• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

పిల్లలకు విటమిన్ సి ఎందుకు అవసరం ? విటమిన్ సి లోపం యొక్క ప్రభావాలు మరియు సంకేతాలు..

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన May 13, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఆసక్తికరంగా, "ఎందుకు విటమిన్ సీ ఎందుకు అవసరం ?". ప్రతిరోజు ఒక గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చలువ చేస్తుంది అని మీ అమ్మ చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా ? ఏ వయస్సులోనైనా మీ బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు మరియు ఖనిజాలు ఎంతో అవసరం. ఇక్కడ, మీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు విటమిన్-సి ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మీకు తెలియజేస్తాము.

 

విటమిన్-సి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?

 

ఫన్ ఫ్యాక్ట్ : ఈ ముఖ్యమైన విటమిన్ కు  ప్రత్యేకమైన  రోజు ఒకటి ఉంది అని మీకు తెలుసా ? అవును, మీరు విన్నది నిజమే ! ప్రతి సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీ న విటమిన్ సి డే గా జరుపుకుంటారు.

 

విటమిన్ సి అంటే ఏమిటి ?

 

విటమిన్ సీ 'ఐ ఎల్ ఆస్కార్బిక్ 'అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరుగుతుంది .ఇది వివిధ రంగుల పండ్లు మరియు కూరగాయల లో ఉంటుంది .మరియు ఇది ఆహార పదార్థాల రూపంలో కూడా లభిస్తుంది .విటమిన్-సి శరీరంలో కృత్రిమంగా తయారు చేయబడదు. దీనిని ఆహారంగా గాని లేదా ఆహార పదార్థంగా గాని తీసుకోవాలి . ఇది శరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండదు . అందుకే దీనిని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది .అలా తీసుకోనట్లయితే మీ పిల్లలకు విటమిన్ సి లోపం ఏర్పడుతుంది.

 

పిల్లలకు మరియు పెద్దలకు విటమిన్-సి రోజువారి మోతాదు ఎందుకు అవసరం ?

 

పిల్లలలోని పరిపూర్ణ ఆరోగ్యాభివృద్ధికి విటమిన్ సి ముఖ్య పాత్ర వహిస్తుంది .మీ పిల్లల ఆహారంలో విటమిన్ సి తప్పనిసరి కావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి...

 

యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ : విటమిన్ సి  ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాల నుండి కణాలను రక్షిస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్ అనేవి సాధారణంగా శరీర ప్రక్రియ వలన లేదా పొగ కారణంగానూ ,అతినీలలోహిత కిరణాలు మరియు వాయు కాలుష్యం వలన కూడా ఉత్పత్తి అవుతాయి . విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది . ఇది జలుబు ,దగ్గు ను నివారించడానికి మరియు అంటువ్యాధులను రానివ్వకుండా పోరాడుతుంది . మరియు స్వస్థ పరుస్తుంది. కొల్లాజెన్, కండరాలు మరియు మృదులాస్థి ఏర్పడడానికి విటమిన్ సి అవసరం.  ఇది గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది . మరియు మీ పిల్లల దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది .విటమిన్-సి శరీరంలోనికి ఇనుమును తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. అది మీ చిన్నారికి చాలా అవసరం.

 

మీ చిన్నారికి విటమిన్-సి ఎంత మోతాదులో అవసరం ఉంటుంది ?

 

విటమిన్ సి ను మోతాదులో తీసుకోవాలో క్రింద సిఫార్సు చేయబడి ఉంది :

 

పిల్లల వయస్సు  -  విటమిన్-సి (మోతాదు (ఎం జి)) 0 - 6 నెలలు - 40 mg, 7 నుండి 12 నెలలు 50 ఎంజి, 1 నుండి 3 సంవత్సరాల వరకు 15 ఎం జి, 4 నుండి 8 సంవత్సరాల వరకు 25 ఎం.జి.

 

విటమిన్ సి యొక్క కొన్ని ముఖ్యమైన వనరులు ఏమిటి ?

 

మీ పిల్లలకు తగినంత విటమిన్ సి అందాలంటే రంగురంగుల కాయకూరలు మరియు పండ్లను ఇవ్వండి .విటమిన్-సి యొక్క కొన్ని గొప్ప వనరులు ఇక్కడ ఉన్నాయి.

 

స్ట్రాబెర్రీస్, పుల్లని పండ్లు (నారింజ ,ద్రాక్ష, నిమ్మ) కివి , జామ, క్యాప్సికం ,టమోటా, బ్రోకలీ ,ఆకుపచ్చ కాయగూరలు, పుచ్చకాయ ,కర్బూజ ,గూస్ బెర్రీ , క్యాలీఫ్లవర్ ,చెర్రీస్ మొదలైన వాటిలో  సీ విటమిన్ లభిస్తుంది.

 

సి విటమిన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

 

విటమిన్ సి లోపం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి ?

 

విటమిన్ సి లోపం వలన సాధారణంగా గమనించిన కొన్ని ప్రభావాలు మరియు భావనలు :

 

స్కర్వి : మీ పిల్లల శరీరంలో విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటే కొల్లాజెన్ ఏర్పడడం తగ్గిపోయి కణజాల విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి . ఇది చిగురుల మరియు గాయాల  రక్తస్రావానికి గురై చివరికి స్కెర్వి గా మారుతుంది . వీటిని త్వరగా నయం చేయ జాలము.

 

జలుబు మరియు చర్మ సమస్యలు : దీనికి ఎక్కువ రోజులు చికిత్స చేయకపోయినట్లయితే తరచుగా జలుబు, దగ్గు , జ్వరం మరియు మూర్ఛలకు దారి తీస్తాయి. ఇది చర్మ సమస్యలతో పాటుగా చిన్న చిన్న అవాంఛిత రోమాలు రావడానికి కూడా దారితీస్తుంది.

 

విటమిన్ సి లోపం యొక్క సంకేతాలను నేను ఎలా తెలుసుకోవాలి ?

 

తల్లిదండ్రులలో సాధారణంగా ఉండే ఆందోళన ఏమిటంటే తన బిడ్డకు విటమిన్ లోపం ఉందో లేదో ఎలా చెప్పగలరు. విటమిన్ సి లోపం యొక్క హెచ్చరిక సంకేతాలు ఏమిటో తెలుసా  ? ఇక్కడ చూడండి...

 

మీ పిల్లలు త్వరగా అలసిపోతారు. తరచుగా ఏదో ఒక నొప్పుల గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. చిగుళ్ళ వాపు మరియు రక్త స్రావం జరుగుతుందేమో గమనించండి. చర్మం బాగా పొడిబారిపోయి ఎర్రటి దద్దుర్లు మరియు నీలిరంగు గాయాలు కూడా ఏర్పడతాయి. మరియు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు.ఆ కారణంగా పిల్లలు తరచుగా జబ్బు పడుతూ ఉంటారు .బరువు తగ్గడం మొదలవుతుంది .చిగుళ్ళ నుండి రక్తస్రావం మరియు వాపుతో పాటు ముక్కులో నుండి త్వరగా రక్తస్రావం అవడం లాంటివి ఎదురవుతాయి.

 

ప్రతిరోజు మీ పిల్లలకు బత్తాయి జ్యూస్, స్ట్రాబెర్రీ లతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి. మీ పిల్లల రోగ నిరోధక వ్యవస్థ బాగా పని చేయాలంటే ఇటువంటి ఆహారాన్ని ఎల్లప్పుడూ ఇవ్వండి . అది పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. అలా చేసినట్లయితే ప్రతిరోజు ఒక విటమిన్-సి డే కావచ్చు.

 

విటమిన్-సి పై మా బ్లాగు మీకు ఉపయోగపడిందా ? మీ అభిప్రాయాలను మరియు సలహాలను కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి .మీ అభిప్రాయాలు వినడానికి మేము ఇష్టపడతాము. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}