• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ ఆరోగ్యం మరియు వెల్నెస్

మీ పిల్లల ముక్కు Covid తో చక్కగా పోరాడగలదు

Ch Swarnalatha
3 నుంచి 7 సంవత్సరాలు

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Aug 06, 2022

 Covid

అన్ని చోట్లా స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ అయ్యాయి. పిల్లలు అందరూ  క్లాసులకు వెళ్తున్నారు. ఇపుడు రాజేశ్వరికి ఓ కొత్త సందేహం పట్టుకుంది. కోవిడ్ రకరకాల వేరియంట్లతో మళ్ళీ విరుచుకు పడుతోంది కదా.. మరి ఇవి స్కూలుకు వెళ్తున్న తన బిడ్డకు కూడా హాని కలిగిస్తాయేమో అని. ఈ సందేహం రాజేశ్వరిదే కాదు, తమ పిల్లల్ని బడికి పంపించే ప్రతి అమ్మది కూడా.. కదా! మరి పేరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్.. ఏంటంటే పెద్దల కంటే,  పిల్లల ముక్కు  SARS-CoV-2 (కోవిడ్) ఇన్‌ఫెక్షన్‌లను నిరోధించడంలో ఉత్తమంగా పనిచేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ నేతృత్వంలోని పరిశోధన లో వెల్లడయింది.

UQ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు మాలిక్యులర్ బయోసైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ కిర్స్టీ షార్ట్ మాట్లాడుతూ, COVID-19ని నివారించడంలో మరియు పోరాడడంలో పిల్లల రోగనిరోధక ప్రతిస్పందనలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపారు. "పిల్లలలో తక్కువ COVID-19 ఇన్ఫెక్షన్ రేటు మరియు పెద్దల కంటే తేలికపాటి లక్షణాలు ఉన్నాయి, అయితే దీనికి కారణాలు ఇవీ అని స్పష్టంగా తెలియవు" అని డాక్టర్ షార్ట్ చెప్పారు.

పెద్దల ముక్కు కంటే పిల్లల ముక్కు లోపల ఉండే లైనింగ్ SARS-CoV-2కి ఎక్కువ నిరోధక ప్రతిస్పందనను కలిగి ఉందని వారు గుర్తించారు. కానీ ఓమిక్రాన్ వేరియంట్ విషయానికి వస్తే ఇది భిన్నమైనడని అంటున్నారు.

పరిశోధనా బృందం 23 మంది ఆరోగ్యవంతమైన పిల్లలు మరియు 15 మంది ఆరోగ్యవంతమైన పెద్దల నుండి నోస్ లైనింగ్ కణాల నమూనాలను SARS-CoV-2కి బహిర్గతం చేసింది.

పిల్లల నాసికా కణాలలో వైరస్ పెరుగుదల తక్కువగా ఉందని , అలాగే యాంటీవైరల్ ప్రతిస్పందన కూడా పెరిగినట్టు ఫలితాలు చూపించాయి.

ఇలా ఎందుకు జరుగుతోంది అనేదానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయని డాక్టర్ షార్ట్ చెప్పారు.

పిల్లలు చిన్నవయసులో బాల్యంలో గమనించిన వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి 'పరాయి ఆక్రమణదారుల' పై పెంపొందించుకున్న తమ రక్షణ కావచ్చు," ఆమె చెప్పింది. "బాల్యంలో ఈ విధంగా వివిధ సూక్ష్మజీవులకు  గురికావడం అనేది పిల్లలలో నాసికా పొరను బలోపేతం చేసి బలమైన నిరోధక ప్రతిస్పందనను పెంచే అవకాశం ఉంది.

లేదా పిల్లలు మరియు పెద్దల మధ్య జీవక్రియ వ్యత్యాసాలు వైరస్తో పోరాడే జన్యువులు పనితీరును  మార్చగలవు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

పెద్దలతో పోలిస్తే డెల్టా కోవిడ్-19 వేరియంట్ పిల్లల ముక్కు కణాలలో పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఐతే ఒమిక్రాన్ విషయంలో ఈ ధోరణి కాస్త  తక్కువగా కనిపిస్తోంది.

మొత్తానికి, పిల్లల ముక్కులో ఉండే లైనింగ్ పొరలో ఇదివరకటి SARS-CoV-2 ఇన్ఫెక్షన్ తక్కువగా  వృద్ధి చెందుతుంది అనేది స్పష్టమయింది. అయితే వైరస్ వేరియంట్లు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ పరిస్థితి  మారవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.

https://www.uq.edu.au/news/article/2022/08/kids%E2%80%99-noses-can-better-fight-covid-19

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}