• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వేడుకలు మరియు పండుగలు

ప్రపంచ పాల దినోత్సవం 2022: ఈ 5 మిల్క్ షేక్ లతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్య౦!

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన May 31, 2022

 2022 5

అనాదిగా మన భారతదేశంలో పాలు భోజనంలో ముఖ్యమైన అంతర్భాగం. మీరు దానిని పానీయంగా అలాగే  తీసుకున్నా లేదా కాఫీ లేదా ఇతర రుచులతో కలిపి రుచి చూసినా - పాలను అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు.  మనం  ఖీర్, పాయసం మొదలైన అనేక పిండివంటలను వండడానికి కూడా పాలను ఉపయోగిస్తాము. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉన్నందున పోషకాహార నిపుణులు కూడా పాలను సంపూర్ణ ఆహారం అని అంగీకరిస్తారు. పాల యొక్క ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యతను గుర్తించడానికి ఇంకా  ప్రపంచ పాడి పరిశ్రమకు గుర్తింపుగా  ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం  పాటిస్తున్నారు.

 ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనిని 2001లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రారంభించింది. 2022లో, ప్రపంచ పాల దినోత్సవం ఈ  బుధవారం వస్తుంది.

ప్రపంచ పాల దినోత్సవం 2022 థీమ్ 

2022లో, ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్- “వాతావరణ మార్పుల సంక్షోభం  మరియు భూమి మీద దాని ప్రభావాన్ని పాడి పరిశ్రమ ఎలా తగ్గించగలదో అనే విషయం మీద మీద అవగాహన”. రాబోయే 30 ఏళ్లలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెయిరీ నెట్ జీరో' సాధించడం మరియు డెయిరీ రంగాన్ని సుస్థిరంగా మార్చేందుకు వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం దీని లక్ష్యం.

వరల్డ్  మిల్క్ డే 2022ని 5 రుచికరమైన మిల్క్‌షేక్ లతో సెలబ్రేట్ చేసుకోండి

మనం  పాలను రకరకాల వంటకాల్లో  భాగంగా చేసి ఆస్వాదిస్తాము. మరి మిల్క్‌షేక్ అనేది మనం ఎక్కువగా ఇష్టపడే పదార్ధాలలో ఒకటి. చక్కటి నురుగుతో ఇంకా  రుచికరమైన పాల  కలయిక అయిన   మిల్క్ షేక్ అనేక రకాల రుచుల శ్రేణి లో లభిస్తుంది. 2022 ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మీరు చేయగలిగే కొన్ని రుచికరమైన మిల్క్‌షేక్‌లను 

మేము మీ కోసం సమర్పిస్తున్నాము.  ప్రపంచ పాల దినోత్సవం 2022 ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఐదు మిల్క్ షేక్ లు ఉన్నాయి. 

  1. బాదం, కుంకుమపువ్వు మిల్క్ షేక్: నట్స్ తో కూడిన ఇంకా  రిఫ్రెష్ చేసే ఈ బాదం- కుంకుమపువ్వు మిల్క్ షేక్ రాజరిక రుచిని పరిచయం చేస్తుంది. మీరు బాదం పాలు లేదా సోయా మిల్క్‌తో కూడా ఈ మిల్క్‌షేక్‌ను తయారు చేసుకోవచ్చు

  2.  ఖర్జూరం మిల్క్‌షేక్: ఖర్జూరంలోని ఊరించే ఫ్లేవర్‌లు మిల్క్‌షేక్‌లో చాలా బాగా జతకలుస్తాయని మీకు తెలుసా?  ఈ మృదువైన మరియు క్రీముతో కూడిన మిల్క్‌షేక్ రెసిపీ ప్రపంచ పాల దినోత్సవం 2022 కోసం ప్రత్యేకం.

  3.  స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్: దీనిని ఒకసారి రుచిచూసిన వారు తాగకుండా ఉండలేరు. స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్- బెర్రీలు మరియు పాల సుగుణాలతో కూడిన దీనిని ఎంచుకోవడంలో మీరు తప్పు చేయరని మాకు తెలుసు. మరింత సమ్మర్ రిఫ్రెషింగ్  ట్రీట్ గా చేయడం కోసం, దీనిని వెనిల్లా ఐస్ క్రీంతో టాప్ అప్ చేయండి!

  4.  స్పైసి బనానా మిల్క్‌షేక్:  సాధారణ బనానా  మిల్క్‌షేక్‌ మీరందరికీ తెలిసే ఉంటుంది. అసలు అది తగని వారు ఎవరూ ఉండరేమో. మరి మీరు ఈ మసాలా-ఇన్ఫ్యూజ్డ్ వెర్షన్‌ను ఎపుడైనా ట్రై చేసారా? ఐతే,  ప్రపంచ పాల దినోత్సవం 2022 జరుపుకోవడానికి ఇదే అతి చక్కనైన మార్గం!

  5. చాక్లెట్ హాజెల్ నట్ మిల్క్ షేక్: చాక్లెట్ ప్రియులారా, ఈ రెసిపీ మీ కోసమే. చాక్లెట్ మరియు హాజెల్ నట్ యొక్క మంచితనం, భలే రుచి దీనిలో మిళితమై ఉంది - ఈ రోజు ఈ అద్భుతమైన చాక్లెట్ హాజెల్ నట్ మిల్క్ షేక్ ని ట్రైచేయండి.  

ప్రపంచ పాల దినోత్సవ శుభాకాంక్షలు 2022!

 

ఈ  బ్లాగ్ మీరు నచ్చిందా? పాలతో చేసే మరిన్ని పానీయాలు, కొత్తకొత్త వంటలు మీకు తెలుసా? ఇంకెందుకాలస్యం.. కింది కామెట్ సెక్షన్లో అవన్నీ మాతో, మరింత మంది తోటి పేరెంట్స్ తో పంచుకోండి మరి!

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}