• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

భారత్ లో వెస్ట్ నైల్ ఫీవర్: అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు, చికిత్స ఇతర వివరాలు

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన May 31, 2022

కేరళలోని త్రిసూర్ జిల్లాలో వెస్ట్ నైల్ ఫేవర్ కారణంగా ఈ ఆదివారం 47 ఏళ్ల వ్యక్తి మరణ౦ సంచలనం సృష్టించింది. గత మూడేళ్లలో కీటకాల ద్వారా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ కారణంగా రాష్ట్రంలో సంభవించిన మొదటి మరణం ఇదే. ఇది ప్రజలను భయాన్దోలనలకు  గురిచేసింది.  మరి, ఈ వెస్ట్ నైల్ ఫేవర్ జ్వరానికి కారణం ఏమిటి మరియు అది ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం.

మీరు తెలుసుకోవలసినది:

వెస్ట్ నైల్ జ్వరం క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది.  ఇది మొదట 1937లో ఉగాండాలో కనుగొనబడింది. ఇక భారతదేశంలో , ఈ జ్వరం మొదటిసారిగా 2011లో, కేరళలో కనుగొనబడింది. 2019లో మలప్పురంకు చెందిన ఆరేళ్ల బాలుడు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు. వెస్ట్ నైల్ వైరస్ మానవులలో ప్రాణాంతకమైన నాడీ సంబంధిత వ్యాధికి కారణమవుతుందని అంటారు. అయితే వ్యాధి సోకిన వారికి సాధారణంగా ఎలాంటి ప్రత్యెక లక్షణాలు కనిపించవు.

వెస్ట్ నైలు జ్వరం అంటే ఏమిటి?

వెస్ట్ నైల్ వైరస్ (WNV) దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది సాధారణంగా సోకిన దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. "WNV కేసులు దోమలు ఎక్కువగా ఉండే  కాలంలో సంభవిస్తాయి, ఇది వేసవిలో ప్రారంభమవుతుంది, ఈ కాలం  ముగిసే వరకు వరకు కొనసాగుతుంది" అని అమెరికా కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం మరియు నివారణ (CDC) తెలియజేసింది. ఈ సంస్థ జారీ చేసిన వివరాల ప్రకారం: 

వెస్ట్ నైల్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

వెస్ట్ నైల్ వైరస్ సాధారణంగా సోకిన దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షుల మీద వాలినపుడు దోమలు ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ వ్యాధి సోకిన దోమలును కుట్టడం ద్వారా  వెస్ట్ నైల్ వైరస్‌ ప్రజలకు మరియు ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. అయితే, చాలా తక్కువ కేసుల్లో, ప్రయోగశాలలో బహిర్గతం కావడం, రక్తమార్పిడి లేదా అవయవ మార్పిడి, గర్భధారణ ఇంకా  డెలివరీ సమయంలో లేదా తల్లి పాలివ్వడం ద్వారా తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది.

వెస్ట్ నైలు జ్వరం లక్షణాలు ఏమిటి?

ఇప్పటివరకు, అధిక జ్వరం, తలనొప్పి, మెడ పట్టేయడం, మూర్ఛ, తల తిరగడం, కోమా, వణుకు, మూర్ఛలు, కండరాల బలహీనత, దృష్టి నష్టం, తిమ్మిరి మరియు పక్షవాతం వంటివి  వెస్ట్ నైల్ ఫీవర్ ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.

వెస్ట్ నైల్ వారిన పడినపుడు ఏ వయస్సు వారికైనా అనారోగ్యం రావచ్చు. అయినప్పటికీ, 60 ఏళ్లు పైబడిన వారు వ్యాధి బారిన పడినట్లయితే వారిలో 50 మందిలో ఒకరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండ వ్యాధి వంటి కొన్ని వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఇంకా  అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టే అని  పేర్కొంది.

అయితే రికవరీ సంగతి ఏమిటి?

వెస్ట్ నైలు ఫీవర్ వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకోవడానికి చాలా వారాలు లేదా ఒకోసారి నెలలు పట్టే అవకాశం ఉంది. కేంద్ర నాడీ వ్యవస్థపై  కొన్ని ప్రభావాలు శాశ్వతంగా పడవచ్చు. వెస్ట్ నైలు వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసిన కారణంగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 10 మందిలో ఒకరు మరణించవచ్చు. 

కానీ విచిత్రమేమిటంటే, ఈ వ్యాధి సోకినా చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. వెస్ట్ నైల్ వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులలో అంటే 10 లో 8 మందికి  ఎటువంటి లక్షణాలు ఉండవు. 5 మందిలో ఒకరికి తలనొప్పి, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా దద్దుర్లు వంటి ఇతర లక్షణాలతో కూదిన జ్వరం వస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ కారణంగా వచ్చే  జ్వరసంబంధమైన అనారోగ్యం నుంచి చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు.  అయితే అలసట మరియు బలహీనత వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది.

వెస్ట్ నైలు ఫీవర్ కోసం ఏవైనా చికిత్సలు అందుబాటులో ఉన్నాయా?

దురదృష్టవశాత్తు, ఇప్పటివరకు, వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి టీకా లేదా నిర్దిష్ట మందులు అందుబాటులో లేవు. అయితే, నొప్పి నివారణకు,  జ్వరాన్ని తగ్గించడానికి ఇంకా  కొన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని ఔషధాలు  ఉపయోగించవచ్చు. సమస్య  తీవ్రమైన సందర్భాల్లో, రోగులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుందని గమనించడం ముఖ్యం. రోగులకు ఇంట్రావీనస్ ద్రవాలు, నొప్పి తగ్గించే  మందులు మరియు నర్సింగ్ కేర్ వంటి సహాయక చికిత్స అవసరం అని CDC పేర్కొంది.

 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}