వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి పిల్లలను ఎలా రక్షించాలి?

All age groups

Ch  Swarnalatha

2.3M వీక్షణలు

3 years ago

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి పిల్లలను ఎలా రక్షించాలి?

శ్రీవిద్య కి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కవలలు.. అబ్బాయిలు. ఇపుడు థర్డ్ క్లాస్ లో ఉన్నారు. ఈ మధ్య ఆగకుండా కురుస్తున్న వర్షాల్లో వాళ్ళ అల్లరికి హద్దే ఉండటం లేదు. ఏదో వంక పెట్టుకుని తడవటం.. నీరు చేరిన గుంతల్ల్లో  ఆడటం..వాళ్ళకి ఇదే ఆట.  ఐతే వర్షాకాలం సరదానే కాకుండా పిల్లలకు అనారోగ్యాన్ని కూడా తీసుకువస్తుందని శ్రీవిద్య భయం.  పిల్లల్ని బలవంతంగా ఇంటిలోనే ఉంచేయవచ్చు.. ఐతే నీటి గుంటలలో దూకడం, వర్షంలో ఆడుకోవడం చిన్ననాటి గొప్ప ఆనందాలలో ఒకటి. మరి, వర్షాకాలంలో మన పిల్లలను హాపీగా ఉంచుతూనే.. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే, మన౦ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. మన ఇంటిని సిద్ధం చేసుకోవాలి.

Advertisement - Continue Reading Below

 పిల్లలను సీజనల్ వ్యాధులు మరియు అనారోగ్యాల నుండి ఎలా రక్షించుకోవాలి? అనేది  ఇప్పుడు మమ్మీల ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకు కొన్ని సూచనలు ఇదిగో ఈ బ్లాగులో..

వర్షాకాలం వ్యాధుల నుండి పిల్లలను రక్షించడానికి చిట్కాలు

#1 ఆరోగ్యంగా తినండి మరియు త్రాగండి

వర్షాకాలంలో పిల్లల జీర్ణవ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి, బయటి ఆహారం తినకుండా వారిని నిరోధించాలి. మనం ఇంట్లో బాగా కడిగి శుభ్రం చేస్తే తప్ప, పచ్చి కూరగాయలు మరియు సలాడ్‌లను వారికి ఇవ్వకూడదు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి.. గాలి మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా పోరాడటానికి, పిల్లలకు విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని అందించాలి. మీ బిడ్డకు జలుబు చేసినట్లయితే అతనికి కొంత సౌకర్యంగా ఉండేందుకు గోరువెచ్చని పాలు, చికెన్ లేదా వెజిటబుల్ సూప్ ఇవ్వండి. మీ బిడ్డకు మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఇవ్వండి. ఒక సిప్పీ లేదా గ్లాసుతో నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోండి. శుభ్రమైన నీటి వినియోగం, హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడం ద్వారా జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. 

#2 క్లీన్ అండ్ డ్రై హోమ్స్

కీటకాలను ఆకర్షించకుండా ఉండాలంటే మన ఇంటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. తడిగా ఉన్న గోడలను శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోండి, అవి నాచు, ఫంగస్  లను ఆకర్షిస్తాయి. తద్వారా పిల్లలలో ఉబ్బసం మరియు శ్వాస సమస్యలను కలిగిస్తాయి. ఇంట్లోకి ప్రవేశించే ముందు మురికిగా ఉన్న చెప్పులను బయట వదలాలి. ఫ్లోర్‌లను శుభ్రం చేయడానికి నీటిలో కలిపిన క్రిమినాశక ద్రవాలను ఉపయోగించవచ్చు.

#3 డ్రెస్ స్మార్ట్

వర్షాకాలంలో మీ పసిపిల్లలకు ఎక్కువ పొరలున్న దుస్తులు వేయడం మంచిది. తేలికపాటి కాటన్ కార్డిగాన్ లేదా తేలికపాటి కాటన్ దుప్పటి అందుబాటులో ఉంచుకోండి. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయినట్లయితే వెంటనే మీ బిడ్డపై కప్పవచ్చు. లేదా వేడిగా ఉంటే తీసివేయండి. పసిపిల్లల కోసం తేలికపాటి డైపర్లను ఉపయోగించండి. వాటిని క్రమం తప్పకుండా మార్చండి. వారిని దగ్గు మరియు జలుబు నుండి రక్షించడానికి సాక్స్ చాలా అవసరం.

Advertisement - Continue Reading Below

#4 ఎల్లప్పుడూ పొడిగా ఉంచండి

రుతుపవన వర్షాలు చాలా అనూహ్యంగా ఉంటాయి, కాబట్టి మీరు మీ చిన్నారిని బయటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తే ఎల్లప్పుడూ గొడుగు మరియు రెయిన్‌కోట్ తీసుకెళ్లండి.

#5 శుభ్రమైన శరీరం, ఆరోగ్యకరమైన జీవితం

రుతుపవనాల మొదటి జల్లులలో తేలికపాటి ఆమ్లం ఉంటుంది. అందుకే, తొలకరి వర్షాలలో మీ బిడ్డ తడిసిపోకుండా  మీ వంతు ప్రయత్నం చేయండి. మీ బిడ్డ వర్షంలో తడిసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. దానితో చిన్నారి వ్యాధుల బారిన పడతాడు. గోరువెచ్చని నీటి స్నానం వల్ల జలుబు మరియు దగ్గు మరియు ఇతర కాలానుగుణ వ్యాధులు మీ పిల్లలను ప్రభావితం చేయకుండా నిరోధించవచ్చు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి స్నానపు నీటిలో కొన్ని చుక్కల అంటిబయోటిక్ జోడించవచ్చు. మీ పిల్లల చేతులను తేలికపాటి క్రిమినాశక లిక్విడ్ లేదా హ్యాండ్ శానిటైజర్‌లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. ఆ తర్వాత వారి చేతులు తుడవడం మర్చిపోవద్దు!

#6 కంటి సమస్యలు

కార్నియల్ అల్సర్, డ్రై ఐ, కండ్లకలక వంటి కంటి ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో సర్వసాధారణం. మీ చిన్నారి తన కంటిని అనవసరంగా తాకడం లేదా రుద్డకుండా ఆపండి. మీ పిల్లల కళ్లలో ఎరుపు కనిపిస్తే, వీలైనంత త్వరగా శిశువైద్యుని సంప్రదించండి. వారికి ఉపశమనం కలిగించడానికి వారి కళ్లను మరిగించి చల్లార్చిన నీటితో శుభ్రం చేయండి.

#7 దోమలని చేరనివ్వద్దు

నిలిచిన నీరు దోమల ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది. మీ పిల్లల కోసం దోమ తెరలు లేదా దోమలను తోలే మెషీన్లు, క్రీమ్ను ఉపయోగించడం మర్చిపోవద్దు. మస్కిటో కాయిల్స్‌ను నివారించండి. ఎందుకంటే ఇవి మీ పిల్లలలో అలెర్జీ, దగ్గును ప్రేరేపిస్తాయి.

#8 నీరు నిలవకుండా నివారించండి

నీరు నిలిచిన ప్రదేశాల దగ్గర ఆడుకోవడానికి మీ పిల్లవాడిని అనుమతించవద్దు, ఎందుకంటే ఇవి చాలా మురికి ప్రదేశాలు. సీజనల్ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్‌లకు ఇవి నిలయాలు.  

చివరిగా,  మనం వర్షాకాలంలో మన పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఉండాలి. చికిత్స కంటే నివారణ ఖచ్చితంగా ఉత్తమం. కాబట్టి ఈ సీజన్‌లో అవాంఛిత అతిథులందరితో పోరాడటానికి మనం సిద్ధంగా ఉందా౦…. మన పిల్లలకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన రుతుపవనాలను అందిద్దాం.

రుతుపవనాల జాగ్రత్తలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా? మీరు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎలా నివారిస్తారు?మాతో పంచుకోవడానికి మీకు ఏవైనా సహజ నివారణలు ఉన్నాయా? దిగువ కామెంట్ల విభాగంలో మీ అనుభవాలు మరియు సలహాలను మాతో పంచుకోండి. మేము మీ  అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ ఉంటాము!

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...