చైనాలో మరో కొత్త వ్యాధి: లాంగ్యా వైరస్ లక్షణాలు వివరాలు

పనంతా పూర్తి చేసుకున్న రాధ, తీరిగ్గా ఫోన్ తీసింది. ఓపెన్ చేసీ చేయగానే చైనా లో కొత్త వైరస్ అనే న్యూస్ నోటిఫికేషన్ వచ్చింది. అమ్మో అనుకుని చూస్తె.. ఇప్పటికే 35 మందికి వచ్చిందనీ.. వారందరూ చైనాలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని ఆ వార్తలో ఉంది. మరి ఈ వైరస్ ప్రమాదకరమా , శరీరంలో ఏ భాగాలకి వస్తుంది.. దీని లక్షణాలేమిటి అని ఆమెకి చాలా డౌట్స్ వచ్చాయి. మీకూ సేమ్ టు సేమా? ఐతే రండి.. ఈ బ్లాగ్ లో వివరాలు తెలుసుకుందాం..
లాంగ్యా హెనిపావైరస్ అంటే ఏమిటి?
చైనాలో 35 మందికి లాంగ్యా వైరస్ అనే కొత్త వైరస్ సోకినట్లు నిపుణులు గుర్తించారు.
ఐతే ఈ రోగులు ఒకరికొకరికీ సన్నిహిత సంబంధాలు కానీ, వారందరూ ఒకే సాధారణ ప్రదేశానికి, పరిస్థితులకు గురవటం కానీ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ విషయం నిపుణుల దృష్టిని ఆకర్షించింది. అంటే లాంగ్యా వైరస్ మరో జూనోటిక్ వైరస్ అని, అంటే కరోనా మాదిరిగా జంతువుల నుంచి మనుషులకు వస్తుందని వారు భావిస్తున్నారు.
మరోవైపు, లాంగ్యా వైరస్ కొత్తగా కనుగొనబడిన వైరస్ కాబట్టి, తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి మరియు తనిఖీ చేయడానికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ పద్ధతిని ఏర్పాటు చేస్తోంది.
లాంగ్యా వైరస్ - మరో జూనోటిక్ వైరస్
చైనాలోని షాన్‌డాంగ్ మరియు హెనాన్ ప్రావిన్స్‌లలో కనుగొనబడిన లాంగ్యా హెనిపావైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఐతే, మానవుల నుండి మానవునికి సంక్రమించేది లేనిదీ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఈ వైరస్ గురించి తదుపరి పరిణామాల గురించిచాలా శ్రద్ధ వహించాలని వారు హెచ్చరించారు.
పెంపుడు జంతువులలో లంగ్యా వైరస్ పై CDC ఒక సెరోలాజికల్ సర్వే నిర్వహించింది. వారు పరీక్షించిన మేకలలో 2 శాతం, కుక్కలలో 5 శాతం ఈ వ్యాధికి పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పారు.
ఇక 25 అడవి జంతు జాతులపై జరిపిన పరీక్షలు, ష్రూ అనే ఎలుక మాదిరి జంతువు లాంగ్యా హెనిపావైరస్ యొక్క సహజ ఆశ్రయం కావచ్చునని సూచిస్తున్నాయి. ఎందుకంటే వారు పరీక్షించిన 27 శాతం ష్రూలలో లాంగ్యా వైరస్ కనుగొనబడింది.
లాంగ్యా వైరస్ మొదట ఎక్కడ కనుగొన్నారు?
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో చురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, లాంగ్యా వైరస్ అనారోగ్యానికి సంబంధించిన కొత్త హెనిపావైరస్, చైనాలో గుర్తించబడింది. చైనాలోని షాన్‌డాంగ్ మరియు హెనాన్ ప్రావిన్స్‌లలో లాంగ్యా హెనిపావైరస్ యొక్క తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉన్న 35 మంది రోగులను ఈ పరిశోధన గుర్తించింది.
లాంగ్యా వైరస్ లక్షణాలు ఏమిటి?
-
లాంగ్యా వైరస్ సోకిన రోగులలో జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి.
-
ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువ కావడమే కాకుండా, వారి తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గింది.
-
లివర్ వైఫల్యం ఇంకా కిడ్నీల వైఫల్యం కూడా ఇతర లక్షణాలు.
సో, వైద్యనిపుణులు సూచించిన ప్రకారం లాంగ్యా వైరస్ పరినామాలపి మనం శ్రద్ధ వహించడం అవసరం. దీని గురించి విలువైన, తాజా సమాచారం కోసం parentune.com ని ఫాలో చేయండి. మా బ్లాగ్ నచ్చితే like, comment, share చేయడం మర్చిపోకండి!
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...