పిల్లలు తరచుగా తమ తలను ఎందుకు కొట్టుకుంటారు ? దానిని ఆపడం ఎలా ?

Aparna Reddy సృష్టికర్త నవీకరించబడిన May 21, 2020

పిల్లలు తరచుగా తమ తలను గోడలకు, దుప్పట్ల కు, తలగడల కు, పరుపులకు, ఉయ్యాల యొక్క చివరకు మరియు నేల మీద కూడా లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా సాధారణమైన లేదా యధాలాపంగా జరిగే ఒక సాధారణమైన ప్రక్రియ .ఇది శిశువులలోనూ మరియు పిల్లలలోను జరిగే ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ ,ఆ ప్రవర్తన అనేది చిన్నతనంలోనే కాకుండా అలా కొనసాగుతూ ఉన్నట్లయితే అది ఒక అసాధారణ చర్యగా పరిగణించవచ్చు .ఇలా చేయడం అనేది తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగిస్తుంది .మరియు ఆందోళనకు గురిచేస్తుంది .చాలా సందర్భాల్లో పిల్లలు ఇలా ఎందుకు చేస్తారంటే.. కొన్నిసార్లు వారిలోని కోపాన్ని ఆ విధంగా వెళ్లగక్కుతారు.తద్వారా ఎంతో ఓదార్పు పొందుతారు. సాధారణంగా పిల్లలు అలా చేయడం వల్ల ఎంతో రిలీఫ్ పొంది ఉత్సాహంగా ఉంటారు. అది వారికి సుఖమైన నిద్ర ను కూడా ఇస్తుంది.
ఈ తల కొట్టుకోవడం అన్నది ఎప్పుడు మొదలవుతుంది ?
ఈ తల బాధ కోవడం అన్నది సాధారణంగా ఆరు నెలల వయస్సు లోనూ మరియు 18 నెలల నుండి 24 నెలల మధ్య లోనూ ప్రారంభం అవుతుంది. అలా చేయడం అన్నది 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు తమ తలను ప్రతి ఒకటి రెండు సెకన్లకు ఒకసారి గోడకు లేదా మరేదైనా ఉపరితలానికి కొట్టుకుంటారు.
పిల్లలు తల బాదుకోవడం (కొట్టుకోవడం) ఎందుకు చేస్తారు ?
పిల్లలు తల కొట్టుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు:
తలలు ఆడిస్తూ కొట్టు కోవడం వలన ఒకలాంటి రిలీఫ్ ను మరియు ప్రశాంతతను పొందుతారు .ఇలా చేసేటప్పుడు వారికి ఒక లాంటి హాయి కలిగి మంచిగా విశ్రాంతి తీసుకుంటారు.
పంటి లో గాని ,చెవిలో గాని ఇన్ఫెక్షన్ కారణంగా నొప్పిగా ఉన్నప్పుడు మరియు నోటిలో గాని ,చెవిలో గాని అసౌకర్యం గా ఉన్నప్పుడు వారి దృష్టి మరల్చడానికి ఇది వారికి సహాయ పడుతుంది.
ఎక్కువ మంది పిల్లలు మాటలతో తమ భావాలను వ్యక్త పరచలేనప్పుడు తల కొట్టుకోవడం మొదలు పెడతారు.
వారిలోనే కోపాన్ని , ఉక్రోషాన్ని,నిరాశను తల కొట్టు కోవడం ద్వారా కంట్రోల్ చేసుకుంటారు.
కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న పెద్దలను ఆకర్షించడానికి కూడా పిల్లలు తల కొట్టుకోవడం చేస్తారు .ఈ విధంగా వారు తల్లిదండ్రుల నుండి మరియు పెద్దల నుండి గుర్తింపు పొందుతారు .వారు ఈ అలవాటును కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంటుంది.
ఈ ప్రవర్తన ప్రమాదకరమైనది గా గుర్తించబడుతుంది .ఇది ఒక అభివృద్ధి నిరోధక ప్రక్రియగా చెప్పబడుతుంది.
తల కొట్టుకోవడం అన్నది సాధారణమైన ప్రవర్తనా ?
తల కొట్టు కోవడం అన్నది మూడు సంవత్సరాల వరకు సాధారణమైనది గా పరిగణింప బడుతుంది .నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇది యదేచ్ఛగా తగ్గిపోతుంది .ఇది అలా కొనసాగుతూ ఉంటే మాత్రం దీనికి కారణం ఏమిటో గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయిల కంటే కూడా ఈ ప్రవర్తన అబ్బాయిలతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
పిల్లలను తల కొట్టు కోవడం నుండి ఎలా నివారించాలి ?
తల కొట్టుకోవడం అన్నది చాలా సాధారణం. దీని గురించి సాధారణంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన చూసి నిజంగా కలత చెందుతూ ఉంటారు. వాళ్ళు ఇలా చేసినందు వల్ల ఏమైనా నొప్పి కలుగుతుందేమో అని బాధపడుతూ మరియు అలా కొట్టుకోవడం వారి బ్రెయిన్ కు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆందోళన చెందుతారు .వారు తమ పిల్లల నుండి దాని నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు .తద్వారా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం ,వారు చెప్పింది చేయడం లాంటివి చేస్తారు .ఇవి పిల్లల ఈ ప్రవర్తనను మరింత పెంచుతుంది. తల్లిదండ్రులు అలా చేయటం చూచి మళ్ళీ మళ్ళీ తల కొట్టుకోవడం మొదలు పెడతారు.అందుకే మాట్లాడలేక పోవడం లాంటి సమస్యలు లేనట్లయితే తల్లిదండ్రులు ,ఇతర పెద్దలు దానిని అసలు పట్టించుకోనట్లే ఉండాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలను తల కొట్టుకోవడం నుండి ఎలా బయటకు తీసుకు రాగలరు ?
ఎక్కువ మంది పిల్లలు తమంతట తామే ఈ అలవాటు నుండి బయటపడతారు. ఇది పెరగకుండా పిల్లలు క్రమశిక్షణ లో ఉండాలంటే ఈ రెండింటిని అనుసరించాలి. అవేమిటంటే వారిని పట్టించుకోనట్లు గా ఉండడం,మరియు వంటరిగా వదిలివేయడం. వారిని ఏమాత్రం గుర్తించినట్లుగా ఉంటూ వారు చెప్పినవి అన్నీ చేయకుండా ఉన్నట్లయితే దానిని క్రమేణా తగ్గించవచ్చు. పిల్లల యొక్క కోపంతో కూడిన ఉక్రోషాన్నీ గుర్తించనట్లుగా నటిస్తూ ,వారిని వేరొక గదిలో వదిలి బయటకు వచ్చేయడం అన్నది ఉత్తమమైన మార్గం. పిల్లల యొక్క దృష్టిని మరల్చడం, వారిని వేరే పనులతో బిజీగా ఉండే లాగా చేయడం ద్వారా ఇటువంటి అలవాటును మెల్లిమెల్లిగా తగ్గించ గలుగుతారు. ఇలా తరచుగా చేస్తూ ,ఈ పద్ధతిని పాటించడం ద్వారా పిల్లలు త్వరగా దాని నుండి బయటకు రాగలరు.
తల కొట్టుకోవడం లేదా శరీరం ఊగిపోవడం ద్వారా నిద్రకు ఆటంకం కలగడం లేదా ఏదైనా గాయాలు అవ్వడం లాంటివి జరుగుతున్నట్లయితే మాత్రం దానిని అసాధారణంగా పరిగణించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అదృష్టవశాత్తు.. పిల్లలు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి తమంతట తామే దీని నుండి బయటకు వచ్చేస్తారు. తల కొట్టు కోవడం ద్వారా తమ పిల్లలు గాయపడుతూ ఉండి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే శిశు వైద్యులను సంప్రదించాలి.
మీ తల కొట్టుకునే పిల్లలతో మీరు ఎలా వ్యవహరిస్తున్నారో దయచేసి మాతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.
అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్పర్ట్ మరియు డెవలప్మెంటల్ పీడ్ ఉన్నారు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ చర్చలు
పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రశ్న

{{trans('web/app_labels.text_some_custom_error')}}
{{trans('web/app_labels.text_some_custom_error')}}