ఫాదర్స్ డే 2022: నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..

మన జీవితానికి మనమే హీరో లేదా హీరొయిన్ అనుకుంటాం. అవును, అది నిజమే కూడా. ఎందుకంటే మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి.. చదువుంది, డబ్బుంది, పేరుంది, ఆస్తి ఉంది, మనకంటూ ఒక కుటుంబం కూడా ఉంది. వాటి నుంచి వచ్చే ఆనందముంది. ఇవే మనకి సర్వస్వం..
కానీ మీరు గమని౦చారో లేదో.. అవన్నీ మనకి ఇచ్చి, మనల్ని ఒక మనిషిగా ఈ స్థానంలో నిలబెట్టిన వ్యక్తీ, మన అభివృద్ధిని చిన్న చిరునవ్వుతో చూస్తూ ఒక మూల నిల్చుని ఉండిపోయారు. అది మనల్ని హీరోలు గా చేసిన నిజమైన హీరో అయిన నాన్న. కానీ మన౦ ఎప్పుడైనా ఆయన్ని గుర్తించామా?, ఆయన్ని గౌరవించామా? అవును!! నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…
ఈమధ్య సుప్రసిద్ధ సినీ రచయితా తనికెళ్ళ భరణి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నాన్న గొప్పతనాన్ని, నాన్న వెనుక బడిన విధానాన్ని తనకి వాట్సాప్ లో వచ్చిన, బాగా నచ్చిన ఒక కవితను గానం చేస్తూ చెప్పారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, ధక్కముక్కీలు తిన్న అంట గొప్ప వ్యక్తీ, ఆ కవిత చదువుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ కవితను గుర్తుచేసుకుని, ఈ నెల 19న ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు కృతజ్ఞత అర్పిద్దాం…
(ఈ కవితని రాసింది శ్రీ పనసకర్ల ప్రకాశ్ నాయుడు గారు. ఇది వరకు ఆయన ఎన్నో కవితలని రాసారు. అందులో ఎప్పుడో తను రాసుకున్న ఈ కవిత వాట్సాప్ లో విస్తృతమై తనికెళ్ళ భరణి గారి ద్వారా భగవత్ స్వరూపులు చిన జీయర్ స్వామి వారి వరకు చేరింది.)
నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..
అమ్మ తొమ్మిది నెలలు మోస్తే ….నాన్న పాతికేళ్ళు మోస్తాడు
రెండు సమానమే అయినా…నాన్న ఎందుకో వెనకబడ్డాడు
ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ …
తన జీతం అంతా ఇంటికే ఖర్చుపెడుతూ నాన్న …
ఇద్దరి శ్రమ సమానమే అయినా….నాన్న ఎందుకో వెనకబడ్డాడు
ఏది కావాలి అంటే అది వండిపెడుతూ అమ్మ …
ఏది కావాలి అంటే అది కొనిపెడుతూ నాన్న …..
ఇద్దరి ప్రేమ సమానమే ఐన, అమ్మ కి వచ్చిన పేరు ముందు …
నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు ….
ఫోన్లోనూ అమ్మ పేరే….దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే …
అమ్మ తొమ్మిది నెలలు మోస్తే!
నాన్న పాతికేళ్ళు !!
రెండు సమానమే అయిన నాన్న ఎందుకో వెనుకబడ్డాడు!!!
ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ !
తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న !!
ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు !!!
ఏది కావాలంటే అది వండిపెడుతూ అమ్మ !
ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న !!
ఇద్దరి ప్రేమ సమానమే అయిన అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!
ఫోన్లోను అమ్మ పేరే !
దెబ్బతగిలినపుడు అమ్మా అని పిలవడమే !
అవసరం వచ్చినపుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్నేమైనా భాదపడ్డాడా…ఏమో !!!
ఇద్దరు సమానమే అయిన పిల్లల ప్రేమని పొందడంలొ తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!
అమ్మకి, మాకు బీరువానిండా రంగురంగుల చీరలు, బట్టలు !
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు !!
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు !!!
అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు !
నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి !!
కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలొ నాన్నెందుకో వెనుకబడ్డాడు !!!
పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ !
ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న !!
ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు !!!
వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది నాన్న అయితే ఎందుకు పనికి రాడు అని మేం తీర్మానం చేసుకున్నపుడు కూడా వెనుకబడిందీ నాన్నే…!!!
నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం…..!!!
ఆయన ఇలా అందరికి వెన్నెముక కావడమే….!!!
వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం…!!!
ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడి పోవడానికి గల కారణం……!!!!!!
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...