• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

కోవిడ్ నుండి రక్ష ణ కోసం ఇంటిలో ఏ రకమైన మాస్క్ ధరించాలి? వైద్య నిపుణుల సూచన ఇదే..

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 12, 2022

కోవిడ్-19 కేసులు మళ్ళీ ఎక్కువ అవుతున్న నేపధ్యంలో మాస్క్ ధరించడాన్ని మళ్ళీ తప్పనిసరి చేయాలనే అంశాన్ని కొన్ని దేశాలు పరిశీలిస్తున్నాయి. కరోనా వైరస్ నుండి వ్యక్తిగత రక్షణ కోసం ఫేస్ మాస్క్ ధరించాలని ఆరోగ్య నిపుణులు మరియు పరిశోధకులు సిఫార్సు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ టామ్ ఫ్రైడెన్ మాట్లాడుతూ, కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ గురించి ఆందోళన చెందుతున్నప్పుడు, తమ చుట్టూ ఉన్నవారు మాస్క్ ధరించనపుడు, ఇంట్లోనే ఉన్నప్పటికీ మనం తప్పనిసరిగా N95కి అప్‌గ్రేడ్ కావడం మంచిదని ఆయన సూచించారు. 

“మీరు కోవిడ్ (వైద్యపరంగా హాని లేదా ఇతరత్రా) సోకడాన్ని గురించి ఆందోళన చెందుతుంటే, ఇంకా మరియు మీ ఇంట్లో వారు మాస్కులు  ధరించని సందర్భంలో, N95కి అప్‌గ్రేడ్ కావడానికి ప్రయత్నించండి. క్లాత్ లేదా  సర్జికల్ మాస్క్ లు కూడా రక్షణ కల్పిస్తాయి.. కానీ ఇతరులు మాస్క్ వేసుకోకపోతే, మనకు చక్కగా ఫిట్ అయ్యే  N95 మాస్క్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది" అని డాక్టర్ టామ్ ఫ్రైడెన్ తన సోషల్ మీడియా ప్రకటనలో వెల్లడించారు.  

ఇదిలా ఉండగా,  పరిశోధకులు  ఇటీవల కొత్త N95 ఫేస్ మాస్క్‌ను కనిపెట్టారు.  ఇది కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించగలదని మరియు SARS-CoV-2 వైరస్‌ను చంపేస్తుందని వారు ప్రకటించారు. దానికి తోడు, ఈ మాస్క్ పర్యావరణానికి అనుకూలమైనది కూడా. ఎందుకంటే దీనిని తరచుగా మార్చాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు ధరించవచ్చు. తద్వారా తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏర్పడతాయి అని వారు   తెలిపారు.

యునైటెడ్ స్టేట్స్‌లోని రెన్‌సెలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎడ్మండ్ పలెర్మో మాట్లాడుతూ, "N95 రెస్పిరేటర్ వంటి దీర్ఘకాలిక, తమను తాము శుభ్రం చేసుకునే వ్యక్తిగత రక్షణ పరికరాలకు ఇది మొదటి అడుగు అని మేము భావిస్తున్నాము. ఇది సాధారణంగా గాలిలో వ్యాపించే వ్యాధికారక వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ."

అప్లైడ్ ACS మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన పరిశోధన ప్రకారం, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులతో కూడిన ఈ బృందం.. N95 ఫేస్ మాస్క్‌లలో ఉపయోగించే పాలీప్రొఫైలిన్ ఫిల్టర్‌లలో బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీమైక్రోబయల్ పాలిమర్‌లను విజయవంతంగా జతచేసింది.

N95 మాస్క్‌లలోని యాక్టివ్ ఫిల్టరేషన్ లేయర్లు, రసాయన మార్పులకు చాలా సున్నితంగా స్పందిస్తాయని పరిశోధకులు తెలిపారు.  అతినీలలోహిత (UV) కిరణాల సహాయంతో, పాలీప్రొఫైలిన్ వస్త్ర ఉపరితలానికి  యాంటీమైక్రోబయల్ లక్షణాలు గల క్వాటర్నరీ అమ్మోనియం పాలిమర్‌లను జతచేయగాలిగారు. 

కొత్త మాస్కులను  తయారు చేయాల్సిన చేయడం అవసరం కాకుండా,ఈ ప్రక్రియను ఇప్పటికే తయారు చేసిన సాధారణ పాలీప్రొఫైలిన్ ఫిల్టర్‌లకు అన్వయించవచ్చని పరిశోధకులు తెలిపారు.  ఇది ఒక మంచి పరిష్కారం అని వారు తెలియచేసారు. 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}