• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్ గర్భం

కోవిడ్ మహమ్మారి ముగియలేదని హెచ్చరి౦చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ : కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలకు భద్రతా చిట్కాలు

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 30, 2022

ప్రపంచవ్యాప్తంగా  110 దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.  దీనివల్ల మొత్తం గ్లోబల్ కేసులు 20 శాతం పెరిగాయని,  కోవిడ్ కేసుల సంఖ్య సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని ఆరు రీజన్లలో, మూడింటిలో కరోనా మరణాలు పెరిగాయని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక తాజా ప్రకటనలో  చెప్పారు. ఇక సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణీలకు కోవిడ్-19 వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.అందుకే గర్భిణీలు ఈ వైరస్‌ను తీవ్రంగా పరిగణించి,  టీకాలు వేయడం చాలా ముఖ్యం అని నిపుణులు వివరించారు. ఈ నేపధ్యంలో,  గర్భధారణ సమయంలో మీరు సురక్షితంగా ఉండేందుకు ఈ ఆరు నియమాలు సహాయపడతాయి. 

  1. మీరు మరియు మీతో నివసించే వార౦దరూ (అర్హులైనట్లయితే) టీకాలు వేయించుకున్నారని నిర్ధారించుకోండి. మీరు కోవిషీల్డ్ లేదా కొవాక్షిన్ వంటి రెండు-డోస్ ల వ్యాక్సిన్ సిరీస్‌ను తీసుకున్నట్లయితే,  రెండవ డోస్‌ వేసుకున్న రెండు వారాల వరకు మీరు పూర్తిగా టీకాలు వేసినట్లు పరిగణించబడరని గుర్తుంచుకోండి.
  2. మీ ఇంటిలోని వ్యక్తులతో సహా వైరస్ బారిన పడిన వ్యక్తులతో వ్యక్తిగతంగా పరస్పర చర్యలను పరిమితం చేయండి.
  3.  బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి. రద్దీగా ఉండే ప్రదేశాలలో మీకు మరియు ఇతరులకు మధ్య సామాజిక దూరం పాటించండి. ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు వెల్లడించే తాజా మార్గదర్శకాల గురించి అప్‌డేట్‌గా ఉండండి.
  4. మీరు పూర్తిగా టీకాలు వేయించుకున్నప్పటికీ,  గర్భం దాల్చడం కంటే ముందే ఏవైనా  ఆరోగ్య సమస్య ఉన్నాలేదా  రోగనిరోధక శక్తిని బలహీనపరిచే మందులు తీసుకుంటున్నా, కోవిడ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అదనపు చర్యలు తీసుకోవలసి రావచ్చు.
  5. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో మీ చేతులను తరచుగా కడగాలి. మీ కళ్ళు, ముక్కు మరియు నోటిని తాకడం మానుకోండి.
  6. మీరు ప్రసవానికి వెళ్లే ముందు,  COVID-19 మార్గదర్శకాల గురించి తెలుసుకోవడానికి మీ ఆసుపత్రి, వైద్య సహాయ సంస్థ  లేదా ఇతర ఆరోగ్య సేవల సంస్థను  సంప్రదించండి. ఉదాహరణకు కొన్ని ఆసుపత్రులు డెలివరీ రూమ్‌లో నిర్దిష్ట సంఖ్యలో వ్యక్తులను మాత్రమే  అనుమతిస్తాయి.

గర్భిణీలందరూ COVID-19 నిరోధక టీకాలు వేసుకోవాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) గట్టిగా సిఫార్సు చేస్తోంది. మీకు కోవిడ్ గురించి  ఏవైనా ప్రశ్నలు, అనుమానాలు  ఉంటే మీ డాక్టర్  లేదా ఇతర వైద్య, ఆరోగ్య సలహాదారుతో ఎల్లప్పుడూ చర్చించండి. ఈ బ్లాగ్లో అంశాలు నచ్చితే, వెంటనే కామెంట్ చేయండి.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

https://www.ndtv.com/world-news/who-says-covid-19-cases-on-rise-in-110-countries-3113431

https://magazine.medlineplus.gov/article/pregnant-during-covid-19-tips-to-stay-safe

 

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}