ఆముదము ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి సహాయపడుతుందా?

మీ గర్భం యొక్క 38 మరియు 40 వారాల లో మీ ప్రసవ సమయం దగ్గరలో ఉన్నప్పుడు లేదా ప్రసవం సమయం దాటి పోయిన తరువాత కూడా ఎటువంటి నొప్పులు రాకుండా ఉన్న సమయంలో, అటువంటి సమయంలో మీకు అలసట, పాదాల వాపు, భారమైన కడుపు, వెన్నునొప్పి మరియు నిద్రలేని రాత్రులతో మీరు ఎంతో విసుగు చెందుతూ ఉంటారు. మా కజిన్ కూడా చాలా విసుగు చెందినది. అటువంటి సమయంలో ఆమె సిజేరియన్ షెడ్యూల్ చేయడానికి కూడా ప్రయత్నించింది. మీరు వీలైనంత త్వరగా ప్రసవ నొప్పులు కలిగి త్వరగా బిడ్డను ప్రసవించాలని కోరుకోవడం చాలా సహజం. మామూలు ప్రసవం కావడానికి మీరు యోగా వంటి శారీరక శ్రమలు ఎన్నయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె తన వైద్యుని సంప్రదించి నప్పుడు వారు ఆమెను వేచి ఉండమని చెప్పారు. మరియు రెండు రోజుల తర్వాత హాస్పిటల్ కు రమ్మని కోరారు. ఆమె సహజ మార్గాల ద్వారా నొప్పులను పొందగలమా అని తెలుసుకోవడం మొదలుపెట్టింది. సహజంగా నొప్పులు వచ్చే పద్ధతుల కోసం శోధిస్తున్నప్పుడు మొదటిసారిగా శృంగారం గుర్తుకు వచ్చింది. కానీ ప్రసవానికి దగ్గరగా ఉన్న సమయంలో ఆమె దానికి సిద్ధంగా లేదు. ఆ తర్వాత ఆమె ఆముదం అనే పేరును కూడా విన్నది మరియు దాని కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నది. ఈ బ్లాగ్ ఆ విషయానికి సంబంధించినది. ఆముదము మరియు ప్రసవము ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. నొప్పులను ప్రేరేపించడానికి ఆముదం ఎలా సహాయపడుతుందో మరియు నొప్పులు రావడానికి ఆముదం వాడడం వలన లాభాలు మరియు నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి దీనిని చదవడం కొనసాగించండి.
అయితే, మీరు దీనిని చదవడానికి ముందు దయచేసి నేను వైద్య నిపుణుడిని కాదు అని గుర్తుంచుకోండి. మరియు ఈ సమాచారం వైద్య సలహా తీసుకొని చెప్పబడినది కాదు. సహజంగా నొప్పులను ప్రేరేపించే ఆముదము , లేదా మరే ఇతర పద్ధతులను పాటించే ముందు మీ వైద్యుని సలహాలు తీసుకోండి. ప్రసవ నొప్పులను ప్రేరేపించడానికి ఆముదాన్ని ఉపయోగించడం అన్నది నా వ్యక్తిగత మరియు మా కజిన్ యొక్క అనుభవం మాత్రమే ఈ క్రింది బ్లాగులో రాయబడింది.
ఆముదము ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి సహాయపడగలదా?
ఆముదం ఒక శక్తివంతమైన విరోచనాల మందు. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కోసం లేదా వాంతిని కోసం ఉపయోగించబడుతుంది. ఇది అసహ్యకరమైన వాసన కలిగి ఉంటుంది. అదేవిధంగా భయంకరమైన రుచి కలిగి ఉంటుంది. అయితే త్రాగటం అప్పుడే మీకు వాంతి వస్తుంది. పురాతన కాలంలో ఆముదాన్ని ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి ఉపయోగించేవారు. ఆముదము ఈవిధంగా ప్రసూతి నొప్పులను ప్రభావితం చేస్తుంది.
మలవిసర్జన ప్రేరేపించడం ఆముదం యొక్క ప్రధాన లక్షణం. కొంచెం ఆముదం తీసుకోవడం వలన ప్రేగులలో కదలిక వస్తుంది. ఇది గర్భాశయ సంకోచాలకు దారి తీస్తుంది. ఈ గర్భాశయ సంకోచాలు నొప్పులను వేగవంతం చేస్తాయి.
శాస్త్రవేత్తలు ఆముదంలో రిసినోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నట్టుగా కనుగొన్నారు. ఇది ప్రేగులు మరియు గర్భాశయ గోడ కండరాలలో సంకోచాన్ని తెస్తుంది.
ఆముదము శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది కూడా సంకోచాలకు కారణం అవుతుంది.
సంక్షిప్తంగా, 100 శాతం ఫలితం వస్తుంది అని హామీ ఇవ్వలేకపోయినా, ఆముదం ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత ఆముదం తీసుకోవడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు :
ప్రసవానికి ముందు ఆముదం తీసుకోవడం వలన నొప్పులు త్వరగా ప్రారంభం కావడానికి సహాయపడుతుంది.
ప్రసవం తర్వాత కొంచెం ఆముదం తీసుకోవడం వలన మలబద్ధకాన్ని లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా సిజేరియన్ అయిన తర్వాత తలెత్తే సాధారణమైన మలబద్దకానికి ఎంతో ఉపయోగపడుతుంది. మామూలు ప్రసవం అయినప్పటికీ కూడా మలబద్ధకం లేకుండా చూసుకోవడం ఎంతో అవసరం.
నొప్పులను ప్రేరేపించడానికి ఎంత ఆముదాన్ని తీసుకోవాలి ?
ఆముదాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకండి. ఎందుకంటే , ఇది ప్రయోజనం కంటే కూడా ఎక్కువ హాని చేస్తుంది. ఆముదాన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎంతో చెడు ప్రభావానికి కారణం అవుతుంది. రోజుకి రెండు టేబుల్స్పూన్ల కంటే ఎక్కువ ఆముదాన్ని ఎప్పుడూ తీసుకోకండి. ఒక్కసారిగా ఎక్కువ తీసుకునే కంటే, మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి ఒకటి నుండి ఒకటిన్నర స్పూను ఆముదాన్ని మాత్రమే తీసుకోండి. దీని కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే దుష్ప్రభావాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
మా కజిన్ వారి స్నేహితులతో ఆముదం గురించి ప్రస్తావించినప్పుడు, వారు ఎక్కువ మోతాదులో ఆముదాన్ని తీసుకోవడం వలన చాలా పెద్ద విరోచనాలతో బాధ పడ్డట్టుగా ఆమె గమనించింది. ఇది ప్రసూతి నొప్పులు మరియు ప్రసవం యొక్క పూర్తి ప్రక్రియను క్లిష్టతరం చేసింది.
ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి ఆముదం ఎంత సమయం తీసుకుంటుంది ?
మేము సేకరించిన సమాచారం ప్రకారం, ఒక్కొక్క మహిళ మీద వేరువేరు ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మంది మహిళలకు ఆముదం తీసుకున్న తరువాత సాధారణంగా ఒకటి నుండి మూడు గంటలు సమయం తీసుకుంటుంది. మరికొంతమంది మహిళలు చాలా నెమ్మదిగా స్పందిస్తున్నారు (5 నుండి 24 గంటల వరకు) మరొకవైపు, కొంత మంది తల్లులకు ఆముదం ఎటువంటి ప్రభావాన్ని చూపదు. మీ శరీరం ప్రసూతినొప్పులకు సిద్ధంగా ఉంటే మాత్రమే ఆముదం పనిచేయగలదు. సంక్షిప్తంగా, ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి ఆముదం ఎంత వేగంగా పని చేస్తుంది అనేది వ్యక్తికి , వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది.
నొప్పులను ప్రేరేపించడానికి ఆముదము ఎలా ఉపయోగించాలి ?
ప్రసూతి నొప్పులు రావడానికి ఆముదంను వాడాలని మీరు అనుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ సూచించిన విధంగా ప్రతి 12 గంటలకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలని నిర్ణయించుకోండి. ఆ మోతాదులో తీసుకున్నట్లయితే మంచిగా పని చేయడమే కాకుండా తక్కువ దుష్ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన విధానాలు :
ఒక టేబుల్ స్పూన్ ఆముదం లో 4 ఔన్స్ ల నారింజరసం లేదా ఆముదం లోనే కఠినమైన రుచిని తగ్గించేటటువంటి మరేదైనా జ్యూస్ ను కలుపుకోండి.
నూనె మరియు జ్యూస్ ఎంత మాత్రము కలవవు. కానీ, తాత్కాలికంగా కొంత కలిసినట్లుగా ఉంటుంది.
ఆముదము తీసుకునేటప్పుడు ముక్కును మూసుకోండి . తద్వారా మీకు రుచి మరియు వాసన తెలియకుండా ఉంటుంది. అదే విధంగా ఆముదం యొక్క అసహ్యకరమైన రుచిని తగ్గించేటటువంటి జ్యూస్ను కలుపుకోండి.
పేరెంట్యిన్ చిట్కాలు...
గుర్తుంచుకోదగిన మరికొన్ని చిట్కాలు :
ఆముదాన్ని ఉదయాన్నే తీసుకోవడం ప్రారంభించడం మంచిది. తద్వారా మీరు దాని మంచి చెడులను తెలుసుకోవచ్చు.
ముందు రోజు రాత్రి మీరు మంచిగా నిద్ర పోయి ఉండాలి అని గుర్తుంచుకోండి.
డీహైడ్రేషన్ ప్రభావం మీ మీద ఉండకుండా మీరు ఎక్కువ నీటిని తీసుకోవాలి.
ఆహారాన్ని తక్కువ మోతాదులో రోజంతా తీసుకుంటూ ఉండాలి.
ప్రసూతి నొప్పులు రావడానికి ఆముదాన్ని ఉపయోగించడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
ప్రసూత నొప్పులకు మీరు ఆముదము తీసుకునేటప్పుడు చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఉంటాయి.
డీహైడ్రేషన్ పెరిగే అవకాశాలు :
ఆముదం తీసుకోవడం వలన అతిసారం మరియు వాంతులు ప్రధానమైన దుష్ప్రభావాలు. ఈ రెండు ఒకేసారి రావడం వలన నిర్జలీకరణకు దారితీస్తుంది. దీనివలన మీకు మరియు మీ బిడ్డకు కూడా ప్రమాదం సంభవించవచ్చు.
నొప్పులను పెంచుతుంది :
ఆముదము నొప్పులను పెంచడానికి కారణం అవుతుంది. ఇది ఒక క్రమం లేకుండా విపరీతమైన విధంగా గర్భిణీ స్త్రీ ని అలిసిపోయేలా చేస్తాయి. పురిటి నొప్పుల సమయంలో ఆముదాన్ని తీసుకోవడం వలన ఇది నొప్పులను మరింత కఠినతరం చేస్తుంది.
శిశువు యొక్క హృదయ స్పందనను పెంచుతుంది :
తీవ్రమైన ఒత్తిడి మీ బిడ్డకు ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ శిశువు యొక్క హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ నొప్పులను మరియు ప్రసవాన్ని కష్టతరం చేస్తుంది.
గర్భాశయం విడదీయకపోతే ఆముదం నొప్పులను ప్రేరేపించగలదా ?
ప్రసూతి నొప్పులను ప్రేరేపించడానికి ఆముదం యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, నెలలు నిండి ఉండాలి మరియు గర్భాశయం సాధారణంగా విడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అందువలన ఇది గర్భాశయం లోపలికి వెళ్లి అది విడదీయ పడితేనే ఇది పనిచేస్తుంది. అందువలన గర్భం యొక్క 38వ వారానికి ముందు ఆముదం ఎప్పుడూ ఉపయోగించకూడదు. గర్భాశయం విడదీయడం ప్రారంభించక పోతే ఆముదం నొప్పులను సమర్థవంతంగా ప్రేరేపించజాలదు.
మరొక్కసారి, మీ ఆరోగ్యానికి మీ వైద్యుడే ఉత్తమమైన న్యాయమూర్తి మరియు ఆముదము ఉపయోగించడం ప్రారంభించే ముందు వారి సలహా తీసుకొని వాడాలి అని నిర్ధారించుకోండి.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...