పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రుల ప్రభావం- మీరు ఇలా చేస్తున్నారా?

రాజేష్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే.. ఫ్రిజ్ లోనుంచి కూల్డ్రింక్ బాటిల్ తీసి తాగేస్తాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి, సమోసాలో చిప్సో తింటూ TV చూస్తాడు. ఇక నైట్ డిన్నర్ కూడా TV నో, ఫోన్ చూస్తూనో ముగిస్తాడు. భార్య రవళి ఎంత చెప్పినా మారని రాజేష్, ఒక సంఘటనతో మారాడు. తన ఏడాది వయసున్న బాబు కూడా కూల్ డ్రింక్ కావాలని అడగటం.. అన్నం, పాలు మానేసి అదే తాగట౦, టీవీ లేదా ఫోన్ ఇస్తేనే అన్నం తినడంతో అతను ఆలోచనలో పడ్డాడు.
జీవితాంతం ఉండే ముద్ర
మనిషి జీవితంలోని తొలి సంవత్సరాలలో వేగవంతమైన అభివృద్ధి, చాలా కీలకమైన ఆహార మార్పులు చోటుచేసుకుంటాయి. ఎందుకంటే పిల్లలు ఈ సమయంలో పాల నుండి ఇంచుమించుగా పెద్దలు తినే ఆహారానికి మారతారు. ఈ ప్రారంభ సంవత్సరాల్లో, ఆహారం మరియు తినడం గురించి పిల్లలు నేర్చుకున్నది.. తర్వాత వారి ఆహార ఎంపికలు, ఆహార నాణ్యత ఇంకా వారి బరువును నిర్ణయిస్తుంది. పిల్లల ఆహారపు ప్రవర్తనలో తల్లిదండ్రులది చాలా శక్తివంతమైన పాత్ర. ఎందుకంటే వారు పిల్లలకు జన్యువులు, బాహ్య ప్రేరణ రెండింటినీ అందిస్తారు. ఉదాహరణకు, వారు మిగతా వాటి కంటే ఎక్కువగా కొన్ని కొన్ని ఆహారాలను అందుబాటులో ఉంచడం, పిల్లలకు ఉదాహరణ నమూనాగా ఉండటం ద్వారా వారిపై జీవితాంతం ఉండే ముద్ర వేస్తారు. అంటే, పిల్లల ఎదుగుదలను, వారి ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తారు.
మొదట ఇలా చేయండి
చాలా విషయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. పిల్లలు పెద్దలను చూసి, వారిని అనుకరిస్తారు. ప్లీజ్, సారీ, థాంక్స్ లాంటివి చెప్పడం నుండి పోషకాహారం తినడం వరకు ప్రతిదానినీ.. ఏది సరైనదో తెలుసుకోవడానికి వారు పేరెంట్స్ వైపే చూస్తారు. మరి ఒక రోల్ మోడల్‌గా, తల్లిదండ్రులు వారికి చక్కని ఆహారపు అలవాట్లను తెలియచేయాలి. తద్వారా మీ పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలను నేర్చుకోగలుగుతారు. మొదట మీరు మీ ఆహారపు అలవాట్లను నిశితంగా పరిశీలించడం ద్వారా ప్రారంభించవచ్చు.
ఈ క్వశ్చన్స్ మీకు మీరే వేసుకోండి:
-
మీరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా?
-
మీరు భోజనంలో పాలు, జూస్ కాకుండా సోడా, కూల్ డ్రింక్ తాగుతున్నారా?
-
మీరు పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినరా?
-
మీరు రోజంతా స్నాక్స్, చిరుతిళ్ళు మాత్రమే తీసుకుంటారా?
-
మీరు టీవీ ముందు తింటున్నారా?
-
మీరు అధిక కేలరీలు, అధిక కొవ్వు స్నాక్ ఆహారాలు మరియు డెజర్ట్‌లను ఎక్కువగా తింటున్నారా?
పైవన్నీ మీరు చేయకూడనివి. మీరు ఈ ప్రశ్నలలో ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలకు "అవును" అని సమాధానం ఇచ్చినట్లయితే, మీరు మీ పిల్లలకు ఆహారం గురించి అనారోగ్య సందేశాలను పంపుతున్నట్టే. మీరు సరిగా టైం కి తినకపోవడం లేదా భోజనం మానేయడం చేస్తే, మీ బిడ్డ అదే సరైనదని అనుకుంటాడు. పిల్లల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంలో తల్లిదండ్రులకు కీలకమైన పాత్ర. “Actions speak more than words” antaaru. మరి మీరు బోధించే వాటిని ఆచరిస్తే తప్ప, మీ పిల్లల ఆహారపు అలవాట్లపై మంచి ప్రభావం చూప లేరు.
పేరెంట్స్ తమ పిల్లలకు రోల్ మోడల్ అయేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
-
ఎప్పుడూ భోజనం మానేయకండి.
-
కొత్త కొత్త ఆహారాలను మీరే ప్రయత్నించండి. కానీ మీ పిల్లలను వాటిని తినమని బలవంతం చేయకండి. రుచి చూసి చెప్పమని వారిని ప్రోత్సహించండి.
-
మీరు భోజనం చేస్తున్నప్పుడు టీవీ ఆఫ్ చేయండి.
-
కుటుంబ సభ్యులతో కలిసి ఫామిలీ మీల్ టైం సమయాన్ని ఎంజాయ్ చేయండి.
-
సోడా, కూల్ డ్రింక్ బదులుగా నీరు, జ్యూస్ , పాలు త్రాగాలి.
-
ఇంట్లో అధిక కేలరీలు, అధిక కొవ్వు ఉండే జంగ్ ఫుడ్ తినడాన్నితగ్గించండి.
-
భోజనం, స్నాక్స్‌లో కూరగాయలు మరియు పండ్లను ఆడ్ చేయండి.
వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల మీ పిల్లలు తమ లైఫ్ లో గొప్ప ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.. మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మీ పిల్లలకు మంచి పోషకాహారం అందించడంలో మీరే రోల్ మోడల్‌గా ఉండాలి. . గుర్తుంచుకోండి, మీరు చెప్పేదాని కంటే మీరు చేసేది వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా? అయితే లైక్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాతో, ఇంకా అందరు పేరెంట్స్ తో పంచుకోండి!
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...