వర్షాకాలంలో ఏయే ఆహారాలు తీసుకోవాలి ? వేటిని తినకూడదు?

Ch Swarnalatha సృష్టికర్త నవీకరించబడిన Jun 29, 2022

“వావ్ మమ్మీ వర్షం పడుతోంది! చాట్, పకోడీ ఏదైనా చేయవా..!” వర్షాకాలంలో పిల్లలు చేసే డిమాండ్లు ఇవే. చిన్నపిల్లలుగా ఉన్నపుడు, మనం కూడా వర్షంలో డ్యాన్స్ చేయడం, నీటి కుంటల్లో దూకడం ఇంకా వర్షంలో చాట్ తినడం వంటివి చేస్తూ ఆనందించేవాళ్లం కదా. మరి దీన్ని ఆస్వాదించడానికి మీ పిల్లలకు కూడా ఎందుకు సహాయం చేయకూడదు? కాకపోతే వర్షాకాలం అనేక రకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వైరస్ అభివృద్ధి చెందే సమయం. అందుకే కాస్త జాగ్రత్తలతో మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఈ సమయాన్ని ఆనందించవచ్చు. మరి వానాకాలంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు ఏవో చూద్దాం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన, నివారించాల్సిన ఆహారాలను ఈ బ్లాగ్ లో పంచుకున్నాము. ఇదిగో నా మాన్సూన్ ఫుడ్ గైడ్..
వర్షాకాలంలో సురక్షితమైన ఆహారాలు:
-
పండ్లు - చెర్రీస్, లిచీ, జామూన్, పచ్చి బాదం, పీచెస్ మరియు రేగు పండ్లలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి మరియు మీ పిల్లల వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
-
ఆరోగ్యకరమైన స్నాక్స్ - మీ పిల్లలకు వాల్నట్లు, బాదం పప్పులు, ఎండిన ప్లమ్ మరియు పళ్ళు,ఖర్జూరాలను తినడానికి ఇవ్వండి.
-
గుడ్లు (పరిశుభ్రమైన మూలాల నుండి వచ్చినవి), సోయా, పప్పులు ఇవన్నీ మంచి ఎంపికలు.
-
మొక్కజొన్న, బఠానీ మరియు వోట్స్ వంటి పొడి తృణధాన్యాలు
-
మీ పిల్లల ఆహారంలో వెల్లుల్లి, మిరియాలు మరియు అల్లం వంటి మసాలా దినుసులు చేర్చండి ఎందుకంటే అవి జీర్ణక్రియకు సహాయపడతాయి.
వర్షాకాలంలో ఏ ఆహారాలను నివారించాలి:
-
నూనె, మసాలాలతో కూడినవిమరియు వీధి ఆహారం.
-
ముందుగానే కట్ చేసిన పచ్చి సలాడ్లు మరియు పండ్లు
-
పచ్చి మొలకలు.
-
పుచ్చకాయలు, సీతాఫలాలు మరియు మామిడికాయలు.
-
కోల్డ్ కట్స్ మరియు మాంస౦.
ఈ కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకుంటే, రైనీ సీజన్లో మీ పిల్లలను సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచవచ్చు. కొంచెం సృజనాత్మకత మరియు కృషితో, మీరు కూడా మీ కుటుంబం ఇష్టంగా ఎంజాయ్ చేసే మాన్సూన్ ఈట్స్ లేదా చాట్ మరియు పకోడీ వంటి వీధి ఆహారాన్ని వంటగదిలోనే సిద్ధం చేయవచ్చు. మీ పిల్లలు కొంచెం పెద్దవారైతే, వారు మీకు కూడా వంట చేయడంలో సహాయపడగలరు!
రీతికా యొక్క ఈ మాన్సూన్ ఫుడ్ గైడ్ మీకు ఉపయోగకరంగా ఉందా? వర్షాకాలంలో మీ పిల్లలు ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆనందిస్తారు? మీ వంటకాలను మరియు వ్యాఖ్యలను తెలియజేయండి… మేము మీ సలహాలు, సూచనల కోసం ఎదురుచూస్తున్నాము!

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}