• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

శీతాకాలంలో పిల్లల కంటి చూపు మెరుగు పరచడానికి 7 ఆహారాలు మరియు పండ్లు.

Aparna Reddy
1 నుంచి 3 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Oct 22, 2020

 7
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

కాలానుగుణంగా దొరికే కాయగూరలు మరియు వంటల జాబితా విషయానికి వస్తే, శీతాకాలం ఉత్తమమైనది. కాలానుగుణంగా దొరికే శీతాకాలపు కాయగూరలు, పండ్లు మరియు ఇతర ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. అవి కళ్ళకు మంచివి మరియు మీ పిల్లల కంటి చూపు మెరుగు పడటానికి సహాయపడతాయి. ఈ సీతాకాలం ఆహారాలు పిల్లల కంటి చూపును బలోపేతం చేయడంలో సహాయపడటం మాత్రమే కాకుండా, పిల్లల కంటి చూపు బలహీనంగా ఉన్నట్లయితే ఈ ఆహారాలు పిల్లల కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. ఈ ఆహారాలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది దృశ్య ప్రక్రియను పెంచడంలో మంచి పని తీరును కలిగి ఉంటుంది. మసక వెలుతురులో మంచి దృష్టికై ఈ ఆహారాలు ఎంతో అవసరం.

 

కళ్ళ ఆరోగ్యానికి పుష్కలంగా విటమిన్ కలిగిన ఆహారం :

 

కాబట్టి, ఈ శీతాకాలంలో మీ పిల్లల ఆరోగ్యకరమైన చూపును మెరుగుపరచడానికి ఏమితినాలో జాబితాను చూడడానికి ఈక్రింద పరిశీలించండి. మీ పిల్లల కంటి చూపును మెరుగు పరిచే శీతాకాలపు ఆహారాల గురించి తెలుసుకోండి.

 

కంటి చూపుకి క్యారెట్లు ఎంతో మంచివి :

క్యారెట్లు కెరోటిన్ (ఒక రకమైన విటమిన్ ఏ) యొక్క అధిక వనరులలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. క్యారెట్లో పుష్కలంగా కనబడుతున్నందువలన దీనికి కెరోటిన్ అని పేరు పెట్టారు. పిల్లలకు 100 గ్రాముల బరువు గల క్యారెట్ ను ఇచ్చినట్లయితే , మీ పిల్లల రోజు వారి విటమిన్-ఏ అవసరాలకు సుమారుగా సరిపోతుంది. విటమిన్ ఏ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు రేచీకటి గల పిల్లలలో ఆ లోపాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.

 

క్యారెట్ హల్వా వంటి సంప్రదాయ వంటకాలను ఇవ్వడం వలన మీ పిల్లల కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వంటకాలతో పాటు గా సూప్లు, సలాడ్లు మరియు కూరగాయలు లోని క్యారెట్లు కంటి చూపు మెరుగు పడటానికి సులభమైన ఆహారాలు. ప్రత్యామ్నాయంగా క్యారెట్ కేకులు, మఫిన్, ఇడ్లీ, పాస్తా, శాండ్విచ్ వంటి రెసిపీలు మీ పిల్లల కంటి చూపు మెరుగు పరచడానికి ఉపయోగించవచ్చు.

 

కంటి చూపును బలోపేతం చేయడానికి ఆకుపచ్చ ఆకుకూరలు :

 

మెంతికూర,  ఆవకూర, పాలకూర మరియు వివిధ రకాలైన ఆకుకూరలు శీతాకాలంలో పుష్కలంగా కనిపిస్తాయి. పిల్లల కంటి చూపును బలోపేతం చేయడానికి ఇవి శీతాకాలపు ఆహారాలు. మీ పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆహారాలను ఇష్టపడకపోతే , ఈ ఆకుకూరలను మీ పిల్లల ఆహారంలో చేర్చడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. పాలకూర సూప్ మరియు బాతువా రైత వంటి వాటిని  ఇవ్వండి. అలాగే మేతి లేదా బాతువా వంటి ఆకుకూరలను సన్నగా తరిగి చపాతి పిండిలో కలిపి చపాతీల రూపంలో ఇవ్వండి. మరొక మార్గం ఏమిటంటే, మొదట వీటిని సూప్ లాగా తయారుచేయడం. లేదా పిల్లలు తినే కూరలలో గ్రేవీ రూపంలో కూడా తయారుచేసి ఇవ్వవచ్చు. ప్రతి రోజూ మీ పిల్లల ఆహారంలో 25 నుండి 50 గ్రాముల వరకు ఆకుకూరలను చేర్చడం వలన విటమిన్ ఏ అవసరం తీరుతుంది.సహాయకారిగా చదవండి : పిల్లలకు బచ్చలి కూర వల్ల కలిగే ప్రయోజనాలు.

 

ఆఫ్రికాట్ లు కంటి చూపును మెరుగు పరుస్తాయి:

 

పిల్లల కంటి చూపు మెరుగు పరచడంలో సహాయపడే కెరోటిన్లు పుష్కలంగా ఉన్న మరొక ఆహారం ఆఫ్రికాట్. దీనిని ఇతర పండ్లు లేదా కాయగూరలతో కలిపి తీసుకోవచ్చు. ఆఫ్రికాట్ లతో జామ్ కూడా తయారుచేసి  మీ పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు టోస్ట్, పాన్ కేక్, చపాతీలతో కూడా ఈ జామ్ను ఉపయోగించవచ్చు. ఆఫ్రికాట్ రిలీష్ కూడా తయారు చేయవచ్చు. దీనిని కట్లెట్స్, రోల్స్ మరియు శాండ్విచ్ లలో సాధారణ కెచప్ కు బదులుగా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా పిల్లలు తినడానికి ఆఫ్రికాట్ పండ్లను నేరుగా ఇవ్వవచ్చు. ఆఫ్రికాట్ లలో ముఖ్యంగా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. రెండు లేదా మూడు ఆఫ్రికాట్ ముక్కలు పిల్లలకు అవసరమైన 50 శాతం కంటే ఎక్కువ కెరోటిన్ అవసరాన్ని తీర్చగలవు.

సహాయకారిగా చదవండి : పిల్లల ఆహారంలో ఎందుకు మరియు ఎటువంటి డ్రైఫ్రూట్స్ను ఇవ్వాలి ?

 

బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది :

 

బొప్పాయి మరొక శీతాకాలపు పండు. ఇది బలహీనమైన కంటిచూపును మెరుగు పరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కెరోటిన్ యొక్క మంచి మూలం. ఈ పండును ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ పండును అలాగే తినవచ్చు లేదా తేనె మరియు బాదం తో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరమైనవి మరియు డెసర్ట్ గా కూడా పనిచేస్తాయి. సహాయకారిగా చదవండి: పసిబిడ్డలకు బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.

 

చేపలలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది :

 

చేపల కాలేయ నూనెలను సాధారణంగా విటమిన్-ఏ సప్లిమెంట్లు గా ఉపయోగిస్తారు. కంటిచూపు తక్కువగా ఉన్న వారిలో విటమిన్-ఏ లోపం కనిపిస్తుంది. పిల్లల కంటి చూపుకు కాడ్, హాలీబట్ మరియు షార్క్ వంటి చేపలు ఎంతో మంచివి. కాబట్టి, మీ కుటుంబంలో మాంసాహారం అలవాటు ఉన్నట్లయితే ఈ ఆహారం విటమిన్ ఏ యొక్క సరైన మూలం. మీ పిల్లలకు ఫ్రై చేసిన లేదా గ్రిల్ చేసిన చేపలను వారానికి రెండు లేదా మూడు సార్లు ఇవ్వండి.

 

క్రమం తప్పకుండా గుడ్లు :

 

గుడ్లలో విటమిన్  ఏ రెటినోల్ రూపంలో ఉంటుండి. దీనిని శరీరం నేరుగా గ్రహిస్తుంది. గుడ్లను ఆమ్లెట్ రూపంలోనూ లేదా ఉడకబెట్టి కూడా ఇవ్వవచ్చు. గుడ్డును గిలకొట్టి బ్రెడ్ లో ముంచి గ్రిల్ చేసి లేదా ఫ్రై చేసి ఇవ్వవచ్చు. గుడ్లను కస్టర్డ్ పౌడర్ మరియు పాలతో కలిపి డెజర్ట్ లాగా కూడా తయారుచేసి ఇవ్వవచ్చు. వీటిలో మీ పిల్లల రుచిని బట్టి తీపిని కూడా చేర్చి ఇవ్వవచ్చు. (ఆఫ్రికాట్, ఎండు ద్రాక్ష మరియు ఖర్జూరాలతో ) కూడా చేర్చి ఇవ్వవచ్చు.

 

కంటి చూపుని పెంచడానికి వెన్న మరియు నెయ్యి :

 

ఈ సాంప్రదాయ శీతాకాలపు ఆహారాలైన నెయ్యి మరియు వెన్న శాఖాహారులకు రొటీనోల్ యొక్క మంచి మూలం. మీ పిల్లల ఆహారంలో ఒక చెంచా లేదా రెండు చెంచాల నెయ్యి లేదా వెన్న కలిపినట్లయితే మీ పిల్లల కంటి చూపు బలోపేతం చేయడానికి మరొక మంచి మార్గం. మీరు ఇంట్లో కేకులు బిస్కెట్లు మరియు మఫిన్ లు బేక్ చేస్తూ ఉంటే విటమిన్ ఏ కంటెంట్ను పెంచడానికి నెయ్యి లేదా వెన్నతో భర్తీ చేయండి. సహాయకారిగా చదవండి: అసలు పిల్లలకు నెయ్యి ను ఎప్పుడు ఎలా ఇవ్వాలి?


క్యాప్సికం, చిలగడదుంపలు, పండిన టమాటాలు మరియు గ్రూస్ బెర్రీ వంటి ఆహారాలు ఏ విటమిన్ కు మరిన్ని ఉదాహరణలు. ఇవి మీ పిల్లల కంటి చూపు మెరుగు పరచడానికి ఉపయోగపడుతాయి.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}