గర్భం దాల్చాలనుకుంటే ఎన్నిసార్లు సెక్స్ చేయాలి పూర్తి వివరాలు ఇక్కడ

All age groups

Ch  Swarnalatha

3.1M వీక్షణలు

3 years ago

గర్భం దాల్చాలనుకుంటే ఎన్నిసార్లు సెక్స్ చేయాలి పూర్తి వివరాలు ఇక్కడ

కీర్తికి పెళ్లై మూడేళ్ళు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. తను తల్లి కావాలనుకుంటోంది కానీ ప్రతిసారీ ఆమె వైఫల్యాన్ని ఎదుర్కొంటుంది. ఒకరోజు కీర్తి స్నేహితురాలు రియా గర్భవతి కావడానికి సమస్య ఏమిటని ఆమెను అడిగింది. అప్పుడు కీర్తి తనకు కానీ, తన భర్తకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదని, అయినా ప్రేగ్నన్సీలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నానో తెలియడం లేదని చెప్పింది. ఈ  పరిస్థితిలో, నగరంలోని ఉత్తమ గైనకాలజిస్ట్‌ను సందర్శించమని రియా సలహా ఇచ్చింది. కీర్తి, ఆమె భర్త రెండు రోజులు డాక్టర్ని సందర్శించారు. డాక్టర్ ఇద్దరినీ చాలా ప్రశ్నలు అడిగారు. అందులో కొన్ని ప్రశ్నలు వారి మధ్య సెక్స్ గురించి కూడా ఉన్నాయి. వారి సమాధానాలతో డాక్టర్ సమస్య ఎక్కడుందో గ్రహించారు.  తల్లిదండ్రులు కావడానికి వారు ఎప్పుడు, ఎన్ని సార్లు కలయికలో పాల్గోవాలో ఆమె చెప్పారు. మరి మనం ఈ బ్లాగ్‌లో ఆ విషయాలనే చర్చిద్దాం. 

Advertisement - Continue Reading Below

మీ ఫలవంతమైన రోజులను ఎలా లెక్కి౦చాలి?

ప్రతి నెలలో ఒక వారం సెక్స్ చేయడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిని ‘ఫెర్టిల్ టైం’ అని పిలుస్తారు. ఇది స్త్రీలో అండం విడుదల కావడానికి  రెండు నుండి మూడు రోజుల ముందు ప్రారంభమవుతుంది. అండోత్సర్గము ముందు ఈ రోజుల్లో గర్భధారణకు సరైనదిగా పరిగణించబడుతుంది.

1. అండోత్సర్గము మరియు ఫలదీకరణం

మీ ఋతు చక్రం 28 రోజులు కొనసాగితే, మీలో అండం విడుదలయ్యే సమయం 12 నుండి 14 రోజులు. మీ చక్రం తక్కువగా ఉంటే, మీ సారవంతమైన సమయం 8వ లేదా 9వ రోజున రావచ్చు. ఇక, నెల 19 లేదా 20వ తేదీల్లో రావచ్చు. అండం విడుదలయ్యే గుడ్డు 12 నుండి 24 గంటల వరకు మాత్రమే ఫలదీకరణం చేయగలదు. కానీ సర్వికల్ మ్యూకస్ అనే జిగురు పదార్ధం  సహాయంతో, స్పెర్మ్ ఐదు రోజుల పాటు స్త్రీ పునరుత్పత్తి అవయవంలో జీవించిఉండగలదు.

2. సర్వికల్ మ్యూకస్ (గర్భాశయ శ్లేష్మం)

Advertisement - Continue Reading Below

గర్భాశయ శ్లేష్మం సారవంతంగా ఉన్న రోజు లైంగిక సంపర్కానికి ఉత్తమమైన రోజు అని పరిశోధనలు చెబుతున్నాయి. సారవంతమైన గర్భాశయ శ్లేష్మం అనేది పచ్చి గుడ్డులోని తెల్లసొనమాదిరిగా  కనిపించే యోని ద్రవం. ఇది సాధారణంగా అండం విడుదలయ్యే ముందు కనిపిస్తుంది. గర్భాశయ శ్లేష్మం, స్పెర్మ్ యొక్క కదలికను పెంచుతుంది, ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఎంత ఎక్కువ స్పెర్మ్ మీ ఫెలోపియన్ ట్యూబ్‌లను చేరుకుంటే, మీ ఫలదీకరణ అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

3. మంచి మూడ్, వాతావరణం

ఒత్తిడి లేని మరియు రిలాక్స్ అయిన వాతావరణంలో జీవించడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని మీరు తెలుసుకోవాలి. నెలలో నిర్దిష్ట సమయాల్లో మీ కోరిక పెరుగుతున్నట్లు మీరు గమనించారా? ఈ హార్మోన్ అండోత్సర్గానికి ముందు మీ సెక్స్ కోరికను కూడా పెంచుతుంది. లైంగిక ఆనందం మరియు సంతృప్తి మీ గర్భం దాల్చే అవకాశాలను కూడా పెంచుతుంది. ఐతే,  మీరు ఎల్లప్పుడూ సెక్స్ గురించి ఆలోచి౦చాలని దీని అర్థం కాదు.

4. అండం విడుదలను  ట్రాకింగ్ చేయడం

మీరు క్యాలెండర్ సహాయంతో అండోత్సర్గమును ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా, అండోత్సర్గము యొక్క లక్షణాలను శరీర ఉష్ణోగ్రత, గర్భాశయ శ్లేష్మం లేదా హార్మోన్ స్థాయిలు వంటి మార్పుల ద్వారా కూడా ట్రాక్ చేయవచ్చు. అండం విడుదలను అంచనా వేసే పరీక్ష, గర్భధారణ పరీక్షను పోలి ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు అండోత్సర్గము చేయబోతున్నారో తెలియజేస్తుంది. ఇవి టెస్ట్ స్టిక్స్ లేదా టెస్ట్ స్ట్రిప్స్ రూపంలో లభిస్తాయి. మీ యూరిన్ (మూత్రం)తో పరీక్ష చేసి.. అండోత్సర్గ చక్రాన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా మీ పీరియడ్స్ తేదీని నమోదు చేయండి.  ఆపై మీరు ఎప్పుడు ఎక్కువ అండోత్సర్గము చేయబోతున్నారో సులభంగా తెలుసుకోవచ్చు.

5. సెక్స్ ఫ్రీక్వెన్సీ

సెక్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిమతం. సెక్స్‌ని రోజుకు ఒకసారి కంటే ఎక్కువ చేయకూడదని నిపుణులు అంటున్నారు. చాలా తరచుగా సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ల సంఖ్య తగ్గిపోతుందనే వాస్తవాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ సైకిల్ సమయంలో వారానికి మూడు నుండి నాలుగు సార్లు సెక్స్ చేయడం మంచిది. మీరు గర్భం దాల్చాలని ప్రయత్నిస్తుంటే, ఫలవంతమైన సమయంలో ఖచ్చితంగా సెక్స్ చేయాలి. అయితే మీరు మరియు మీ భాగస్వామి పూర్తీ ఆరోగ్యంగా ఉన్నపుడు, నెలలో ఏ సమయంలో సెక్స్ చేసినా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయనేది నిజం.

ఈ బ్లాగ్‌లో పేర్కొన్న ప్స్మాచారం నచ్చిందా.. యూజ్ఫుల్ గా ఉందా.. ఐతే like, share, comment చేయండి. ఇంకా,పై  సలహాలను ప్రయత్నించే ముందు మీరు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలని,  డాక్టర్ సలహా ప్రకారం మీ గర్భధారణను ప్లాన్ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...