• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2022: రక్తదానం గురించిన 9 అపోహలపై నిపుణుల వివరణ

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jun 14, 2022

 2022 9

ప్రతి సంవత్సరం జూన్ 14న, ప్రపంచ రక్తదాతల దినోత్సవం (WBDD) జరుపుకుంటారు.  సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తులు దానం చేయడం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం.. ఇంకా  స్వచ్ఛంద రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం రక్త  దాతల దినోత్సవ నినాదం “రక్తం దానం చేయడం సంఘీభావ చర్య”.

 రక్తదానం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందా? నేను రక్తం ఇస్తే, ఇన్ఫెక్షన్ వస్తుందా? నేను మందులు వాడుతున్నాను, కాబట్టి నేను రక్తం ఇవ్వలేనా? మధుమేహం లేదా అధిక బీపీ రోగులు రక్తదాతలు కాగలరా?రక్తదానం గురించిన ఈ విధమైన  అపార్థాలు దాతలను భయాందోళనలకు గురిచేస్తాయి.  నేడుప్రపంచ రక్తదాతల దినోత్సవం 2022 సందర్భంగా వైద్య నిపుణుల నుంచి ఈ సందేహాలకు  సమాధానం తెలుసుకుందాం.. ఇంకా ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని గురించి కల్పితాలు, అపోహలను దూరం చేసుకుందాం. 
 

  1. అపోహ: నా శరీరంలో రక్తం లేకుండా పోతుంది.

వాస్తవం: మీ శరీరం నుండి తీసుకోబడిన అత్యధిక  రక్తం మొత్తం 400 mL (సగం లీటరు కన్నా తక్కువ ), ఇది మీరు కలిగి ఉన్న దానిలో పదో వంతు. దానం చేసేటప్పుడు మీరు కోల్పోయిన ద్రవం మీ శరీరం ద్వారా భర్తీ చేయబడుతుంది. ఇంకా, మీరు రక్తదానం  తర్వాత మిమ్మల్ని మీరు సరిగ్గా హైడ్రేట్ చేసుకుంటే, మీ శరీరం కోల్పోయిన రక్తాన్ని కొన్ని గంటల్లోగానే  తిరిగి పొందుతుంది!

2.అపోహ: మందులు తీసుకుంటున్న వ్యక్తి దానం చేయకూడదు.

వాస్తవం: ఇది అర్ధ సత్యం. కొన్ని మందులు వాడుతున్న వారికి రక్తదానం సిఫారసు చేయబడలేదు. అయితే చాలా సందర్భాలలో, మందులు వాడటం  ఎవరైనా రక్తదానానికి ఆటంకం కాదు. ఐతే, ఒక వ్యక్తి రక్తదానం చేసే ముందు, వారు వాడుతున్న మందులు దానం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయో లేదో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి.

3. అపోహ: స్త్రీలు రక్తదానం చేయకూడదు.

వాస్తవం: మహిళలు చక్కగా  రక్తదానం చేయగలరు. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిని కలిగి ఉన్నప్పుడు లేదా రక్తహీనతతో ఉన్నప్పుడు మాత్రమే వారు అలా చేయరాదు. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఒక దాత రక్తం ఇవ్వడానికి డెసిలీటర్‌కు 12.5 గ్రాముల హిమోగ్లోబిన్ (లీటరుకు 125 గ్రాములు) ఉండాలి. దాని కంటే తక్కువ ఉంటె, అనర్హమైనదిగా పరిగణించబడుతుంది.

4. అపోహ:  డయాబెటిస్ (షుగర్) ఉన్నట్లయితే, మీరు రక్తదానానికి అనర్హులు!

వాస్తవం: మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ తీసుకుంటే మాత్రమే మీరు రక్తదానం చేయకూడదు. జీవనశైలి మార్పులు మరియు నోటి మందుల సహాయంతో మీ రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటే మీరు నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.

5. అపోహ: హై బీపీ ఉన్నవారు రక్తదాతలు కాలేరు!

వాస్తవం: 140 mm సిస్టోలిక్ మరియు 90 mm డయాస్టొలిక్ మధ్య రక్తపోటు ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. యాంటీహైపెర్టెన్సివ్ మందులు వాడటం అనేది, రక్తదానానికి అనర్హత కాదు.

6. అపోహ: నా బ్లడ్ గ్రూప్ అరుదైనది కాదు, నేను రక్త దానం చేయడం నిజంగా అవసరమా?

వాస్తవం: నిల్వ ఉండే లక్షణం తక్కువ కావడం వల్ల, రక్తం యొక్క తగినంత నిల్వ మరియు సరఫరాను నిర్వహించడం ఒక నిరంతర సవాలు. చాలా మంది రోగులకు నిర్దిష్ట రకం రక్తం అవసరమవుతుంది.  కొన్ని సమయాల్లో,అరుదైనది కానప్పటికీ,  బ్లడ్ బాంకులు ఆ  రక్త వర్గానికి తగినంత సరఫరాలను కలిగి ఉండక పోవచ్చు.  అటువంటి సందర్భాల్లో మీ రక్తదానం బాధితుల ప్రాణాలు కాపాడుతుంది. 

7. అపోహ: రక్తం ఇవ్వడం ఎక్కువ సమయం తీసుకుంటుందా?

వాస్తవం: రక్తదానం మూడు దశల్లో జరుగుతుంది: దాత నమోదు, వైద్య పరీక్ష మరియు స్క్రీనింగ్ మరియు రక్త సేకరణ లేదా ఫ్లేబోటమీ. ఈ  మొత్తం ప్రక్రియకు  సుమారుగా ఒక గంట పడుతుంది.  కానీ రక్తదానం యొక్క వాస్తవ ప్రక్రియ 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.

8. అపోహ: రక్తదానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

వాస్తవం: మీరు రక్తదానం చేసిన వెంటనే, మీ శరీరం కోల్పోయిన రక్తాన్ని తిరిగి నింపడం ప్రారంభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ లోని తెల్ల రక్త కణాలు సాధారణ స్థాయికి తిరిగి రావడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. అయినప్పటికీ, శరీరం ముప్పును గుర్తిస్తే, వీటిని వేగంగా సృష్టించగలదు. ఒక సాధారణ, ఆరోగ్యవంతమైన మానవుని రోగనిరోధక వ్యవస్థ,  రక్తదానం వల్ల ఎప్పుడూ దెబ్బతినదు..

9. అపోహ: నేను రక్తం ఇస్తే, నాకు ఇన్ఫెక్షన్ రావచ్చు.

వాస్తవం: మీ రక్తాన్ని తీయడానికి సూదిని ఉంచే ముందు, మీ చేతిని శుభ్రమైన పద్ధతిలో సిద్ధం చేస్తే, రక్తం తీసే . 'డ్రా సైట్‌’లోని ఇన్‌ఫెక్షన్లు వాస్తవంగా సోకవు. అన్ని సూదులు కొత్తవి, స్టెరైల్ మరియు ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడినందున రక్తసంబంధమైన అనారోగ్యం సంక్రమించే ప్రమాదం లేదు.

మరిన్ని వివరాలు తెలుసుకోడానికి, తెలియ చేయడానికి.. కింద కామెంట్ సెక్షన్ లో వ్యాఖ్యానించండి. 

https://www.hindustantimes.com/lifestyle/health/world-blood-donor-day-2022-doctors-bust-common-myths-around-blood-donation-101655173389131-amp.html

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}