గర్భధారణ సమయంలో సంభవించే వాపులను ఎలా తగ్గించుకోవాలి ?

Pregnancy

Aparna Reddy

5.0M వీక్షణలు

5 years ago

గర్భధారణ సమయంలో సంభవించే వాపులను ఎలా తగ్గించుకోవాలి ?

కడుపులో శిశువు పెరిగే  కొద్దీ మీ పొట్ట కూడా పెరుగుతూ ఉంటుంది .దానితో పాటుగా మీ శరీర భాగాలన్నీ కూడా ఉబ్బి పోవడాన్ని మీరు గమనించారా ! ముఖ్యంగా పాదాలు మరియు మడిమల విషయంలో ఇది జరుగుతుంది .దీన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు .గర్భధారణ సమయంలో ఇది చాలా సాధారణం .ఇది శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండడం ద్వారా జరుగుతుంది . ముఖము మరియు వేళ్ళకి కూడా వాపు వస్తుంది . మీరు గర్భధారణ సమయంలో వాపు తో బాధపడుతున్నట్లైతే దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దీనిని చదవండి.

Advertisement - Continue Reading Below

 

గర్భధారణ సమయంలో నా పాదాలు సమయంలో వాస్తాయి...

 

గర్భిణీ స్త్రీలలో సగం మందికి ఈ వాపు వస్తుంది .సాధారణంగా రెండవ త్రైమాసికం చివరి భాగం లోనూ ,మరియు మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. వాతావరణాన్ని బట్టి వాపు ఎక్కువ తక్కువగా ఉంటుంది . వేసవి సమయంలో వాపు ఎక్కువగా ఉంటుంది .ఎక్కువ సేపు నిలబడి ఉన్నా ,నడవడం లేదా ఎక్కువ పని చేసినా ఆ సాయంత్రానికి మీ పాదాలు వాచినట్లుగా మీకే తెలుస్తుంది.

 

గర్భధారణ సమయంలో వాపు కి కారణం ఏమిటి ?

 

గర్భధారణ సమయంలో మిమ్మల్ని మరియు మీ శిశువు ని రక్షించేందుకు శరీరం ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది .ఈ అదనపు నీరు మీ శరీరంలోని గర్భాశయం యొక్క సిరలపై వత్తిడి కలిగి వాపునకు దారితీస్తుంది.

 

ఎటువంటి పరిస్థితులలో వైద్యులను కలవాలి ?

 

గర్భిణీలలో వాపు అన్నది చాలా సాధారణమైన సంఘటన. కానీ ఈ విధంగా సంప్రదించినట్లయితే డాక్టర్లను కలవండి.

నీ ముఖము లేదా చేతులు బాగా వాచిపోయి ఒక్కరోజులో తగ్గకుండా ఎక్కువగా బాధిస్తున్న అట్లయితే ఇది ప్రీఎక్లంపిసిఆ కు దారితీయవచ్చు. మూడవ త్రైమాసికంలో ప్రీఎక్లంపిసిఆ కారణంగా అధిక రక్తపోటు ,అధికంగా బరువు పెరగడంతోపాటు , కేవలం ఒక కాలి నరాల లో మాత్రం రక్తం గడ్డ కట్టి నట్లు అవుతుంది. అటువంటి సమయాలలో డాక్టర్లను సంప్రదించడం మంచిది.

 

గర్భధారణ సమయంలో వాపును తగ్గించడానికి కొన్ని చిట్కాలు...

 

Advertisement - Continue Reading Below

ఎక్కువమంది గర్భిణులలో ఈ వాపు అనేది పిలవని అతిథులు లాగా వచ్చి తిష్ట వేస్తుంది .జీవనశైలి మరియు ఆహారం ద్వారా ఈ అసౌకర్యాలను తగ్గించగలము. ఇక్కడ గర్భధారణ సమయంలో వచ్చే వాపులను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను ఇస్తున్నాము.

 

విశ్రాంతి

గర్భధారణ సమయంలో ఏ పని లేకుండా ఎప్పుడు విశ్రాంతి లోనే ఉండటం మంచిది కాదు. క్రమంతప్పకుండా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా ఉండండి .రోజంతా నిలబడి మరియు నడుస్తూ పనిచేస్తున్న వారికైతే విశ్రాంతి ఎంతో అవసరం .మీ కాళ్ళ పాదాలను నడుము పైకి వచ్చేలాగా పైకి లేపుతూ ఉండండి .మీకు వీలు కుదిరిన ట్లయితే షు షాపుకి వెళ్లి గర్భధారణ సమయమనికి అనుకూలమైన షూస్ ను ఖరీదు చేయండి .దీని వలన ఒత్తిడికి లోనవుతున్న మీ పాదాలు ,కాలి వేళ్లు, మడమలు విశ్రాంతి పొందుతాయి.

 

వ్యాయామం:

గర్భధారణ సమయంలో విశ్రాంతి తీసుకోవడం అంటే మీరు అసలు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం అని కాదు .వాకింగ్ ,ఈత మరియు గర్భవతుల యోగా మొదలైనవి మీ గర్భధారణ సమయం అంతా కూడా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి .మీరు వ్యాయామాలను ప్రారంభించే ముందు (మీకు ఏదైనా నా మెడికల్ హిస్టరీ ఉన్నట్లయితే )గైనకాలజిస్ట్ను సంప్రదించండి.

నీరు తగ్గకుండా చూసుకోండి : వాపు గా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నీటిని తీసుకోమని చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా !ఎక్కువ నీటిని తీసుకోవడం ద్వారా మన ఒంట్లో ఉండే అదనపు సోడియంను బయటకు పంపటానికి సహాయపడుతుంది .కాబట్టి వాపు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.  ఎప్పుడూ ఒక నీళ్ళ బాటిల్ ను మీతో పాటు గా ఉంచుకోండి. అందులో కొన్ని నిమ్మకాయ ముక్కలను మరియు కీరదోసకాయ ముక్కలను కలిపినట్లయితే ఎంతో మంచిది.

 

ఆరోగ్యకరమైన ఆహారం :

 

ఏది ఏమైనప్పటికీ గర్భధారణ సమయం అంతా కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం .జంక్ ఫుడ్ లను తినకండి .ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిన్నట్లయితే ఇది ఒంట్లో నీటిని బయటకు వెళ్ళనీయకుండా నిలిపి ఉంచుతుంది. ఎక్కువగా పండ్లను తీసుకోండి .ముఖ్యంగా ఎక్కువగా సి విటమిన్ ఉండే బత్తాయి, ఆరెంజ్ ,పుచ్చకాయ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి.

 

ఇంటి చిట్కాలు :

వీటికి శాస్త్రీయంగా ఎటువంటి రుజువులు లేనప్పటికీ ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థ పరిచి విశ్రాంతిని ఇస్తాయి .వాపు తగ్గించేందుకు కళ్ళు ఉప్పు వేసిన నీటిలో మీ పాదాలను ఉంచండి .మరియు క్యాబేజ్ ఆకులను వాపు ఉన్న ప్రదేశంలో ఉంచుకోండి .అంతేకాకుండా ఆ ఆకులతో కట్టు కట్టినట్లుగా కట్టుకోండి .ఆకులు తడిగా అయిపోయాక వాటిని తీసి వేసి, వేరే ఆకులను కొట్టుకోండి. లావెండర్ మరియు సైప్రెస్ ఆయిల్ తో మీ పాదాలకు బాగా మసాజ్ చేయండి.

 

గర్భధారణ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. కొన్నిసార్లు ఇవి ఎంతో బాధాకరంగా ఉంటాయి. తగిన శ్రద్ధ వహించండి .సంతోషంగా ఉండండి. వెనకకు చేరబడి కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఈ చిట్కాలను పాటించండి. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాము.

 

మీ పాదాల మరియు  మడమల యొక్క వాపులను తగ్గించుకునేందుకు చిట్కాలు మీకు సహాయ పడ్డాయా ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...