• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

ప్రీస్కూలర్ మరియు చిన్నబిడ్డల బరువు పెరిగే 7 ఆహారాలు..

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 03, 2020

 7
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పిల్లలు ప్రీ స్కూల్ కి వెళ్లడం ప్రారంభించే టప్పటికీ వారి ఆరోగ్యకరమైన బరువు ఎలా పెంచాలో అనేవి మీ మనసులో ఎప్పుడు ఉండే ప్రశ్నలు. శిశువు దశ నుండి స్వయంగా ఆహారం తినడం అలవాటుచేసుకుంటున్న వారి బరువు పెరుగుదలకు ఆహామే కారణం అవుతుంది. ఈ దశలో పిల్లలు ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోవచ్చు. అదేవిధంగా తినాలనే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. సాధారణంగా ఆ వయసు పిల్లలు తక్కువ బరువుకు అదే కారణంగా ఉంటుంది. ఒక తల్లిగా, పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి గురించి ముఖ్యంగా , వారి బరువు గురించి ఆందోళన చెందుతారు. తమ పిల్లలు సరైన బరువు పెరుగుతున్నారా ! లేదా,  పిల్లలను బరువును మెరుగుపరచడానికి నేను ఏమి చేయగలను, బిడ్డ ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఏ ఆహార పదార్థాలను ప్రయత్నించగలను అనేవి ఒక తల్లి మదిలో మెదులుతూ ఉండే  కొన్ని ప్రశ్నలు. మీ చిన్న బిడ్డల బరువును ఆరోగ్యకరమైన రీతిలో ఎలా పెంచుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.


 

నా బిడ్డ నిజంగా తక్కువ బరువుతో ఉన్నాడా ?

 

ముఖ్యంగా భారతీయ తల్లులతో ఉన్న సమస్య ఏమిటంటే, చబ్బీగా, బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావిస్తాము. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉన్నంతకాలం మరియు చురుకుగా ,ఆరోగ్యంగా , సంతోషంగా ఉన్నట్లయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ శిశువు యొక్క బరువును ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, మీ సందేహాలను శిశు వైద్యుని దగ్గర  ధ్రువీకరించుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలలో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తారు. మరియు బిడ్డ నిజంగా బరువు తక్కువగా ఉన్నాడు లేదో కూడా మీకు తెలియజేస్తాడు. బిడ్డ నిజంగా బరువు తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు పోషణ కీలక పాత్ర వహిస్తుంది.

 

తక్కువ బరువు మరియు ఎదుగుదల :

 

నీ బిడ్డ ఎదుగుదల సరిగా లేకుండా మరియు వయసుకు తగిన బరువు లేకుండా ఉన్నట్లయితే, అది చాలా తీవ్రమైన సమస్య. తక్కువ బరువు ఉన్న పిల్లలు అభివృద్ధిలో వెనుకబడి మరియు  అసౌకర్యంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు మంచి పోషకాహారం మరియు సమతుల్య ఆహారము వారి పెరుగుదలకు సహాయపడుతుంది. ఆ దశలో వారికి పోషకాహారం అత్యవసరం. మీ పిల్లల ఆహారంలో ఈ ప్రత్యేకమైన ఆహారాలను చేర్చడం ద్వారా వారికి తగినంత పోషణ మరియు బరువు పెరగడంలో కూడా సహాయపడుతుంది.

[బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఈ చిట్కాలను అనుసరించండి]

 

మీ ప్రీస్కూలర్లకు ఆరోగ్యకరమైన బరువు పెరుగుటకు ఆహారాలు :

 

1 నుండి 3 సంవత్సరాల వయస్సు అన్నది పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పడడానికి చాలా కీలకమైనది. ఈ వయసులో పిల్లల అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. మరియు వారి ఎదుగుదలకు ఎక్కువ శక్తి మరియు కేలరీలు అవసరం ఉంటుంది. ఈ వయసులో పిల్లలు చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకోగలరు. కాబట్టి వారు మూడు సార్లు భోజనం చేయడం ద్వారా అన్ని కేలరీలను పొందలేరు . మరియు  శక్తిని పొందడానికి ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం అవసరం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలకు అల్పాహారము మరియు భోజనాలలో వైవిధ్యమైన పోషక సమతుల్యమైన ఆహారాన్ని తరచుగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దానికోసం మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి..

 

# 1. ధాన్యాలు :

 

ఇది పిల్లలు తమ చేతులతో తాము ఆహారాన్ని తినడం ప్రారంభించే సమయం. కాబట్టి ఈ సమయంలో అన్నం ,చపాతీ లేదా గంజితో పాటుగా పరోటా, గుడ్డు, పప్పు, చికెన్ లను అన్నంతో కానీ చపాతీతో కానీ ఇవ్వవచ్చు. అన్నము లేదా చపాతీలకు ఒక చెంచా నెయ్యి లేదా వెన్న లను కలిపి ఇవ్వండి. పరాటా లేదా దోశలతోపాటు బంగాళదుంప, పన్నీరు, చీజ్ మొదలైన వాటిని ఇవ్వవచ్చు. ఈ వయసులో పిల్లలు పాస్తాను ఆనందించడం ప్రారంభిస్తారు. కాబట్టి సన్నగా తరిగిన కాయగూర ముక్కలు, తురిమిన జున్ను లేదా చికెన్ ను కూడా వారికి ఇవ్వవచ్చు. మంచి క్యాలరీలు లభించడానికి ఆలివ్ నూనె మరియు వెన్న ను అందులో చేర్చండి.

 

# 2. పండ్లు :

 

అరటి , సపోటా , మామిడి , సీతాఫలం వంటి పండ్లు ఇవ్వవచ్చు. వాటిలో మిల్క్షేక్ , కస్టర్డ్ లేదా ఐస్క్రీమ్లను చేర్చి ఇవ్వవచ్చు. ఆవకడో కొవ్వు, అధికమైన క్యాలరీలు మరియు సమృద్ధి అయిన పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ పండ్లను తేనె, డ్రై ఫ్రూట్స్ మరియు పెరుగు లతో కలిపి స్మూతీ లాగా కూడా చేసి ఇవ్వవచ్చు. అయితే, మీ బిడ్డకు గింజల అలర్జీ లేదని నిర్ధారించుకోండి.

 

# 3. కూరగాయలు :

 

పుష్కలమైన కార్పోహైడ్రేట్లతో కూడిన పిండి కాయగూరలు మీ పిల్లలను అవసరమైన  మంచి కేలరీలతో నింపడానికి సహాయపడతాయి. ఇతర కాయగూరల తోపాటుగా బంగాళాదుంప, చిలగడదుంప, చామదుంప, కంద దుంపలను ఎక్కువగా వాడండి. మీరు వీటిని రోటి, శాండ్విచ్, పరోటా, దోస, కిచిడి మరియు సూపులలో కూడా వాడవచ్చు. వీటిని ఇతర కాయగూరలతో కూడా కలిపి ఇవ్వవచ్చు. ప్రతిరోజు ఈ కాయగూరల్లో కనీసం ఒక్కటి అయినా ఇవ్వడానికి ప్రయత్నించండి.

 

# 4. గుడ్లు :

 

గుడ్లు ప్రోటీన్లకు మంచి వనరులు. ఇవి పిల్లలు మరియు పెద్దలు కూడా ఎంతో మేలు చేస్తాయి. గుడ్లను బాగా ఉడికించి చిన్న ముక్కలుగా తరిగి, ఆమ్లెట్ రూపంలోనూ మరెన్నో రకాలుగా పిల్లలకు  ఇవ్వవచ్చు. కస్టర్డ్, పాన్ కేక్, పరాటా, దోస మరియు కాశీ రూల్స్ లో కూడా  వీటిని ఉపయోగించవచ్చు. ఫ్రెంచ్ టోస్ట్ కార్బోహైడ్రేట్లు మరియు కేలరీలతో అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.

 

# 5. పౌల్ట్రీచేప / మాంసం :

 

మీ పిల్లలు పౌల్ట్రీ మరియు చేపలను తినగలిగితే వారానికి రెండు సార్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. వీటిలో సమృద్ధిగా ప్రొటీన్లు ఉండడమే కాకుండా పుష్కలమైన విటమిన్లు కూడా కలిగి ఉంటాయి. బాగా ఉడికించిన మాంసాన్ని కూడా అందించండి. పౌల్ట్రీ మరియు చేపలను శాండ్విచ్ , పరోటా , దోశ , రైస్ మరియు చపాతీలతో కూడా ఇవ్వవచ్చు.

 

# 6. ఇంట్లో తయారుచేసిన పన్నీరు :

 

ఇంట్లో పన్నీరు తయారు చేయడానికి వెన్నతో కూడిన పాలను ఉపయోగించవచ్చు. దీనిని టిక్కా సైజులో గుండ్రంగా కట్ చేసి పిల్లలకు చిరుతిండి లాగా కూడా ఇవ్వవచ్చు. చిన్న బాల్స్ లా తయారుచేసి ఇవ్వవచ్చు. పిల్లలు తినే అన్ని వంటకాలను శాండ్విచ్ , రోల్స్ , పిజ్జా , మాకరోనీ, పరోటా లేదా మరేదైనా కొత్త వంటకాలను తయారుచేసి ఇవ్వవచ్చు. నిజానికి మాకరోనీ మరియు పన్నీరు చిన్న పిల్లలకు మంచి పోషణ మరియు రుచిని ఇస్తుంది.

 

# 7. గింజలు మరియు డ్రై ఫ్రూట్స్ :

 

గింజలు పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. మరియు అందులో కొన్ని పిల్లల పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్నట్, వేరుశెనగ, బాదం, ఎండు ద్రాక్ష, ఆఫ్రికాట్లవంటి  డ్రైఫ్రూట్స్ను పిల్లలకు ఇవ్వవచ్చు. వీటిని అల్పాహారంగా ఇవ్వవచ్చు లేదా గ్రానొలా బార్ లాగా ఓట్స్ కలిపి తయారు చేసి ఇవ్వవచ్చు. మామూలు చాక్లెట్లు మరియు క్యాండీలకు బదులుగా ఇటువంటి బార్లు మంచి క్యాలరీలు మరియు ప్రొటీన్లతో పాటుగా విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కచ్చితంగా వారి బరువును పెంచుతాయి. మీరు అదనపు క్యాలరీలు మరియు పోషకాల కోసం పీనట్ బట్టర్ ను బ్రెడ్, క్రాకర్స్ మరియు స్మూతీలలో కలిపి ఇవ్వవచ్చు.

 

మా శిశువు యొక్క బరువును పెంచడం ఎలా?

 

అన్ని రకాల పండ్లు, కాయగూరలు, పాల ఉత్పత్తులు మరియు పౌల్ట్రీ లను రోజుకి కనీసం ఐదు సార్లు ఇవ్వండి.

 

బంగాళాదుంపలు, పాస్తా, చపాతీ మరియు అన్నము వంటి పుష్కలమైన పోషకాలతో నిండిన కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. రిఫైన్డ్ చేయని తృణధాన్యాలను ఎంచుకోండి.

 

పిల్లలు బరువు తక్కువగా ఉంటే వెన్న, నెయ్యి మరియు నూనెలను వాడవచ్చు. పిల్లల బరువు సాధారణంగా వుంటే మాత్రం దయచేసి వీటిని మితంగా వాడండి.

 

కేవలం క్యాలరీలు మాత్రమే ఉండే సోడాలు, ప్యాకేజీ జ్యూస్ మరియు స్వీట్స్ ఇవ్వడం మానుకోండి.

 

వెన్న తీయని పాలు మంచి శక్తిని ఇవ్వడానికి మరియు బరువును పెంచడానికి ఉపయోగపడతాయి. మీ చిన్నారి బరువు పెరిగిన తర్వాత టోన్డ్ మిల్క్ వాడండి.

 

మీ చిన్నారికి రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది సార్లు ద్రవ ఆహారాలు ముఖ్యంగా, నీరు ఇవ్వాలని గుర్తుంచుకోండి.

 

నీటికి బదులుగా పాలతో సూప్ లను తయారుచేయండి. పాస్తా మరియు టోస్ట్ లలో తురిమిన చీజ్ ను కలపండి.

 

పైన పేర్కొన్న ఆహారాలను ఇచ్చేటప్పుడు ఏదైనా అలర్జీ ఉందో  తనిఖీ చేయడానికి ముందు తక్కువ మోతాదులో మాత్రమే ఇవ్వండి. ఎటువంటి అలర్జీని గమనించనట్లయితే ఆహారాలను కొనసాగించండి.

 

నేను మా చిన్నారి బరువును పెంచుటకు మందులను ఉపయోగించవచ్చా ?

 

బరువు మరీ తక్కువగా ఉన్న పిల్లలకు ప్రణాళికాబద్ధమైన కేలరీలు మరియు ఆహారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేనట్లయితే , అటువంటి పిల్లలలో ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం లేదా జన్యుపరమైనది అయిఉండవచ్చు. కొంతమంది పిల్లలు సహజంగానే తక్కువ ఆకలిని కలిగి ఉంటారు. మరి కొంతమంది పిల్లలు ఆహారాన్ని ఎంచుకుని తినే వారుగా ఉంటారు. ఆ కారణంతో వారు తగినన్ని పోషక ప్రయోజనాలు పొందలేరు. మీ పిల్లలలో అటువంటి సమస్యలు ఉన్నట్లయితే బరువు పెరగడానికి వాణిజ్య పదార్థాలతో  ఆహారాన్ని భర్తీ చేయాలి అనే అంశంపై నిపుణులు మీకు సహాయం చేయగలరు. ఈ పదార్థాలు వివిధ రకాల విటమిన్లు , ఖనిజాలు , ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను వైవిధ్యంగా అందిస్తారు. ఇది పిల్లలను ఎక్కువగా ఆకర్షించే విధంగా రక రకాల పొడులు, మిక్స్ లు , మరియు ద్రవాల రూపంలో రూపొందించబడినవి. ఇది పిల్లలకు  డాక్టర్ల సలహా ప్రకారం మాత్రమే ఇవ్వాలి. ఓ టి సి సప్లిమెంట్లను ఎంచుకో వద్దు. అవి పెద్దలకు అనుకూలంగా ఉంటాయి . కానీ , పిల్లలకు కాదు.


ఇక్కడ ఇచ్చిన సూచనలు పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి అని దయచేసి గమనించండి. పిల్లలకు ఏదైనా అనారోగ్యం లేదా రుగ్మత ఉన్నట్లయితే వారి వ్యక్తిగత ప్రణాళిక కోసం మీ వైద్యుని లేదా డైటీషియన్ ను సంప్రదించాలి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}