• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
బిడ్డ సంరక్షణ

నవజాత శిశువులు మరియు చిన్న పిల్లలకు శీతాకాలం సంరక్షణ చిట్కాలు మరియు గృహ నివారణలు...

Aparna Reddy
0 నుంచి 1 సంవత్సరాలు

Aparna Reddy సృష్టికర్త
నవీకరించబడిన Nov 02, 2020

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

శీతాకాలంలో చలి మరియు పొడి వాతావరణం కారణంగా మీ శిశువుల యొక్క చర్మ సంరక్షణ ఎంతో ముఖ్యమైనది. శీతాకాలం యొక్క ప్రభావం పిల్లల చర్మం పై ఎంతో ఉంటుంది. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు, కఠినమైన గాలులు మరియు తక్కువతేమ కారణంగా చర్మం మామూలు కంటే పొడిగా ఉంటుంది. పిల్లలు సున్నితమైన చర్మం కలిగి ఉంటారు. మరియు శీతాకాలంలో పొడి వాతావరణం వారి సున్నితమైన చేతులు, ముఖము మరియు పెదవులపై ప్రభావాన్ని చూపిస్తుంది. తేలికైన మరియు ఇంట్లో తయారుచేసిన నివారణలు సురక్షితంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలంలో మీ పిల్లల చర్మం యొక్క సున్నితత్వాన్ని కాపాడడానికి సహాయపడతాయి.

 

మీ పిల్లల చర్మం తేమగా ఉండటానికి సహజమైన గృహ నివారణలు :

 

మాయిశ్చరైజింగ్ లోషన్లు, క్రీములు, జెల్ , బామ్ల నుండి చిన్నారి చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి మార్కెట్లో ఎన్నో రకాల ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, మీ శిశువు చర్మం లోపలి నుండి తేమగా ఉండడం చాలా అవసరం. అది సరైన ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది.

 

నవజాత శిశువులకు శీతాకాల చర్మ సంరక్షణ చిట్కాలు :

 

శిశువులకు సీతాకాలంలో అదనపు సంరక్షణ అవసరం. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితమైనది మరియు ఎంతో మృదువైనది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే సామర్థ్యం ఆ లేత వయస్సులో శిశువులకు ఉండదు. అందుకే మనము వారి విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంటి లోపలి ఉష్ణోగ్రతలను నియంత్రించడం మంచిది. నవజాత శిశువుల శీతాకాలపు చర్మ సంరక్షణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. లోపలినుండి సహజమైన తేమ కోసం ఈ చిట్కాలను అనుసరించండి.

 

1. హైడ్రేట్ గా ఉంచడం : మీ పిల్లవాడిని బాగా హైడ్రేట్ గా ఉంచండి. ఎక్కువ నీరు త్రాగడానికి ప్రోత్సహించండి.

 

* పెదవులు, ముక్కు మరియు నోరు పొడిబారడానికి డీహైడ్రేషన్ ఒక కారణం. మీ పిల్లలు రోజంతా వెచ్చని ద్రవాలు త్రాగడం ఒక అలవాటుగా చేయండి.

 

* టమాటా సూప్, పాలకూర సూప్, కూరగాయల సూప్ మొదలైన అన్ని రకాల వేడి సూప్లతో వారిని సంతోషంగా ఉంచండి.

 

* మెత్తని పండ్లు మరియు కూరగాయలను వారి ఆహారంలో చేర్చండి.

 

2. ఆరోగ్యకరమైన నూనెల ఎంపిక : ఆరోగ్యానికి అవసరమైన మరియు చర్మానికి మృదుత్వాన్ని అందించడానికి మీ వంటల్లో ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను వాడండి. ఆవగింజల నూనె లేదా కాడ్ లివర్ ఆయిల్ లు చర్మాన్ని లోపల నుండి ప్రేరేపించడానికి సహాయపడతాయి.

 

3. ఆహారం : పిల్లల ఆహారంలో నానబెట్టిన బాదం, వాల్నట్ మరియు అవిసగింజల వంటి గింజలను వారి ఆహారంలో చేర్చండి.

 

* భోజనాలు మధ్యలో డ్రై ఫ్రూట్స్ సరైన స్నాక్ లా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీటిలో ఆరోగ్యకరమైన ఒమేగా త్రీ కొవ్వులు మరియు ఫైబర్ ఉంటాయి.

 

* లోపలినుండి తేమ సమతుల్యతను కాపాడుకోవడానికి మీ పిల్లలకి తాజా జున్ను, కాటేజ్ చీజ్ మరియు నెయ్యి వంటి పాల ఉత్పత్తులు మరియు పాలను ఇవ్వాలని నిర్ధారించుకోండి.

 

1. నీటి ఉష్ణోగ్రత : స్నానానికి ఎక్కువ వేడి నీటిని వాడకండి. వేడినీరు మీ పిల్లల చర్మాన్ని రక్షించే నూనెలను గ్రహించడానికి అవరోధంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిని వాడండి. ఇది మీ పిల్లల చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. మీరు షవర్ లేదా స్నానం చేయించే సమయాన్ని కూడా తగ్గించండి.

 

2. మసాజ్ : స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది.

 

* మీరు సాంప్రదాయ ఆవనూనె లేదా సాకే నూనెలను, కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె లేదా బాడీ మసాజ్ కోసమే ఉద్దేశించిన హెర్బల్ ఆయిల్ కూడా శీతాకాలంలో మసాజ్ కోసం వాడవచ్చు.

 

* చర్మ రంధ్రాలను అడ్డుకొని నూనెలను ఎంచుకోకపోవడం మంచిది.

 

* వీలైతే, మీ బిడ్డ స్నానానికి ముందు 15 నుండి 30 నిమిషాల పాటు నూనెను చర్మంపై ఉంచండి . తద్వారా చర్మం ఆ నూనెను బాగా గ్రహిస్తుంది.

 

* మీకు ప్రతిరోజు చేయడానికి అవకాశం లేకపోతే కనీసం వారాంతాల్లో వీటిని పాటించండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నిరోధక శక్తిని పెంపొందించడానికి మసాజ్  ఎంతో మంచిది.

 

3. తేలికపాటి సబ్బులను వాడండి : శీతాకాలంలో తేలికపాటి సబ్బులు వాడటం మంచిది.

 

* సహజ నూనెలు మరియు గ్లిజరిన్ ఆధారంగా ఉండే సబ్బులు ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో మంచిది.

 

* మీ బిడ్డ సహకరిస్తూ ఉంటే , ఇంట్లో తయారుచేసిన మూలికలపొడి,శెనగపిండిలో పాలు లేదా మీగడ కలిపి స్నానం చేయించండి.

 

4 మాయిశ్చరైజర్లు : స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ రాయడం వలన చర్మం సమర్ధవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. చలికాలంలో నీటి ఆధారిత మాయిశ్చరైజర్లు కంటే చమురు ఆధారిత మాయిశ్చరైజర్లు మంచివి.

 

* శీతాకాలంలో పెదవులు పగలడం అన్నది సాధారణం. అవి పిల్లలను ఎంతో బాధిస్తాయి.

 

* పెదవులను తరచుగా కొరకకుండా మరియు పెదవుల పైభాగాన్ని నమలకుండా ఉండాలి అని పిల్లలకు సలహా ఇవ్వండి.

 

* లిప్ బామ్ ను పిల్లలకు అందుబాటులో ఉంచండి. పిల్లల పెదవులకు నెయ్యి రాసి సున్నితంగా మసాజ్ చేసి రాత్రిపూట వదిలేయడం వంటి సహజమైన నివారణలు కూడా ఉపయోగపడతాయి. తేనె, కలబంద జెల్, పాలమీగడ శీతాకాలంలో పగిలిన పెదవులకు సహజమైన ఔషధాలుగా పనిచేస్తాయి.

 

* శీతాకాలపు ఎండ నుండి పిల్లలను కాపాడడానికి సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించండి.

 

5. బట్టలు :

నూలు వస్త్రాలు గాలి పీల్చుకోవడానికి బాగా వీలు కలిగిస్తాయి. మరియు ఇది ఉన్ని బట్టల వలన కలిగే ఘర్షణ ఫలితంగా చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.

 

6. నిద్రవేళ సంరక్షణ :

మీ పిల్లలు హాయిగా నిద్ర పోవడానికి వారి పడకలను వెచ్చగా ఉంచండి. చేతులు మరియు కాళ్ళకు సున్నితమైన మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసి మడమలను సాక్స్ వేయటం ద్వారా రాత్రంతా తేమగా ఉండటానికి సహాయపడుతుంది. నిద్రకు ముందు మీరు కథ చెప్పే సమయంలో పిల్లలను గట్టిగా కౌగిలించుకోండి.

 

1. తరచుగా చేసే స్నానాలను తగ్గించండి :

శీతాకాలంలో శిశువులకు రోజువారీ స్నానం అవసరం లేదు. స్నానానికి ప్రత్యామ్నాయంగా స్పాంజితో ఒళ్ళు తుడవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

 

2. మసాజ్ :

రోజువారీ ఆయిల్ మసాజ్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

 

3 సబ్బులు :

మీ శిశువు చర్మం ఎంత సున్నితమైనదో పరిగణలోనికి తీసుకుని పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి సభ్యులను వాడండి.

 

4. లోషన్ :

శీతాకాలంలో బేబీ పౌడర్ కంటే కూడా బేబీ లోషన్లు మంచిగా పనిచేస్తాయి. బేబీ పౌడర్ లకు బదులుగా క్రీములను మరియు లోషన్లను ఉపయోగించవచ్చు.  క్రీములు ఘర్షణ మరియు అసౌకర్యాల నుంచి చర్మాన్ని రక్షించడానికి రక్షణ పొరను ఏర్పరుస్తాయి.

 

5. పెదవులు పగలడం నుండి రక్షించండి :

శీతాకాలంలో చలి కారణంగా పిల్లల పెదవులు పగిలి పుండుగా మారి బాధాకరంగా తయారవుతాయి. పెదాలు పగలడం నుండి రక్షించడానికి నాణ్యతగల లిప్ కేర్ జెల్లిని రాయండి. ప్రతి రెండు మూడు గంటలకి ఒకసారి పిల్లల కోసం తయారు చేసిన జెల్లిని రాస్తూ ఉండండి.

 

6. హైడ్రేట్ గా ఉంచండి :

మీ బిడ్డను అంతర్గతంగా హైడ్రేట్ చేయండి. మీ శిశువు వయస్సును బట్టి అతనికి క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వండి. లేదా ప్రతిరోజు తగిన మోతాదులో నీరు ఇవ్వండి. తల్లిపాలు మీ బిడ్డకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఆరు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పప్పు నీరు మరియు ఇంట్లో తయారు చేసిన సూప్ లను కూడా ఇవ్వవచ్చు.

 

7. వస్త్రాలు : మీ పిల్లల చర్మానికి గాలి పీల్చుకునే సహజమైన బట్టలు మంచివి.

 

* ఉన్ని తో తయారు చేసిన బట్టలను నేరుగా శరీరానికి తగలకుండా ఉండేలా చూసుకోండి.

 

* మీ చిన్నారికి సన్నని పొరలతో ఉన్న డ్రెస్సులను వేయడం మంచిది. చల్లగా లేదా వెచ్చగా ఉన్న సమయంలో మీరు అవసరం అయినప్పుడు ఒక పొరను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.

 

* ఉన్ని టోపీలు, సాక్స్, మిట్టన్స్, దుప్పట్లు మరియు బూటీను అందుబాటులో ఉంచుకోండి.

 

శీతాకాలంలో మీ పిల్లలకు చర్మ సంరక్షణ నియమాలు..


శీతాకాలం వచ్చేసింది... ఈ సీతాకాలం మీ పిల్లలు మరియు మీ కుటుంబం ఆనందించడానికి పూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ పరిశుభ్రత మరియు  చర్మ సంరక్షణ విషయంలో కొన్ని సున్నితమైన జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ సీతాకాలం ఆహ్లాదకరంగా ఉండటానికి సహాయపడుతుంది. మీ శిశువుల చర్మం ఎంతో సున్నితమైనది . శీతాకాలంలో మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి అదనపు జాగ్రత్తలు అవసరం.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన బిడ్డ సంరక్షణ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}