మీ పిల్లలు ఓవర్ గా ఫోన్ వాడుతున్నారా? ఈ 7 చిట్కాలతో ఆ అలవాటు తగ్గించ౦డి

All age groups

Ch  Swarnalatha

2.4M వీక్షణలు

3 years ago

మీ పిల్లలు ఓవర్ గా ఫోన్ వాడుతున్నారా? ఈ 7 చిట్కాలతో ఆ అలవాటు తగ్గించ౦డి

“ఫోన్ పక్కన పెట్టి ఇక నిద్రపో..” అని రజిత తన పన్నెండేళ్ళ కొడుకు నివాస్ కి పదోసారి చెప్పింది. కానీ సిక్స్త్ చదువుతున్న వాడు, ఒకే..ఒకే.. ఫైవ్ మినిట్స్ మమ్మీ అంటూనే ఇప్పటికి రెండు గంటల నుంచి ఫోన్ లో గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. ఈరోజే కాదు.. కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు.. వాటి కోసం స్మార్ట్ ఫోన్లు, టాబ్స్ లేదా లాప్టాప్స్ ఇలా ఏదో ఒకటి పిల్లలకి అందుబాటులో ఉంచాల్సి వచ్చింది. అదిగో.. అపుడు పిల్లలకి అయిన అలవాటు, ఇపుడు స్కూళ్ళకి వెళ్లి వస్తున్నా మానడంలేదు.  దీనితో  ఒకపక్క వాడి చదువు, ఆరోగ్యం గురించి బెంగ.. ఇంకోపక్క వాడసలు ఆ స్మార్ట్ ఫోన్ నుంచి కానివి ఏం నేర్చుకుంటున్నాడో  అనే ఆలోచనతో రజితకు దిక్కుతోచట్లేదు. 

Advertisement - Continue Reading Below

నేటి డిజిటల్ యుగంలో, తల్లిదండ్రులు పిల్లలను స్క్రీన్ నుండి దూరంగా ఉంచడం చాలా కష్టం. డిజిటల్ టెక్నాలజీ లభ్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి ఇంటిలో ఇప్పుడు రెండు నుండి మూడు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ పరికరాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఐతే, ఆన్‌లైన్ ప్రపంచం ఒక వ్యసనం లాంటిది. ఇది  పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్మార్ట్‌ఫోన్ వ్యసనం మీ పిల్లల మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, చదువు, నిద్ర అలవాట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది అలాగె కొనసాగించాల్సిన  అవసరం లేదు! గుడ్ న్యూస్ ఏమిటంటే, మీరు కొన్ని సాధారణ వ్యూహాలతో మీ పిల్లల స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తొలగించవచ్చు.

1. గుర్తించండి: పిల్లలు తమ పరికరాలలో ఎంత సమయం గడుపుతున్నారో అర్థం చేసుకోవడం కష్టం.  కానీ కేవలం ఫోన్‌లతో ఆడుకుంటున్నారా లేదా అనవసర విషయాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారా అనే తేడాను గుర్తించడం సులభం. పిల్లలలో స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి స్పష్టమైన సంకేతం ఏమిటంటే, ఫోన్ లేదా టాబ్లెట్‌ అందుబాటులో లేకపోతె వారిలో  కోపం, అసహనం పెరగడం.  పిల్లలలో స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తొలగించడానికి మొదటి అడుగు దానిని గుర్తించడం. 

2. అధికస్క్రీన్ టైం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించండి: మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించిన ప్రతిసారీ వారి నుండి దానిని లాక్కోవాలనే కోరిక మీకు ఉండవచ్చు. వాటి వెనుక ఉన్న కారణాలను వివరించకుండా, నియమాలను సెట్ చేయడం వల్ల ఆశించిన రిజల్ట్రాడు.  ఇంట్లో స్క్రీన్-టైమ్ నియమాలను సెట్ చేయడానికి ముందు, మీ పిల్లలకు చాలా ఎక్కువగా  స్క్రీన్ సమయంతో కలిగే ప్రతికూల ప్రభావాలను వారు అర్థం చేసుకునే భాషలో వివరించండి.

Advertisement - Continue Reading Below

3. స్క్రీన్ టైం పరిమితులను సెట్ చేయండి: ఒక రోజులో మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించగల సమయానికి లిమిట్ సెట్ చేయండి. పిల్లలు నియమాలకు కట్టుబడి ఉండటానికి, చిన్న పిల్లలను పెంచడంలో కొంత ఒత్తిడిని తగ్గించడానికి ఒక రొటీన్ సెట్ చేయడం చాలా మంచి ఐడియా అని నిరూపించబడింది. 18 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ లాంటివిఇవ్వకుండా ఉండటం మంచిది. 18-24 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మంచి పిల్లల కార్యక్రమాలను చూపవచ్చు. 2 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు రోజుకు సుమారు ఒక గంట స్క్రీన్ సమయాన్ని అనుమతించవచ్చు. 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, ఇతర ఆక్టివిటీస్, సరిపడే ఆరోగ్యకరమైన నిద్ర పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ద్వారా తల్లిదండ్రులు తగిన టైం లిమిట్ నిర్ణయించుకోవచ్చు.

4. ఇంట్లో డిజిటల్ ఫ్రీ జోన్‌లు: మీ పాప లేదా బాబు నిద్రపోయేటప్పుడు వారి ఫోన్‌ బెడ్‌రూమ్‌లో ఉంచకుండా ప్రయత్నించండి. ఇది నిద్రవేళ చిరాకు ఇంకా  అంత మంచివికాని నిద్రావస్థకు దారితీస్తుంది, తద్వారా మీ పిల్లల మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. చీకటి పడిన తర్వాత మీ చిన్నారి స్క్రీన్‌ వైపు ఎక్కువ సమయం వెచ్చించకుండా చూసుకోండి. భోజన సమయాలు, హోంవర్క్ సమయం మరియు బయటకు వెళ్ళేపుడు స్క్రీన్ సమయం ఉండకూడదు. ఫ్యామిలీ టైమ్లో కూడా. ఈ విధంగా కఠినంగా ఉండటంలో తప్పు లేదు. మీ పిల్లల రిక్వెస్ట్, అలకలకు లొంగిపోతే వారికి నియమాలను గౌరవించడం ఎప్పటికీ తెలియదు. 

5. శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించండి: మీ బిడ్డ బయట ఆడుకోవడం లేదా ఇతర ఫిజికల్ ఆక్టివిటీ చేసెలా, ఇంట్లోనే ఉంది  సాంకేతికతకు దూరంగా తగినంత సమయాన్ని గడిపేలా నిర్ధారించుకోండివాళ్ళు గాడ్జేట్లపై ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, ఇంట్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం గురించి ఆలోచించండి. పిల్లలతో శారీరికంగా చేసే ఆటపాటలు వారు  ఆనందదాయకంగా, ఎంగేజ్డ్ గా ఉండడానికి ఒక గొప్ప మార్గం.

6. మీడియా ఫాస్ట్: ఇది అమలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ, అనారోగ్యకరమైన స్మార్ట్‌ఫోన్ సంబంధాలను బ్రేక్ చేయడంలో మీడియా ఫాస్ట్ చాలా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను ఉపయోగించకుండా వారంలో ఒక రోజును కేటాయించండి. ఆ రోజున, మీ పిల్లలుఇంటి పనుల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి.  కొత్త ఆక్టివిటీస్, ఆర్ట్స్, లేదా  హాన్దిక్రాఫ్ట్ వంటికార్యకలాపాల్లో పాల్గొననీయండి.

7. రోల్ మోడల్‌గా ఉండండి: మీ పిల్లలు స్క్రీన్-టైమ్ నియమాలను పాటించాలని మీరు ఆశించే ముందు, మీరే మంచి ఉదాహరణగా ఉండాలి. పిల్లలు విన్నదాని కంటే, చూసే దాని నుండి ఎక్కువ నేర్చుకుంటారు. మీరు మొదట మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ట్రాక్ చేయండి.. ఆ తర్వాత పిల్లలు పాటించే విధంగా నియమాలను సెట్ చేసుకోండి.

మా బ్లాగ్ మీకు నచ్చిందా.. అందరికీ తెలిస్తే బాగుంటుంది అనిపించిందా? ఐతే Like, comment, share చేయండి!

 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...