• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ చిన్నారులకు ఐరన్ ఎంత ముఖ్యమైనది ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Jun 24, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మీకు చిన్న పిల్లలు ఉన్నట్లయితే, వారు ఎంత త్వరగా ఎదుగుతారో మీకే తెలుసు.

అందువల్ల వారు ఎదిగే సమయంలో వారి ఆహారపు అలవాట్ల పట్ల మీరు జాగ్రత్త వహించాలి .ఇది పరిపూర్ణమైన ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు దోహదం చేస్తుంది. పిల్లలు తినే ఆహారంలో అన్ని పోషకాల తో పాటుగా ఐరన్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .మెదడు పెరుగుదలకు మరియు పిల్లల పరిపూర్ణమైన పెరుగుదలలో కీలక పాత్ర వహిస్తుంది .మీ పిల్లల మానసిక వికాసానికి ఎల్లప్పుడు పిల్లలకు ఐరన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది .మరియు హిమోగ్లోబిన్ తయారు చేసేందుకు, ప్రోటీన్ ఉత్పత్తిని చేయడంలోనూ , శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరా చేయడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.

 

చిన్నారుల యొక్క సరైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఐరన్ ఎంత అవసరమో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు.1 నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య తప్పటడుగులు వేసే సమయంలో పిల్లలకు రోజుకి 6.9 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది .మీ పిల్లలకు అవసరమైన ఐరన్ లభించనట్లయితే వారిలో ఐరన్ లోపాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది . ఐరన్ స్థాయి తక్కువ అయినట్లయితే మీ పిల్లలలో అలసట వస్తుంది . మరియు పిల్లలు రక్తహీనతకు గురవుతుంటారు. పసి పిల్లలలో 50 శాతం మంది క్రమం తప్పకుండా తమ ఆహారంలో ఐరన్ను తీసుకోవడం లేదు అని సర్వేలు చెబుతున్నాయి .ఇందువల్ల మీరు మీ చిన్నారుల ఆహారం విషయం లో చిన్న వయస్సు నుండే శ్రద్ధ చూపడం ప్రారంభించాలి.

 

తల్లిపాలు తాగే పిల్లలకు , మొదటి ఆరు నెలల వరకు అవసరమైన ఐరన్ తల్లిపాల ద్వారానే లభిస్తుంది .పాలిచ్చే తల్లులలో రక్తహీనత ఉన్నట్లయితే పిల్లల ఐరన్ లెవల్స్ని పరీక్ష చేసుకోవలసి ఉంటుంది. ఫార్ములా పాల మీద ఆధారపడే పిల్లలకు ప్రత్యేకంగా ఐరన్ ఇవ్వవలసి ఉంటుంది .ఆరు నెలల తరువాత పిల్లలలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది .ఆ సమయంలోనే వాళ్లు  ఘన ఆహారానికి  కూడా అలవాటు పడతారు.

 

హీమ్ ఐరన్ మరియు నాన్ హీమ్ ఐరన్ :

 

హీమ్ మరియు నాన్ హీమ్ . మొక్కలలో నాన్ హీం వుంటుంది .మాంసము మరియు సీ ఫుడ్ లలో హీమ్ మరియు నాన్ హీమ్ రెండు ఉంటాయి.  నాన్ హీమ్ ఐరన్ను శరీరం సులభంగా గ్రహించదు. కాబట్టి మీ పిల్లలు శాఖాహారం తీసుకుంటూన్నట్లయితే రెట్టింపు శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది.

 

విటమిన్ సీ తో కలిపి ఉండే ఐరన్ ఆహారాలను తీసుకున్నట్లయితే శరీరం సులువుగా గ్రహిస్తుంది .అందుకే సి విటమిన్ అధికంగా ఉండే ఆహారాలతోపాటు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

 

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలకు ఉదాహరణలు:

 

నారింజ రసం

 

నారింజ

 

ద్రాక్ష పండ్లు

 

బ్రోకలీ

 

టమోట

 

స్ట్రాబెర్రీ

 

బొప్పాయి

 

క్యాప్సికం

 

చిలగడదుంపలు

 

కర్బూజ

 

మీ చిన్నారుల కోసం ఐరన్ కలిగి ఉండే ఆహారాలు :

 

లేత మాంసం :

 

మాంసము మరియు చికెన్ ల లో పుష్కలమైన ఐరన్ లభ్యమవుతుంది .మీ పిల్లలకు మృదువుగా బాగా ఉడికించిన మాంసమును ఇవ్వండి. లేదా గంజి లాగా చేసి ఇవ్వండి .మాంసం యొక్క క్రొవ్వులో చాలా తక్కువ ఐరన్ ఉంటుంది .మాంసము యొక్క కొవ్వును తొలగించి ఇవ్వండి. పాస్తా లాగా చేసి  టమోటో సాస్ తో ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

 

బలవర్థకమైన తృణధాన్యాలు :

 

ఓట్ మీల్ వంటి బలవర్ధకమైన మరియు చక్కెర తక్కువగా ఉంటే తృణధాన్యాలను మీ పిల్లలకు చాలా మంచిది . వారానికి రెండుసార్లు ఈ తృణధాన్యాన్ని మీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వండి.

 

బీన్స్ :

 

మీ పిల్లలు మాంసాన్ని ఇష్టపడనట్లయితే, బీన్స్ దానికి మంచి ప్రత్యామ్నాయము. సోయా బీన్స్ , లియాబీన్స్, కిడ్నీ బీన్స్ మరియు చిక్ పీస్ మరియు కాయధాన్యాలు. ఇవి ఇనుము తో సహా అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లతో నిండి ఉంటాయి. అర కప్పు వైట్ బీన్స్ లో 4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది .సగం కప్పు కాయ ధాన్యాలలో మూడు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వారానికి రెండు సార్లు కొన్ని వేపిన బీన్స్ ను చపాతీలతో కలిపి ఇవ్వండి.

 

పాలకూర :

 

పోపాయ్ ఎక్కువ పాలకూర తిన్న అందువలన బ్రూస్లీ తో పోరాడడానికి అవసరమైన  బలం లభించినదా? ఈ ఉదాహరణ మీ పిల్లలతో అద్భుతాలు చేస్తుంది .ఎందుకంటే వారికి అవసరమైన ఐరన్ పాలకూర లోనే లభిస్తుందని గుర్తుంచుకోండి . అరకప్పు పాలకూరలో మూడు మిల్లీ గ్రాములు ఇనుము ఉంటుంది. దీనితోపాటుగా బీన్స్ ,బ్రోకలీ మరియు ఇతర ఆకుపచ్చని కూరగాయలను ఇవ్వండి.

 

డ్రై ఫ్రూట్స్ :

 

డ్రై ఫ్రూట్స్ మీ చిన్నారులకు అవసరమైన ఐరన్ ను అందించడమే కాక ,మలబద్ధకం కూడా పోగొడతాయి .మీ పిల్లలకు  ఒక కప్పులో డ్రై ఫ్రూట్స్ ను అందుబాటులో ఉంచండి .వారికి అవసరం అయినప్పుడు స్నాక్స్ లాగా తింటారు .పావు కప్పు డ్రైఫ్రూట్స్ లో సుమారు ఒక మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది.

 

పీనట్ బట్టర్ మరియు జల్లి :

 

 ఇది మీ పిల్లలకు త్వరలో ఇష్టమైన ఆహారం అయిపోతుంది.మీరు మీ చిన్నారికి పీనట్ బటర్ తో శాండ్విచ్ చేసి ఇవ్వచ్చు .ఇది వారికి అవసరమైన ఇనుము ను ఇస్తుంది.

 

బంగాళా దుంప తొక్కలు :

 

బంగాళదుంప తొక్కలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది .మీరు మీ చిన్నారులకు ఫ్రెంచ్ఫ్రైస్ లేదా బంగాళదుంప కూర చేసేటప్పుడు తొక్క తీయకుండా చేయండి. బంగాళదుంప తొక్కలు దుంపల కంటే 5 రెట్లు ఎక్కువ ఇనుముని కలిగి ఉంటాయి .మరియు ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది.

 

ఐరన్ మాత్రలు :

 

పిల్లలు రక్తహీనత ఉంది అని డాక్టర్ భావించినట్లయితే ,రక్త పరీక్ష చేసిన తర్వాత ఐరన్ సప్లిమెంట్ ను ఇవ్వవచ్చు.మీరు మీ వైద్యుడి సూచనలను పాటించాలి .మరియు సప్లిమెంట్స్ ను పిల్లలకు దూరంగా ఉంచాలి. ఐరన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల మీ పిల్లలకు ఐరన్ సప్లిమెంట్ ను వైద్యుని సలహా మేరకు మాత్రమే ఇవ్వాలి .పైన పేర్కొన్న ఆహారాలను తీసుకున్నట్లయితే మీ పిల్లలకు అవసరమైన ఐరన్ లభిస్తుంది .మరియు ఆరోగ్యంగా ఉంటారని మీరు నమ్మకం గా ఉండవచ్చు.

 

ఈ బ్లాక్ మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఆలోచనలను మరియు సూచనలను మాతో పంచుకోండి .మేము మీ నుండి వినడానికి ఎంతో ఇష్టపడతాము.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}