0 - 12 నెలల వయసులో పిల్లలు బరువు పెరిగేందుకు ఇవ్వవలసిన ఆహార పదార్థాల పట్టిక..

మీ పిల్లలు బరువు పెరుగుట లేదని మీరు చింతిస్తున్నారా ? మీ బిడ్డ బరువు పెరగడానికి వయసు వారిగా , ఏ ఆహారం ఇవ్వాలో తెలుసుకునేందుకు మా పూర్తి సూచనలను చదవండి . మొదటిసారిగా తల్లి అయిన వారి దృష్టి ఎల్లప్పుడూ తమ బిడ్డల పైనే ఉంటుంది. ముఖ్యంగా వారి బరువు గురించి . బిడ్డ సరైన విధంగా బరువు పెరుగుతోందా , తల్లి పాలు సరిపోతున్నాయా , శిశువు బరువు పెరిగేందుకు నేనేం చేయాలి ? ఇది ఎప్పుడూ ఒక తల్లి మనసులో ఉంటే పోరాటం. ఇక్కడ మీ శిశువు బరువు ఆరోగ్యకరమైన రీతిలో ఎలా పెంచుకోవాలో క్లుప్తంగా మరియు స్పష్టమైన బ్లాగును మీ ముందు ఉంచుతున్నాము.
మొదటి ఆరు నెలల (0 నుండి 6 నెలలు) శిశువుల ఆహారం :
సాధారణంగా 6నెలల వరకు శిశువు సరైన బరువు పెరిగేందుకు తల్లి పాలు సరిపోతాయి. కాబట్టి శిశువు 5 నెలల వయసు వచ్చే సరికి పుట్టినప్పటి బరువు కంటే రెట్టింపు బరువు కలిగి ఉన్నట్లయితే బిడ్డ సరైన రీతిలో బరువు పెరుగుతుంది అని అర్థం. ఒకవేళ ఆ విధంగా బరువు పెరగనట్లయితే సలహా కోసం శిశు వైద్యుని సంప్రదించండి. నాలుగు నుండి ఆరు నెలల ముందు ఘానాఆహారాలు ఇవ్వ బడవు.
6 నుండి 9 నెలల బిడ్డలకు ఇవ్వవలసిన ఆహారం - తరువాత మూడు నెలల ఆహార పట్టిక..
బిడ్డ కొన్ని ఘన పదార్థాలకు అలవాటు పడిన తర్వాత ,ఆ బిడ్డ బరువు పెంచేందుకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వారి ఆహారంలో చేర్చాలి . ఇవి ప్రొటీన్ అధికంగా ఉండే సాధారణమైన ఆహారాలు.
తృణధాన్యాల పై దృష్టి పెట్టండి :
అంటే, పిల్లలకు బియ్యం ,గోధుమ రవ్వ , సగ్గు బియ్యం ,మొలకెత్తిన రాగులతో చేసిన పిండి వంటి తృణ ధాన్యాలను ఎక్కువగా ఇవ్వాలి. వీటిని పాయసం లేదా ఫిర్నీ రూపంలో శిశువులకు ఇవ్వండి.
పండ్లు మరియు కాయగూరలను ఇవ్వడం పెంచండి :
అరటి పండ్లు మరియు బంగాళదుంపలు, చిలగడదుంపలు వంటి కాయగూరలను బరువు పెరిగేందుకు ఇవ్వాలి. కూరగాయలను ఉడికించి వాటిపై కొంచెం వెన్న లేదా నెయ్యి రాసి ఇవ్వవచ్చు. ఇదే విధంగా ఒక అరటి పండును బాగా గుజ్జులాగా చేసి ఇవ్వండి. లేదా అందులో కొంచెం బెల్లం పొడిని చేర్చి ఇవ్వండి . లేదా ఖర్జూరాన్ని మెత్తగా చేసి దానిలో కలిపి ఇవ్వండి . లేదా మీగడ పాలతో కలిపి ఇవ్వండి.
గుడ్డులోని పచ్చసొన , మరియు మటన్ లేదా చికెన్ సూ.ప్ :
మీ శిశువైద్యుడు గుడ్డులోని పచ్చసొన ఇవ్వడానికి అనుమతిస్తే ,ఆఫ్ బాయిల్ చేసిన గుడ్డులోని పచ్చసొనను , మెత్తగా ఉడికించిన బంగాళదుంప మరియు మెత్తని అన్నంలో కలిపి తినిపించండి . అందులో కొంచెం వెన్న లేదా నెయ్యి కలిపి ఇవ్వండి.
పప్పులు :
పిల్లలు సులువుగా జీర్ణించుకో గల ముడి పెసలు లేదా పెసరపప్పును ఉడికించి , ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి మెత్తగా చేసి తినిపించండి . సుమారు ఏడు , ఎనిమిది నెలల వయసులో రవ్వ మరియు బియ్యంలో బంగాళదుంపలు , క్యారెట్ వంటి కాయగూరలను వేసి కిచడి లాగా చేసి ఇవ్వవచ్చు.
పాల ఉత్పత్తులు :
పెరుగును తయారు చేసేందుకు పూర్తి స్క్రీన్ గల పాలను వాడండి ఆ పెరుగులో మెత్తటి పండు ఖర్జూరం లేదా బెల్లంతో కలిపి ఇవ్వండి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో. మీ పిల్లల ఆరోగ్యం కోసం అరటి బ్రెడ్ రెసిపీలు ఇక్కడ....
10 నుండి 12 నెలల శిశువు బరువు పెరిగే ఆహారం :
ఈ సమయంలో శిశువు తన బరువు కంటే మూడు రెట్లు పెరగాలి . బరువు పెరగడం తక్కువగా ఉన్నట్లయితే ఈ క్రింది ఆహారాల పై దృష్టి పెట్టవచ్చు.
తృణధాన్యాలు :
గంజి , పాయసం మరియు కిచ్డిలతో పాటుగా మీరు పప్పు ,చికెన్ సూపు ,గిలకొట్టిన గుడ్డు తో మెత్తని చపాతీలను కూడా ప్రారంభించవచ్చు. అన్నం మరియు ఇడ్లీలను ఒక స్పూన్ నెయ్యి లేదా వెన్న తో చేర్చి ఇవ్వవచ్చు . కొన్నిసార్లు గోధుమ పిండి లేదా రవ్వ తో హల్వా లాగా చేసి కూడా ఇవ్వవచ్చు.
పండ్లు :
పండ్లను నేరుగా ఇవ్వడానికి బదులుగా మీరు ఆ పండ్లను పెరుగు తోనూ మరియు కీర్ తో కలిపి ఇవ్వవచ్చు. కస్టర్డ్స్, స్మూతీస్ ముఖ్యంగా అరటిపండు, తేనె ,పాలు ,పెరుగు కలిపి చేసి ఇవ్వవచ్చు (మీ బిడ్డ మీగడ వంటి బలమైన ఆహారాన్ని జీర్ణించుకో గలదో లేదో గమనించండి కడుపు నొప్పిగా ఉంటే మాత్రం దయచేసి నిలిపివేయండి.)
కూరగాయలు :
ఎక్కువగా బంగాళ దుంపలు మరియు చిలగడదుంపలు ఇవ్వండి .వీటిని పరాటాలు, దోస ,కిచిడి ,సూపర్ తో కలిపి ఇవ్వండి అలాగే ఇతర కాయగూరలను కూడా ఇవ్వవచ్చు .ఈ కూరగాయలతో హల్వా లాగా చేసి కూడా ఇవ్వవచ్చు.
గుడ్లు :
గుడ్డును గిలకొట్టి తాజా మీగడ మరియు పాలతో నాగ్ లాగా చేసి ఇవ్వవచ్చు. సూపులలో కూడా చేర్చి ఇవ్వవచ్చు
చేప ,చికెన్ ,మటన్ లను మీ శిశు వైద్యులు అంగీకరించినట్లయితే మెత్తగా ఉడికించి పిల్లలకు ఇవ్వవచ్చు.
ఇంట్లో తయారుచేసిన పన్నీరు-మొదటి పుట్టినరోజు వచ్చేసరికి తాజాగా ఇంట్లో తయారుచేసిన పన్నీరు మరియు జున్ను పిల్లలకు ఇవ్వడం అలవాటు చేయాలి. మీరు పన్నీరు ను బెల్లం లేదా చక్కెర తో కలిపి మెత్తగా చేసి లడ్డూలాగా చేసి కూడా ఇవ్వవచ్చు . లేదా వేలి ఆకారంలో చేసి స్నాక్ లాగా కూడా ఇవ్వవచ్చు .జున్ను ఇస్తూ ఉన్నట్లయితే , దానిని తక్కువ మోతాదులో ఇవ్వండి. ఎందుకంటే దీనిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.
వెన్నతో కూడిన పాలతో చేయగల ఆహారాలైన బియ్యం పాయసం , ఖర్జూరం మరియు ఎండు ద్రాక్ష వంటి వాటితో కస్టర్డ్ , సేమ్యా పాయాసం మరియు క్యారెట్ పాయసం వంటివి శిశువు బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. శిశువులలో నెలవారీగా ఆరోగ్యకరమైన బరువు పెరిగే ఆహార పట్టిక , మరింత సమాచారం...
0 - 12 నెలల మధ్యలో శిశువు ఒక స్థిరమైన విధానంలో బరువు పెరగాలి అని గుర్తుంచుకోండి :
రెండు సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పిల్లలకు అదనపు నెయ్యి , వెన్న, నూనెలను వాడవచ్చు . ఒకవేళ పిల్లలు బరువు అధికంగా ఉన్నట్లయితే వాటిని మితంగా ఇవ్వండి.
ఫుల్ క్రీమ్ ఉండే పాలు 1 - 2 సంవత్సరముల వరకు మాత్రమే వాడాలి. రెండు సంవత్సరాల తర్వాత బిడ్డ సాధారణ బరువు ఉంటే టోన్డ్ పాలను మాత్రమే ఇవ్వండి.
పైన పేర్కొన్న ఆహారాలు ఇచ్చేటప్పుడు, ముందు తక్కువ మోతాదులో ఇచ్చి అలర్జీల వంటివి ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని కొనసాగించండి.
బేబీ డైట్ బ్లాగ్ మీకు ఉపయోగపడిందా ? వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...