మీ పిల్లల్లో జలుబు పుండ్లు రావడానికి కారణాలు, లక్షణాలు మరియు నివారణ.

పిల్లల జీవితంలో మొదటి కొన్ని సంవత్సరాలు కొత్త అనుభవాలతో నిండి ఉంటాయి. మొదటి మూడు చక్రాల సైకిల్, మొదటి ఐస్ క్రీం, మొదటి స్నేహితుడు. ఏది ఏమైనా ఈ సరదాలు అన్నింటికంటే కూడా ఎంతో అనుభవాన్ని నేర్పించేది పిల్లలలోని జలుబు నుండి వచ్చే పుండ్లు.
జలుబు పుండ్లు అంటే ఏమిటి ?
జలుబు పుండ్లు లేదా నోటి హెర్పస్ అని కూడా పిలువబడే ఇవి మీ పిల్లలు పెదవులు మరియు నోటి చుట్టూ ఏర్పడే చిన్న బొబ్బలు. అవి వారి గడ్డము, ముక్కు మరియు బుగ్గలపై కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఆ బొబ్బల నుండి కొన్ని రోజుల్లో నీరు కారడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి ఎండిపోయినట్లు అయ్యి ఒకటి, రెండు వారాల్లో పూర్తిగా నయం అవుతాయి.
జలుబు పుళ్లు హెర్పస్ సింప్లెక్స్ వైరస్ టైప్-1 వలన ఏర్పడతాయి. వీటికి జలుబుతో ఎటువంటి సంబంధం లేదు. జలుబు పండ్లు చాలా సాధారణమైనవి. 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 20 శాతం మంది దీని బారిన పడుతున్నారు.
జలుబు పుండ్లకు కారణాలు :
ఏదైనా ఆరోగ్యము మరియు జ్వరం వచ్చినప్పుడు మీ పిల్లల రోగనిరోధకశక్తి పెద్దవారికిలాగా బలంగా ఉండదు. అందువలన మీ బిడ్డ అనారోగ్యంతో బలహీనపడినప్పుడు జలుబు పండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
సన్స్క్రీన్ లోషన్లు మరియు బాంలు వాడి సూర్యరశ్మి ద్వారా వచ్చే సమస్యలను ప్రతిఘటించనట్లయితే మీ పిల్లలకు జలుబు పుళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధి సోకిన వ్యక్తుల లాలాజలాన్కి పిల్లలు దగ్గరగా ఉన్నట్లయితే వారికి కూడా జలుబు పండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా వారు త్రాగిన పాత్రలలో త్రాగడం తినడం లేదా ముద్దుపెట్టుకోవడం లాంటివి చేసినట్లయితే ఇవి సోకే ప్రమాదం ఉంది.
జలుబు పండ్లు యొక్క లక్షణాలు :
పిల్లల్లో జలుబు పండ్లు సాధారణంగా పెదవులపైన లేదా నోటి చుట్టూ దురదతో మొదలవుతాయి. రెండు గంటల తర్వాత ఇది ఒక మచ్చగా ఏర్పడుతుంది. ఆ మచ్చ క్రమంగా ఎర్రబడడం ప్రారంభించి చిన్న పుండ్లు లేదా బొబ్బలు ఏర్పడతాయి . కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం కూడా వస్తుంది. చిగుళ్లు ఎర్రగా మారి వాపు వస్తుంది. కొన్ని సార్లు వైరస్ ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండానే తగ్గిపోతుంది. కానీ తరువాతి రోజుల్లో అది పునరావృతం అవుతూనే ఉంటుంది.
జలుబు పుండ్లకు చికిత్స :
జలుబు పుండ్లకు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు. కానీ అవి వాటంతట అవే తగ్గిపోతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు వైద్యం చేసే సమయాన్ని కొంచెం వేగవంతం చేస్తాయి. ఇది కొంతవరకు వ్యాప్తి కాకుండా కాపాడుతుంది. నొప్పి నుండి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది.
మీ పిల్లలు ఆ పుండ్లను తాకడం లేదా నాకడం లాంటి చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి.
ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి మీ పిల్లలు ఆహారం తీసుకునే గిన్నెలు , గ్లాసులు , టవల్లు మొదలైన వాటిని ఇతరులతో పంచుకోనివ్వకండి.
కొంతమంది శిశువైద్యులు ఇది వ్యాప్తి చెందిన మొదటి వారంలో పిల్లలను ఇంట్లోనే ఉంచాలని సూచిస్తున్నారు.
ఎక్కువ సమయం సూర్యరస్మి లో ఉండే పిల్లలకు వారి పెదవులపై సన్స్క్రీన్ లోషన్ లేదా బామ్ ను రాయండి.
క్లుప్తంగా చెప్పాలంటే జలుబు పుండ్లు చాలా సాధారణం. జలుబు పుండ్లకు చికిత్స లేదు. కానీ సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా దీన్ని నివారించవచ్చు మరియు నియంత్రించవచ్చు.
ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి . మీ నుండి వినడానికి మేము ఇష్టపడతాము !
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...