వర్షాకాలంలో పిల్లల్ని ఏడిపించే డైపర్ రాష్‌: దీనిని ఎదుర్కోవడం ఎలా?

All age groups

Ch  Swarnalatha

2.9M వీక్షణలు

3 years ago

వర్షాకాలంలో పిల్లల్ని ఏడిపించే డైపర్ రాష్‌: దీనిని ఎదుర్కోవడం ఎలా?

 

Advertisement - Continue Reading Below

ఈ మధ్య నేను నా ఏడేళ్ళ కూతురు రాజీవితో కలిసి నా కజిన్ స్వప్న వాళ్ళ ఇంటికి  వెళ్లాను. తనకి 10 నెలల బాబు ఉన్నాడు. మేం అక్కడ ఉన్నంత సేపు స్వప్న  హడావిడిగానే ఉంది. పదేపదే వాళ్ళ బాబు ఏడుస్తున్నాడు.  తన కొడుకును  సముదాయించడానికి స్వప్న ఏదేదో చేస్తోంది. ఏంటి సంగతి అని అడిగితే, చిన్నవాడికి డైపర్ రాషెస్.. అంటే డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు ఉన్నాయని చెప్పింది. వాటివల్ల బాబు చిరాగ్గా, ఏడుస్తూ ఉండట౦, దానితో స్వప్న ఊరికే కంగారు పడటం.. ఇదంతా గమనించాను. 

వానలు పడుతున్నపుడు మీ బిడ్డకు వచ్చే డైపర్ రాష్ ఇంకా దాని నివారణకు హోం రెమెడీస్ గురించి తప్పక తెలుసుకోవలసిన కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి…

వర్షాకాలంలో ..

మండే వేసవి వేడి నుండి వర్షాకాలం లోకి అడుగుపెట్టాం. అయితే ఈ వానలు చల్లదనంతో పాటు తేమశాతం, నీటి వల్ల వచ్చే రోగాలు కూడా తీసుకు వస్తాయని మనం మర్చిపోకూడదు. ప్రత్యేకించి చంటి పిల్లలు ఉన్న మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. Mansoon సీజన్

నవజాత శిశువులపై ఎక్కువగా ప్రభావం చూపే  అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తేమ వాతావరణం కారణంగా వారి చర్మ౦పై ప్రభావం పడుతుంది.  తేమ, వెచ్చని మరియు తడి వాతావరణం కొన్ని హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణం అవుతుంది. 

డైపర్ రాష్ అంటే..

డైపర్ రాష్ అనేది వర్షాకాలంలో, ముఖ్యంగా 9-12 నెలల మధ్య శిశువులలో సర్వసాధారణమైన పరిస్థితి. శిశువు యొక్క కింది భాగం ఎర్రబడినట్లు కనిపిస్తుంది. శిశువు జననాంగాలు, లోపలి మడతలు, తొడల మధ్య కూడా  ఇలా ఉండవచ్చు.

Advertisement - Continue Reading Below

ఖచ్చితంగా, చాలా మంది మమ్మీలు కనీసం ఒక్కసారైనా న్యాపీ రాష్ పరిస్థితిని ఎదుర్కొంటారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటప్పుడు మీరు మీ పెరెంటింగ్  నైపుణ్యాలను గురించి సందేహపడటం మానేసి.. ఇంట్లోనే సరైన సంరక్షణ తీసుకుంటే  డైపర్ రాష్ ప్రమాదకరం కాదని గుర్తుంచుకోండి.

డైపర్ రాష్ ఎందుకువస్తుంది.. 

డైపర్ దద్దుర్లు ఎక్కువగా చర్మపు చికాకుల వల్ల సంభవిస్తాయి.  డైపర్ లోపల పీ లేదా పాటీ వల్ల శిశువు చర్మం ఎక్కువసేపు తడిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.

డైపర్ రాష్ కి  ఇతర కారణాలు- కొన్ని రకాల బట్టలు, సబ్బులు, డిటర్జెంట్లు మరియు సున్నితమైన చర్మాన్ని ప్రభావితం చేసే బేబీ వైప్‌ల వల్ల కలిగే అలెర్జీలు కావచ్చు. డైపర్ రొటీన్‌లో మార్పులు చేసినప్పటికీ, కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం పాటు డైపర్ రాశేస్ ఉంటె.. అవి  కాండిడా అల్బికాన్స్ అనే ఒక రకమైన ఫంగస్ వల్ల సంభవించవచ్చు.

నాపీ రాష్ రాకుండా..

మీ చిన్నారి నాపీని జాగ్రత్తగా చెక్ చేయడం, డైపర్లను ఎప్పటికప్పుడు మార్చడం వల్ల చర్మానికి తగినంత గాలి తగులుతుంది.. ఊపిరి పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల దద్దుర్లు నివారించవచ్చు. దద్దుర్లు నివారించడానికి మరొక మార్గం ఏమిటంటే, శిశువును రోజులో రెండు గంటలు డైపర్లు లేకుండా ఉంచడం.

డైపర్ రాష్ కి  చిట్కాలు

అయినప్పటికీ, దద్దుర్లు ఇప్పటికే కనిపించినట్లయితే, డాక్టర్తో సంప్రదించిన తర్వాత శిశువు చర్మానికి సరిపోయే క్రీములు, లోషన్లు మరియు డైపర్ క్రీమ్లు రాయడం ఉత్తమం. ఇవి ముఖ్యంగా జింక్ ఆక్సైడ్ మరియు పెట్రోలియం జెల్లీ కలిగి ఉంటాయి.  ప్రభావిత ప్రాంతాల్లో కాలమైన్ లోషన్ ఉపయోగించడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి. పాపాయి చర్మాన్ని తడిలేకుండా పొడిగా తుడవడం కూడా  కూడా మంచి ఆలోచన. ఇందుకు మెత్తని బట్ట లేదా టిష్యూతో మెల్లగా అద్దాలి. అలా కాకుండా రుద్దడం వల్ల దద్దుర్లు పెరుగుతాయి. డైపర్ దద్దుర్లు వచ్చినపుడు మనం ఇంట్లో సరైన చికిత్స చేస్తే, సాధారణంగా 2-3 రోజులలోనే తగ్గిపోతాయి. 

దద్దుర్లు ఎక్కువైపోయి పుండ్లుగా మారితే, వైద్యులు యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లేదా కొన్ని సార్లు తేలికపాటి స్టెరాయిడ్ క్రీమ్‌లను కూడా సూచించవచ్చు. బేబీ చర్మంపై ఉపయోగించే అన్ని ఉత్పత్తులు, ప్రత్యేకించి తుడవటానికి వాడే వైప్స్ ఆల్కహాల్, సువాసన లేనివిగా ఉండాలి. రాష్ వచ్చినపుడు బేబీ పౌడర్ లేదా టాల్క్ ఉపయోగించడం మానుకోండి.  తామర, చీము కురుపులు, స్టమక్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు దోమ కాటు వల్ల కలిగే అనారోగ్యాలు వంటివి వేడి, తేమ మరియు తేమతో కూడిన వాతావరణం కారణంగా పసివారి చర్మాన్ని చికాకు పరిచే  ఇతర పరిస్థితులు. 

వర్షాకాలంలో డైపర్ రాష్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ బ్లాగ్ లో చిట్కాలు మీకు నచ్చాయా? ఐతే లైక్ షేర్ చేయండి.. మీ కామెంట్‌లను మాకు దయచేసి తెలియజేయండి.

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...