ను అని తెలియకుండానే దానిని దొంగిలిస్తాడు.
ఈ ప్రవర్తనను చిన్న వయస్సులో గుర్తించక పోయినట్లయితే అది భవిష్యత్తులో పెద్ద వ్యసనంగా మారుతుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మేము మీకు చాలా ఉపయోగకరమైన సలహాలను అందిస్తున్నాము. దురదృష్టవశాత్తు, మీ పిల్లలు ఈ అలవాటును కలిగి ఉంటే, మేము చెప్పిన ఈ చిట్కాలను అమలుపరచడం వలన మీ పిల్లల ప్రవర్తన మెరుగుపరచడంలో మీకు సహాయపడతాయి. మీ పిల్లలు దొంగిలించకుండా నిరోధించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా చదవండి.
పిల్లలను దొంగిలించుకుని ఆపడం ఎలా ?
పిల్లల దొంగతనం ఆపడానికి సహాయపడే మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
మీ నిగ్రహాన్ని కోల్పోకండి :
మీ పిల్లలు డబ్బు లేదా వస్తువులను దొంగిలించడం చూసినప్పుడు మీరు షాక్ అవుతారు అని మాకు స్పష్టంగా తెలుసు. కానీ, వారు ఇంకా చిన్న వారు. మీ పిల్లవాడు ఏదో ఒకటి దొంగిలించాడని మీరు కచ్చితంగా తెలుసుకున్నప్పుడు, మీరు అతనిపై విరుచుకు పడవలసిన అవసరం లేదు. అటువంటి సమయంలో మీరు ఏమి చేయాలంటే, వారిని మీ ఎదురుగా కూర్చోబెట్టి ఎందుకు మరియు ఎవరిది దొంగిలించాడో వారితో మాట్లాడండి. దొంగిలించడానికి వెనక ఉన్న అసలైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
పిల్లలను ఎప్పుడు నిందించకండి :
మీ పిల్లలు దొంగిలించారని ఇతరులు మీకు చెప్పినప్పుడు వారిని మీరు విశ్వసించ నట్లయితే, మీ పిల్లలను నిందించవద్దు. ఒకవేళ అది నిజమైతే, ఇతరుల వస్తువులను దొంగిలించడం ఎంత తప్పో వారికి వివరించి చెప్పండి. నిజాయితీ గురించి వారికి బోధించండి.
ఇది కూడా చదవండి..
నా బిడ్డను దొంగిలించకుండా అదుపులో పెట్టడం ఎలా ?
మీ పిల్లలకు దొంగతనం గురించి పాఠం ఎలా నేర్పించాలి !
సరే, మీ పిల్లలు ఇతరుల వస్తువులను దొంగిలించి తమ సొంతం చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టండి. ఆ వస్తువులు మీకు చెందినవి కావు, ఆ వస్తువులు అవతలి వారికి సంబంధించినవి అని తెలియచెప్పండి. నిజాయితీగా ఆ వస్తువులు ఎవరికి చెందుతాయో వారికి వివరించి చెప్పండి.
అలాంటి ప్రభావానికి దూరంగా ఉండమని వారికి తెలియ చెప్పండి :
మీ పిల్లవాడిని సున్నితంగా అడగండి.
" ఎందుకు ఇతరుల వస్తువులను దొంగిలించావు? " వారు తమ సహవిద్యార్థులు దొంగిలించినందువల్ల తాము కూడా దొంగిలించాము అని మీకు చెప్పినట్లయితే, మీరు అటువంటి పనులకు దూరంగా ఉండమని , మీ పిల్లలకు అది ఎంత చెడు అలవాటొ మరి మరి తెలియచెప్పండి. దాని గురించి పిల్లల క్లాస్ టీచర్ తో మాట్లాడండి. తద్వారా వారు పిల్లలకు దొంగిలించడం ఎంత తప్పో మరియు సిగ్గుచేటో చెప్పడం ప్రారంభిస్తారు.
ఆ వస్తువులను తిరిగి ఇవ్వమని వారికి చెప్పండి మరియు క్షమాపణ చెప్పమనండి :
మీరు ఒకసారి మీ పిల్లలకు దొంగిలించడం అన్నది ఎంత చెడ్డ పనో వివరించిన తర్వాత, వారి వస్తువులను వారికి తిరిగి ఇచ్చి మరియు ఆ వ్యక్తిని క్షమార్పణ అడగమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు ఇతరులకు సహాయపడే ప్రవర్తన అలవడుతుంది. మీరు కూడా వారిని క్షమించండి.
మీ పిల్లవాడిని క్షమించండి. దొంగిలించడం అన్నది చాలా చెడ్డ అలవాటు మరియు తప్పు అని పిల్లలకు చెప్పిన తర్వాత పిల్లలు దానిని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వారు తల్లిదండ్రులు గర్వపడేలా తమ ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ నుండి తెలుసుకోవడానికి మేము ఎంతో ఇష్టపడతాము !
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}