• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్

మీ పిల్లలను ఎందుకు పోల్చకూడదు ?

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Aug 04, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఒక్కసారి తల్లిదండ్రులు అయ్యాక, మనం ఎప్పటికీ వారి తల్లిదండ్రులమే ! మనం మన పిల్లలను విపరీతంగా ప్రేమిస్తున్నందు వలన వారి కోసం ఆందోళన చెందు తాము , కోపపడతాము , కేకలు వేస్తాము , ఆకాశానికి ఎత్తేస్తాము మరియు ఏడుస్తాము. ఇతర పిల్లల లాగే మన పిల్లలు కూడా ఎన్నో మైలురాళ్లను దాటాలని , అభివృద్ధి చెందాలని మనము ఆశిస్తాము. ఇది చాలా సహజమైన కోరిక. మనము తరచుగా ఒకే వైపున ఆలోచించి అంచనాలను ఏర్పరచుకుంటాం. మన బిడ్డ వాటిని అందుకోలేనప్పుడు నిరాశ చెందుతాము.

 

బిడ్డకు ఆరు నెలల్లో దంతాలు రావడం ప్రారంభం కాలేదా ? పిల్లవాడు ఒక సంవత్సరం నాటికి నడవడం ప్రారంభించలేదా? రెండు సంవత్సరాలు వచ్చే సరికి చిన్న చిన్న పదాలను మాట్లాడటం ప్రారంభించలేదా? సాధారణంగా పిల్లలు నుండి మనము వీటిని ఆయా వయసులలో ఎదురు చూస్తాము. ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం ఉంటుంది అన్న విషయం మనం ఎప్పుడూ ఆలోచించడానికి ప్రయత్నించము. దీని వెనుక ఉన్న కారణాలు గురించి తెలుసుకోకుండా ఉండే మన నిరీక్షణ పిల్లలను గాయపరుస్తుంది.

 

సాధారణంగా ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. తల్లిదండ్రులు ప్రారంభంలో తమ పిల్లల అభివృద్ధి లక్షణాలను కనుగొన్నప్పుడు వారు దానిని తమ తెలివితేటలు జ్ఞానానికి ఫలితంగా భావిస్తారు. ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటారు, మరియు ప్రతి బిడ్డ యొక్క అభివృద్ధి కూడా భిన్నంగానే ఉంటుంది. పిల్లల యొక్క శారీరక మరియు సామాజిక సామర్ధ్యము ఒక పనిని సరిగ్గా చేయగల సామర్ధ్యము మరియు శ్రద్ధ స్థాయిలు కూడా ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి. అలాగే ప్రతి బిడ్డ అభివృద్ధి చెందే విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. పసిపిల్లలు అంటే ప్రకృతి మరియు పెంపకం యొక్క మిశ్రమం. ప్రకృతి అనేది పిల్లలకు అంతర్గత లక్షణాలను బహుమతిగా ఇస్తుంది. పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులు పోషించే పాత్ర. వారి అభివృద్ధికి సంబంధించిన మూడవ అంశం ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే  వారు పుట్టి పెరిగే వాతావరణం. పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాగా గ్రహించి అర్థం చేసుకోవడం అన్నది చాలా సహజంగా జరుగుతుంది. తాతయ్య నానమ్మల గారాబంలో పెరిగే పిల్లల కంటే కూడా కొన్ని సందర్భాలలో డేకేర్ లో పెరిగే పిల్లలు క్రమశిక్షణతో ఉండగలుగుతారు. అదేవిధంగా, ఏ ఇద్దరు పిల్లలు కూడా మూడు కచ్చితమైన పోలికలను కలిగి ఉండడం అసాధ్యం. అందువలన ప్రతి బిడ్డ ప్రత్యేకమైనదే.

 

మన పిల్లలను ఎందుకు పోల్చకూడదు ?

 

ఇలా వేరొకరితో పోల్చడం వలన మీ పిల్లలకు మీకు మధ్య తీవ్రమైన సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలను నిరంతరం ఇతరులతో పోల్చడం ద్వారా పిల్లల మీద ఎన్నో దుష్ప్రభావాలు పడి ఒత్తిడికి గురవుతారు. మరియు పిల్లలు అనుకున్నది సాధించలేక పోయినందువల్ల తల్లిదండ్రుల పట్ల వారి ప్రవర్తన మారిపోతుంది . మరియు పిల్లలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు మరియు ఎంతో ఒత్తిడికి గురవుతూ , ఎప్పుడు ఆందోళనకు లోనవుతూ ఉంటారు.

 

పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను 

అందుకున్నా మరియు అందుకోలేకపోయిన ఎల్లప్పుడూ తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లల మీద మన అంచనాలు అధికంగా ఉన్నందు వలన పిల్లలలో ఇటువంటి వివరించలేని ప్రవర్తనకు కారణం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలలో పిల్లలు తమను తాము ఆనందంగా ఉంచుకునే కంటే కూడా మన అంచనాలను అందుకునేలాగా చేయాలని ప్రయత్నిస్తారు.

ఇటువంటి అవాస్తవ సందర్భాలు ఎదురైనప్పుడు పిల్లలు వేరొకలాగా కూడా స్పందిస్తారు. అదేమిటంటే వారి బాధ్యతల నుండి తప్పుకోవడం మరియు చిరాకును ప్రదర్శించడం. ఇది వారిలోని నైపుణ్యాలను మరియు ప్రతిభను అణిచి వేస్తాయి. మీ బిడ్డ మీద నమ్మకం ఉంచండి మరియు ఓపిక పట్టండి.

 

అందువలన తల్లిదండ్రులగా మీ పిల్లల మైలురాళ్ళు సాధించడం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, వారికి ఉపయోగకరమైన వాటిని చేసే విషయంలో మీ దృష్టిని ఉంచండి.

 

1. మీ పిల్లలు కార్యాచరణను కొంత ప్రతిఘటించి నట్లయితే కొన్ని రోజులు మౌనంగా ఉండండి (మరియు పిల్లలకు కూడా విరామం ఇవ్వండి) మరియు కొంత కాలం తర్వాత మెల్లగా మీకు కావలసిన విధంగా పిల్లలను మార్చుకోండి.

 

2. పిల్లల విషయంలో ఉదారంగా ఉండండి. ఎప్పుడు ప్రశంసా పూర్వకంగా మరియు పిల్లలలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండండి.

 

3. ఆప్యాయత మరియు సహనంతో మీరు పిల్లల మీద తగినంత సమయాన్ని వెచ్చించి శ్రద్ధ చూపినట్లయితే మీరు అనుకున్న దాని కంటే కూడా అద్భుతమైన ఫలితాలను పొందగలరు.

 

మేము మీ అభిప్రాయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాము. 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Aug 06, 2020

థాంక్ బట్ నాకు ట్విన్స్ ఆడపిపిల్లలు ఒక పాపా baganeundi

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}