తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం: తల్లిదండ్రుల కోసం 10 పాయింట్ల చెక్‌లిస్ట్!

All age groups

Ch  Swarnalatha

3.1M వీక్షణలు

3 years ago

 తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం: తల్లిదండ్రుల కోసం 10 పాయింట్ల చెక్‌లిస్ట్!
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
విద్య ప్రపంచం
చదవడం మరియు రాయడం
పాఠశాల
School Admissions

 

Advertisement - Continue Reading Below

ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో నేటినుంచి పాఠశాలలు మరల ప్రారంభం అయ్యాయి. కాగా, కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం పొడసూపింది.  అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా స్కూల్స్‌ తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు. స్కూళ్లకు సెలవుల పొడిగింపు లేదని జూన్‌ 13, సోమవారం నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ అవుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అయోమయానికి గురికావొద్దని విజ్ఞప్తి  చేశారు. అలాగే ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.

స్కూల్స్ ఓపెన్ అయిన పరిస్థితుల్లో, ఈ కొత్త విద్యా సంవత్సరం మీ పిల్లలకు, తల్లితండ్రులకు కూడా ఏ ఆటంకం లేకుండా నడిచేందుకు పేరెంట్స్ దృష్టి పెట్టాల్సిన, చెక్ చేసుకోవాల్సిన  కొన్ని ముఖ్య అంశాలు, మీకోసం: 

1. ఈ సంవత్సరంలో కట్టాల్సిన పిల్లల ఫీజు గురించి స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడండి. పూర్తి ఫీజు ఎంత, అది కాకుండా ఇంకేదయినా ఫీజు ఉంటుందా అని స్పష్టంగా అడగండి. తరువాత ఫీజు సాధ్యమైనంత వరకు సరైన సమయానికి కట్టండి. వీలయితే ఓ రోజు ముందే కట్టండి. మీ అవసరాలను తగ్గించుకొని అయినా పిల్లల ఫీజు విషయంలో కట్టుబడి ఉండటం చాలా అవసరం. 

2. పిల్లలు స్కూలు నుండి వచ్చిన తరువాత తప్పకుండా మీలో అంటే తల్లితండ్రులలో ఎవరో ఒకరు  ఒకటి లేదా రెండు గంటలు వారితో  సమయాన్ని గడపండి. పిల్లలు చెప్పే విషయాలను వినండి. దానివల్ల వాళ్ళ స్కూల్ గురించి, మీకు కొన్ని ముఖ్య విషయాలు, పరిణామాలు, మార్పులు తెలుస్తాయి.  ఉదాహరణకు.. వాళ్లకు వచ్చే టీచర్లు ఎలా బోధిస్తున్నారు, అవసరమైన విద్యార్హతలు ఉన్నాయా, భద్రతా ఎలా ఉంది, ఏదైనా గొడవలు వంటివి చోటుచేసుకున్నాయా వంటివి. 

3. పిల్లలకు కావలసిన బ్యాగు, పెన్సిల్ బాక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, బూట్లు, బట్టలు ఇవన్నీ సమకూర్చండి. ఈ కనీస అవసరాలు లేకపోతే తోటి పిల్లల ముందు మీ పిల్లలు ఇబ్బంది పడతారు. 

Advertisement - Continue Reading Below

4. మీ తాహతుకు మించిన స్కూల్లో పిల్లలను ఎట్టి పరిస్తితిలో జాయిన్ చేయవద్దు. మీ వీలు కన్నా ఓ నాలుగు, అయిదు వేలు తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో వేసినా  ఫర్వాలేదు. దానివల్ల మీపై, మీ పిల్లలపై ఎంతో వత్తిడి తగ్గుతుంది అని గ్రహించండి. 

4. తల్లి తండ్రులు అందరు ఒక విషయం గుర్తుంచుకోవాలి.  చిన్నారుకు ఐదవ తరగతి వరకు తల్లితండ్రుల నుండే ఎక్కువ చదువును నేర్చుకుంటారు. అందువల్ల, ఎలిమెంటరీ వరకు మాములు స్కూలు అయినా ఫర్వాలేదు అందులో వేయండి. కాకపోతే ఇంట్లో ఎవరో ఒకరు శ్రద్ధ పెట్టాలి. 

5.  క్లాస్ లో అందరు చిన్నారులు ఒకే విధంగా చదవరు.  పిల్లల చదువు విషయంలో వారిని ఎవరితో పోల్చకుండా ,మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని మాత్రమే పట్టించుకోండి.  వాళ్ళను ఎంకరేజ్ చేయండి.తల్లితండ్రుల నమ్మకం, వారిచ్చే ప్రోత్సాహం  పిల్లలకు ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. 

6. పిల్లలు స్కూలు గురించి తోటి ఫ్రెండ్స్ గురించి ఏదైనా చెబితే వాటిని విని వదిలేయకుండా  చేయకుండా తప్పకుండా క్లాస్ టీచర్ లేదా ప్రిన్సిపాల్ తో మాట్లాడండి. పిల్లల ప్రవర్తన, ఉద్దేశాలను నిశితం ను గమనించండి. 

7. మీకు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఉంటే, ఇద్దరినీ వేరువేరుగా  చూడడం, మాట్లాడట౦ చేయకండి. ఇద్దరికీ సమానమైన విలువ ఇవ్వండి. తిండి, బట్టలు, పుస్తకాలు, బట్టలు ఇలా అన్నిటిలో ఎవరిని తక్కువ చేయకండి. 

8. పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత మీ ఇద్దరికీ నిజంగా వీలు కానంత బిజీగా ఉంటే మాత్రమే  ట్యూషన్ లాంటి వాటి గురించి ఆలోచించండి. అంతే తప్ప ఇంట్లో ఉంటె చదవరు అని, అల్లరి చేస్తారు అని, టివి చూడనివ్వరు అని, మీ ముచ్చట్లకు, పనులకు  వీలు కాదు అని ఇలాంటి కారణాలతో ట్యూషన్ కు పంపకండి. 

9. పిల్లలు ఇంట్లో హోమ్ వర్క్ చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మీరు టివిలో సీరియల్స్ పెట్టుకొని చూడడం, పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్పుకోవడం, ఫోన్లో పెద్దగా మాట్లాడడం వంటివి చేయకండి. దానికి బదులుగా, మీరు కూడా  ఓ పుస్తకం పట్టుకొని చదువుకోండి. అది వారికీ ఆదర్శంగా, ప్రోత్సాహంగా  ఉంటుంది. 

10. పిల్లలు వీలయినంత వరకు రాత్రి 10 గంటలలోపే నిద్ర పోయేలా అలవాటు చేయండి. పదేళ్లు దాటిన పిల్లలకు సపరేట్ రూమ్ ను అలవాటు చేయండి. మా పిల్లలు నా పక్కలోనే పడుకుంటారు నేను లేకుంటే నిద్రపోరు అనే మాటలు చెప్పకండి. పిల్లల రూమ్ కు సాధ్యమైనంత వరకు లోపల గడియ వేసుకోకుండా చూసుకోండి.

ఇంకా ఏమైనా సందేహాలా? లేదా మీకు తెలిసిన విషయాలు పంచుకొవాల? ఆలస్యం చేయకుండా ఈ కింద షేర్ చేయండి.. మీ తోటి పేరెంట్స్ కు మార్గదర్శనం కావచ్చు.

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...