యువతే లక్ష్యంగా హైదరాబాద్ లో డ్రగ్ ట్రాప్: మీ టీనేజ్ పిల్లల పై ఓ కన్నేయండి!

11 to 16 years

Ch  Swarnalatha

2.7M వీక్షణలు

3 years ago

యువతే లక్ష్యంగా హైదరాబాద్ లో డ్రగ్ ట్రాప్: మీ టీనేజ్ పిల్లల పై ఓ కన్నేయండి!

కలిగిన కుటుంబాలకు చెందిన పిల్లలు, కాలేజీ విద్యార్ధులే లక్ష్యంగా తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల దందా సాగుతు౦దన్న ఇటీవలి వార్తలతో  తల్లితండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మూడవ కంటికి తెలియకుండా చాపకింద నీరులా నగరంలో మత్తుమందుల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును.. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ లేదా హెచ్-న్యూ (H-NEW) అధికారులు బయటపెట్టారు. ఈ సందర్భంగా నేషనల్ లెవెల్ లో నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రంలో విక్రయాలు చేస్తున్నా ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసారు. ఈ గాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో సంపన్నుల సంతానం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్ధులు ఉన్నారని.. వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్న అధికారుల ప్రకటన తల్లితండ్రులలో ఆందోళనకు కారణమవుతోంది. 

Advertisement - Continue Reading Below

డెడ్ ట్రాప్ విధానంలో..

Advertisement - Continue Reading Below

యువతరమే టార్గెట్ చేసుకొని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు తీసుకుని, ‘డెడ్ ట్రాప్’ విధానంలో లేదా కొరియర్ ద్వారా మాల్ అందచేయడం వారి స్టైల్. అసలు సూత్రధారులు ఎవరూ మనకు కనిపించరు కానీ డ్రగ్స్ మాత్రం చేరాల్సిన చోటికి చేరిపోతాయి. క్రిప్ట్టో కరెన్సీ ద్వారా పేమెంట్ అందుకున్న సరఫరాదారులుడ్రగ్స్ ను చాలా తెలివిగా పెడ్లర్స్ కు అందచేస్తారు. మాల్ ని సాధారణ వస్తువులు, వస్త్రాల లాగా కనిపించేలా పాక్ చేసి కొరియర్ చేస్తారు. లేదా ఎవరూ ఊహించని ప్రదేశంలో డ్రగ్స్ పాకెట్ ఉంచి.. ఆ సమాచారాన్ని మెసెంజర్ ద్వారా స్థానిక విక్రేతలకు అందచేస్తారు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ఇక వారు జంట నగరాలలోని గొప్పింటి పిల్లలు, యువకులు, విద్యార్ధులు, సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవారు .. ఇలాంటి వారికి అమ్ముతారు. అంతేకాకుండా ఈ మహమ్మారి అలవాటు ఒకరినుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తించడం ఆందోళనకరమైన విషయం. 

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..

అతితెలివిగా వ్యవహరిస్తున్న ఈ గాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్నవారిలో ముఖ్యంగా విద్యార్ధులు, టీనేజర్లు ఉండడం గమనించదగిన విషయ౦. ఈ నేపధ్యంలో తల్లోదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు గాను, తమ ఇంటికి వచ్చే కోరియర్లు, పార్సిల్లపై ఒక కన్ను వేసి ఉంచాలి. వీలైనంత వరకు వాటిని తామే విప్పి చూడటం మంచిది. అదేవిధంగా, తమ పిల్లల ప్రవర్తనను పరిశీలించాలి. వారి ప్రవర్తనలో ఏమైనా తేడా వచ్చిందా అని గమనించాలి. అనుమానం వస్తే వారిపై నిఘా ఉంచడం అత్యవసరం.   

మా బ్లాగ్ మీకు నచ్చితే, ఉపయోగకరం అనిపిస్తే.. ఇంకేండుకాలస్యం.. మిగిలిన పేరెంట్స్ కి చేరేలా లైక్, కామెంట్, షేర్ చేయండి మరి!

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...