• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లల మలమూత్రాల విషయంలో తెలుసుకోవలసిన 10 విషయాలు..

 Kalpana
0 నుంచి 1 సంవత్సరాలు

Kalpana సృష్టికర్త
నవీకరించబడిన Sep 02, 2020

 10
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

మొదటిసారిగా తల్లిదండ్రులైన వారు తమ శిశువు యొక్క మొదటి మల, మూత్ర విసర్జన విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. మరియు డాక్టర్ను ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. కొన్నిసార్లు వారి ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరుకుతాయి. మరికొన్నిసార్లు దొరకవు .మొదటిసారిగా తల్లిదండ్రులు అయిన వారు తమ నవజాతశిశువుల మల, మూత్ర విసర్జన గురించి ఆత్రుత పడుతూ ఉంటారు. ప్రముఖ శిశు వైద్య నిపుణులు డాక్టర్ సుదీప్ వర్మ గారు మీ శిశువు యొక్క మలమూత్ర విసర్జన గురించి మీరు తెలుసుకోదగిన ఈ 10 వాస్తవాలను మీ ముందు ఉంచి మీ చింతలన్నిటికీ ముగింపుని ఇస్తున్నారు.

 

1. మొదటిసారిగా మలవిసర్జన ఎప్పుడు జరుగుతుంది :

 

బిడ్డ పుట్టిన తరువాత 24 గంటలు మల విసర్జన కొరకు, 48 గంటలు మూత్రవిసర్జన కొరకు ఎదురు చూడవలసి ఉంటుంది. మీ శిశువు ఈ సమయం లోపల మల, మూత్ర విసర్జనలు చేయకపోయినట్లయితే మీరు వెంటనే శిశువుల డాక్టర్ను సంప్రదించాలి.

 

2. మేకోనియం లేదా శిశువు యొక్క మొదటి మలవిసర్జన :

 

మొదటి రెండు నుండి మూడు రోజులపాటు మలవిసర్జన నల్లగా ఉంటుంది. దీనిని మేకోనియం అని పిలుస్తారు .కానీ, మలం నల్లగా అవుతుంది అని చింతించాల్సిన అవసరం లేదు. క్రమంగా అది గోధుమ రంగులోనికి మారి, ఆ తర్వాత పసుపు రంగులోకి మారిపోతుంది.

 

3. మీ శిశువు యొక్క మొదటి మూత్రం :

 

శిశువు యొక్క మొదటి మూత్రంలో యురేన్ అని పదార్థం ఎక్కువగా ఉన్న కారణంగా మొదటి రెండు మూడు రోజులు కొంచెం నారింజరంగు ఉన్నట్లుగా డైపర్ లో మనకు కనిపిస్తుంది. 

 

4. మూత్ర విసర్జన సమయంలో ఏడవడం :

 

మీ శిశువు మూత్రవిసర్జన లేదా మలవిసర్జన సమయంలో తరచుగా ఏడవడం మీరు చూస్తారు . దీనికి కారణం బలహీనమైన మూత్రాశయం మరియు బలహీనంగా ఉండే కండరాలు . కానీ ,కొంత సమయం తర్వాత అవి బలపడతాయి . కాబట్టి దిగులు చెందవలసిన అవసరం లేదు. బిడ్డ దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి.

 

5. మూత్ర విసర్జన సమయంలో తరచుగా ఏడుస్తూ ఉండటం :

 

శిశువు మూత్ర విసర్జన చేసే ప్రతిసారి ఏడుస్తూ ఉండటం మరియు విసర్జన చేసిన తర్వాత కూడా ఏడుస్తూ ఉన్నట్లయితే ,వెంటనే శిశు వైద్యుని సంప్రదించండి .యూరినరీ ట్రాక్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దానిని వారు పరిష్కరిస్తారు.

 

6. మూత్రం లేత గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో ఉండడం :

 

ఎరుపు రంగులో ఉన్న మూత్రం లేదా మలం ఎప్పుడూ రోగ లక్షణంగా ఉంటుంది . అంటే, కొంత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు . అలా ఉన్నట్లయితే మీ డాక్టర్ను సంప్రదించండి.

 

7. మల విసర్జన రోజుకి ఎన్ని సార్లు జరుగుతుంది :

 

బిడ్డ హుషారుగా ఉండి , మీ పాలు శుభ్రంగా తాగుతూ ఉన్నప్పుడు రోజుకి 10 నుండి 12 సార్లు కూడా మలవిసర్జన చేస్తుంది . కానీ, వారానికి ఒక్కసారి మలవిసర్జన చేసినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు . ఎందుకంటే,  తల్లిపాలు తాగే పిల్లలకు ఇది చాలా సాధారణం.

 

8. ముదురు బూడిద రంగు మలం :

 

ముదురు రంగు మరియు బూడిదరంగు మలం ఎల్లప్పుడూ రోగ లక్షణం గా ఉంటుంది. అందుకే , వెంటనే మీరు డాక్టర్ ను సంప్రదించాలి.

 

9. తల్లిపాలు తాగే పిల్లలు ఆకుపచ్చరంగులో మల విసర్జన చేయడం :

 

తల్లిపాలు తాగే పిల్లలు ఆకుపచ్చరంగులో మలవిసర్జన చేయడం చాలా సాధారణం. ఇది ముఖ్యంగా మొదటి పాలు తాగినందువల్ల వస్తుంది. అందువలన శిశువుకు తల్లి పాలను రెండు వైపులా మార్చి మార్చి ఇచ్చినట్లయితే ముందు పాలు ,మధ్య రకమైన పాలు మరియు (హిండ్ మిల్క్ ) చిక్కని పాలు కూడా లభిస్తాయి.

 

10. శిశువు ఏడుస్తున్న సమయంలో మల విసర్జన చేయటం :

 

కొన్నిసార్లు శిశువు ఏడుస్తూ ఉన్న సమయంలో కొంచెం కొంచెం మలవిసర్జన జరుగుతుంది .శిశువు హుషారుగా ఉండి, మామూలుగా పాలు తాగుతున్నట్టు అయితే భయపడవలసిన అవసరం లేదు .కానీ బిడ్డ పాలు తాగకుండా, ఉషారుగా లేదు అని మీరు భావిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.


ఈ బ్లాగు మీకు నచ్చిందా? దయచేసి ఈ వ్యాఖ్యల పై భాగంలో మీ అభిప్రాయాలను, ఆందోళనలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి మేము ఎంతో ఇష్టపడతాము.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}