• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్

పిల్లల పెంపకం అంటే ఏమిటి ? పిల్లలకు ఇవ్వవలసినవి మరియు ఇవ్వదగనివి..

Aparna Reddy
7 నుంచి 11 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 06, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎంతో ప్రయాస పడతారు. ముఖ్యంగా సాంప్రదాయాలకు పెద్దపీట వేసే భారత్ లాంటి దేశాలలో తల్లిదండ్రులు వారి జీవితాలనే పిల్లలకోసం సమర్పిస్తారు. ఈ ప్రక్రియలో ఎన్నో  ఒడిదుడుకులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు యొక్క ఉద్దేశాలు ఖచ్చితంగా మంచిగానే ఉంటాయి. కానీ ప్రక్రియలోనే మార్పులు ఉంటాయి.

 

అసలు పిల్లల పెంపకం అన్నమాట పాశ్చాత్య దేశాల నుండి మన దేశానికి వలస వచ్చినది. ఇది మన సంస్కృతి , సాంప్రదాయాలకు అవసరం లేని ఒక మాట. నిజానికి పెంపకం అన్నది మనుషులకు సంబంధించిన విషయం కాదు. అది మనసులేని జంతువులకు, మొక్కలకు మాత్రమే వర్తిస్తుంది. పిల్లల విషయంలో ప్రత్యేకమైన పెంపకం అంటూ ఏమి ఉండదు అని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల ద్వారా తెలుపుతున్నారు.

 

పిల్లలకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా నేర్ప దగినది అంటూ ఏమీ లేకపోయినప్పటికీ, వారి ప్రవర్తన ద్వారా అవలంబిస్తూ ఉన్నట్లయితే పిల్లలు వీటిని అలవర్చుకోవడం అన్నది చాలా మామూలుగా జరిగిపోతుంది. దీనికి ప్రత్యేకమైన పెంపకం అనే పదజాలం ఉపయోగించవలసిన అవసరం కూడా లేదు.

 

తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా పిల్లలకు ఇవ్వవలసిన ముఖ్యమైన మూడు అంశాలు :

 

1. ప్రేమ :

ప్రేమ అన్నది వారి సంపద, హోదాలకు సంబంధించినది కాదు. అది కేవలం సంస్కారానికి సంబంధించిన విషయం. 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయసులో పిల్లల హృదయాలలో ప్రేమకు నిదర్శనాన్ని ప్రత్యక్షంగా చూపకలిగినట్లయితే వారి జీవిత కాలం అంతా కూడా ఆ ప్రేమ అనే మొలకను ఎవ్వరూ వారి హృదయాలనుండి తొలగించజాలరు. వారి పిల్లలను వారు ప్రేమించడం అన్నది ప్రతి తల్లిదండ్రులు చేస్తారు. ఆ ప్రేమ ద్వారా పిల్లలు స్వార్ధాన్ని నేర్చుకోగలుగుతారు కానీ ప్రేమను పంచడం నేర్చుకోజాలరు. స్నేహితుల విషయంలోనూ, ఇరుగుపొరుగువారితోనూ, పనివారుతోనూ పెద్దలతో తల్లిదండ్రులు ప్రేమతో మెలగడం పిల్లలు చూస్తూ పెరిగినట్లయితే అది వారి లోని ప్రేమను పెంచడానికి ఉపయోగపడుతుంది. వారికి ప్రత్యేకంగా ప్రేమను గురించి నేర్పవలసిన అవసరం ఉండదు.

 

2. ఆనందం :

నిజమైన ఆనందం అన్నది ఎప్పుడూ వస్తు రూపంలోఉండదు. ప్రాథమిక దినాలలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయమే వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉండే సమయంలో , ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. తల్లిదండ్రులు భేషజాలకు పోకుండా పిల్లల ఆనందం అన్నది నిజంగా  ఎక్కడ ఉందో తెలుసుకుని అటువైపుగా పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు సహకరించినట్లయితే నిజమైన అభివృద్ధి సాధించగలరు.

 

3. బాధ్యత :

ప్రేమ, సంతోషం రెండు ఉన్నప్పటికీ పిల్లలు బాధ్యతగా లేనట్లయితే వారు ఉన్నత స్థితికి చేరుకోవడానికి కష్టతరం అవుతుంది. పిల్లలకు చిన్న వయస్సు నుండే వారి వారి బాధ్యతలను వారికి నేర్పించడం తల్లిదండ్రులు చేయవలసిన ముఖ్యమైన కర్తవ్యం. ఏ వయస్సుకి అవసరమైన బాధ్యతలను ఆ వయసులో తీసుకోవడానికి అలవాటు చేయగలగాలి. చిన్న వయస్సులో బాధ్యతను అలవాటు చేసినట్లయితే, వారు ఆర్థిక విషయాలలోనూ, కుటుంబ విషయాలలోను, వృత్తిపరంగాను, సామాజికంగానూ మరియు చట్టపరంగాను బాధ్యతాయుతంగా ప్రవర్తించ కలుగుతారు. వారు ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి బాధ్యత అన్నది ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

 

తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా పిల్లల ముందు ప్రదర్శించడకూడని  ముఖ్యమైన మూడు అంశాలు :

 

1. అసూయ :

అసూయ అన్నది మనలోని ప్రతిభను ఎదగనివ్వకుండా చేస్తుంది. తల్లిదండ్రులు ఎవరి విషయంలోనూ అసూయను పిల్లల ముందు ప్రదర్శించకూడదు. అది వారి పసి హృదయాల మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి ముందుగా తల్లిదండ్రులే వారి లోపల దాగి ఉన్న అసూయ నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయగలగాలి.

 

2. కోపం :

కోపం అన్నది మన లోని మరొక అవలక్షణం. పూర్తిగా కోపగించుకోకుండా ఉండడం అన్నది మామూలు మనుషులకు అసాధ్యము. కాని సాధ్యమైనంతవరకు పిల్లల ముందు తమ కోపాన్ని ప్రదర్శించక పోవడం ఎంతో ముఖ్యం. తాత్కాలికమైన కోపం వల్ల ఎన్నో అనర్థాలకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పెద్దలు కూడా కోపంతోనూ, తొందరపాటుతోను సరిదిద్దుకోలేని పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. "తన కోపమే తన శత్రువు " అని మన పెద్దలు చెప్పినట్లుగా కోపాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చినప్పుడు కొంతసేపు మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నట్లయితే సత్ఫలితాలను పొందగలం అన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. అదే అలవాటును వారు నేర్పకుండానే  పిల్లలు తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు.

 

3. అసహనం :

కొంతమంది తల్లిదండ్రులు చాలా త్వరగా అసహనానికి గురవుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి తొందరపడుతూ ఉంటారు. అదే అసహనం పిల్లలలో అలవడానికి తల్లిదండ్రుల ప్రవర్తన చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సహనాన్ని పాటించడం అన్నది ఎంతో అవసరం. అసహనం వలన ఇతరులకు జరిగే నష్టం కంటే కూడా వారి వలన వారికే నష్టం వాటిల్లుతుంది. గందరగోళమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ప్రశాంతతను కోల్పోతారు. తద్వారా కుటుంబ వాతావరణంలో అలజడి ప్రారంభం అవుతుంది. దీని ప్రభావం పిల్లల మీద కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతో ఉంటుంది.


ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఫలితం మీద ఆసక్తి ఉంటుంది . కానీ , ప్రక్రియను మరిచిపోతున్నారు. పిల్లలను ఎప్పుడు హద్దుల్లో పెట్టాలి అనుకోకండి. పిల్లలు ఎదగడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వాలి. చిన్నతనం నుండి ఒక అందమైన ప్రక్రియలో మీ చిన్నారులను ఎదగనివ్వండి. వారి అందమైన భవిష్యత్తుకు అవే మంచి పునాదులు అవుతాయి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}