• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ బిడ్డ సంరక్షణ ఫుడ్ అండ్ న్యూట్రిషన్

అప్పుడే పుట్టిన శిశువులకు మరియు చిన్న పిల్లలకు ఏ పాలు ఇవ్వటం మంచిది ?

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 02, 2022

తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ఎంతో ఆరోగ్యకరమైన మరియు ఉత్తమమైన ఎంపిక అని మీకు తెలుసా ? మొదటి సంవత్సరంలో అందే పోషకాలు వారి జీవితకాలపు ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటాయని మీకు తెలుసా ?తల్లిపాల యొక్క ఉపయోగాలను మరియు అవి మీ పిల్లలకు ఎంత ఉత్తమమైనవో మా నిపుణులతో తెలుపబడిన ఆర్టికల్స్ చదవండి.

ఖచ్చితంగా 0 - 6 నెలల వరకు శిశువుకు తల్లిపాలను మాత్రమే ఇవ్వమని ఎందుకు చెబుతారు ?

శిశువుకు మొదటి ఆరు నెలలు అధికమైన శక్తి అవసరం ఉంటుంది. వారి శరీర బరువును బట్టి 110 కిలో కేలరీల శక్తి అవసరం ఉంటుంది. అది వారు తల్లిపాల నుండి సులభంగా పొందగలరు .బిడ్డకు ఆరోగ్యకరమైన మరియు సరైన పోషక విలువలు కలిగిన తల్లిపాలు ఇవ్వడం ఎంతో అవసరం .ఇది వారి ఆరోగ్యంతో పాటు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.

అధిక ప్రోటీన్ అవసరం  - అందుకే తల్లి మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆ ప్రోటీన్ తల్లి ద్వారా బిడ్డకు చేరుతుంది .తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంచే 'వే ప్రోటీన్' ఉంటుంది. ఈ వే ప్రోటీన్  శిశువులలో గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా అది పొట్టలోని గ్యాస్ ను త్వరగా బయటకు పంపుతుంది .అందువల్ల చిన్నారులకు తల్లిపాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. కడుపునొప్పి ,తేనుపులలాంటి అసౌకర్యాలను తగ్గించి తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి .తల్లిపాలలో ఉండే పిండిపదార్ధాలను చక్కెరగా మార్చే అమైల్జ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గ్యాస్ ను త్వరగా బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది.

కొవ్వు యొక్క అవసరం - నిజానికి బిడ్డ కు సరిపడే కొవ్వు (5 నుండి 6 శాతం) తల్లిపాల నుండి లభిస్తుంది.శిశువుకు హిమోగ్లోబిన్ ను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఐరన్ కూడా తల్లిపాలలో దొరుకుతుంది. తల్లిపాలలో ఐరన్ ఎక్కువగా లేనప్పటికీ, మొదటి మూడు నెలల్లో బిడ్డ అవసరాలకు కావలసినంత ఐరన్ తల్లిపాలలో దొరుకుతుంది.

క్యాల్షియం యొక్క అవసరాలు - అదేవిధంగా బిడ్డకు అవసరమైన క్యాల్షియం తల్లిపాల ద్వారా మాత్రమే దొరుకుతుంది . ఈ కాల్షియం ఆవుపాల ద్వారా దొరికే కాల్షియం కంటే కూడా ఎంతో మంచిదని మీకు తెలుసా ?(ఆవు పాలలో తల్లి పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్నప్పటికీ కూడా) మీ శిశువుకు విటమిన్ బి కాంప్లెక్స్ లాంటి విటమిన్లు ,పోలిక్ యాసిడ్ , సీ విటమిన్లు కూడా అవసరం అవుతాయి. ఈ విటమిన్లు అన్నీ కూడా తల్లిపాల ద్వారా లభ్యమవుతాయి . ప్రారంభ దశలో మీ శిశువు యొక్క ఎదుగుదలకు ఇవి అవసరం అవుతాయి.

(చదవండి.. మీ శిశువులకు మరియు చిన్నారులకు ఎంత కాల్షియం అవసరం ఉంటుంది)

విటమిన్ ' సి ' యొక్క అవసరం - తల్లిపాల ద్వారా మీ బిడ్డకు కావాల్సిన సి విటమిన్ కూడా లభిస్తుంది .ఆవు పాలను మరిగించే సమయంలో ఈ విటమిన్ సి నశిస్తుంది . వేడి చేయడం ద్వారా నశించే విటమిన్ సి తల్లిపాల ద్వారా దొరుకుతుంది .తల్లిపాలు తాగే పిల్లలలో ఆమ్లరసం అధికంగా ఉంటుంది .అది వారి కడుపు లోకి చేరే సూక్ష్మ జీవులను నశింప చేయడానికి ఉపయోగపడుతుంది .మరియు క్యాల్షియం ఐరన్ లను గ్రహించేందుకు కూడా ఉపయోగపడుతుంది .తల్లి పాలలోని లాక్టోజ్ .క్యాల్షియంను , ఐరన్ ను గ్రహించడంతో పాటు మలబద్ధకం లేకుండా సాఫీగా మోషన్ అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది. (చదవండి ..పిల్లలకు క్యాల్షియం యొక్క అవసరం ఏమిటి)

తల్లి పాలు  ఎలా ఇబ్బందికి గురిచేస్తాయి ?

కానీ, తల్లిపాలలోని పోషకాలను కూడా ఆటంకపరచే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి.

సిజేరియన్ అయినప్పుడు నిపుల్  కు పుండ్లు పడడం వలన , రొమ్ములో గడ్డలు మరియు స్థనాలలో సమస్యలు ఉన్నప్పుడు తల్లిపాలు సమస్య గా మారుతాయి.

ఇటువంటి పరిస్థితులలో తల్లులు ఆవుపాలను ఆశ్రయిస్తారు .కానీ ఆవు పాలు పిల్లల ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు అవసరమైన పోషకాలను కలిగి ఉండవు. కానీ ,ఆవు పాలలో క్యాల్షియం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది .ఇది జీర్ణక్రియను చాలా కఠిన పరుస్తుంది .ఆవుపాలలో  తక్కువ ఫాస్ఫఒరోస్ ,క్యాల్షియం నిష్పత్తిని కలిగి ఉంటాయి. దీని కారణంగా పిల్లలు మోషన్ కి వెళ్ళేటప్పుడు చాలా గట్టిగా ఉండి  ఇబ్బంది పడతారు.ఆవుపాలలో ఐరన్ ,జింక్ మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి . కాబట్టి ఆవు పాలకు బదులుగా తల్లులు మరేదైనా ఇతర మార్గాలను చూడాలి .ఇది శిశువు యొక్క మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయ పడుతుంది.

గమనిక : shsh కార్యక్రమం వైద్యుల భాగస్వామ్యంతో విద్యా ప్రయోజనాలకోసం ఏర్పడ్డది మాత్రమే. మీ యొక్క మరియు మీ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ప్రశ్నల కోసం వైద్యుడిని సంప్రదించండి.

ఈ వ్యాసం మీకు సహాయ పడిందా ?మీ అభిప్రాయాలను క్రింద ఉన్న సూచనల విభాగంలో మాతో పంచుకోండి.

  • 2
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jul 17, 2020

Hi mem.. na baby 4th month run but first month nunchi na milk baby ki saripovu .. so ma baby ki 'lactogen 1' use chesthunnam .. baby ki problem avuthundha mem plz help me..

  • Reply | 1 Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}